ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎంతో ముందుకు సాగుతుంది..అదే విధంగా మనిషి జీవిన విధానంలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో ప్రపంచం ముందంజలో ఉంది. ఒకప్పుడు మాట్లాడుకోవాలంటే టెలిఫోన్ ద్వారానే మాట్లాడుకోవాల్సి వచ్చేది..ఇక ఒకరినొకరు చూసుకోవాలంటే ప్రయాణాలు చేయాల్సి వచ్చేంది. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఎంతో డెవలప్ అయ్యింది. మనిషి జీవితాన్ని సెల్ ఫోన్ శాసిస్తుంది. మరోవైపు ఇంటర్నెట్ పుణ్యమాని పలు రంగాల్లో సులభతరమైన సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నెట్ ఆధారిత ఉపాధి రంగాలు కూడా విస్తరించాయి.  ఒకప్పుడు ఏదైనా తెలుసుకోవాలన్నా చూడాలన్నా పుస్తకాలు రీసర్చ్ చేసేవారు..కానీ ఇప్పుడు మనకు కవాల్సింది మన అరచేతిలోనే దొరుకుతుంది..కనిపిస్తుంది.
Image result for smartphones
ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి మనిషికి అదే ప్రపంచం అయ్యింది..ఇక సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి పలకరింపులే కరువయ్యాయి..ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ లాంటి సామాజిక మాద్యమాలతో అన్నీ సులభతరమయ్యాయి..అయితే వీటితో మంచి ఎంత ఉందో చెడు కూడా అదే విధంగా విస్తరిస్తుంది.  మొబైల్, కంప్యూటర్ ఉన్న ప్రతీ ఒక్కరి మెదళ్లలోను, సెర్చ్ ఇంజిన్స్ లోను తనకంటూ ఓ స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి పోర్న్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. చాలామంది యువత ఫోర్న్ సినిమాలు చూస్తూ దానికి బానిసలు అవుతున్నారు..అంతే కాకుండా మానవత్వం మరిచే విధంగా విశృంకల చర్యలకు పాల్పడుతున్నారు.
Image result for smart photnes
ఒక రకంగా చెప్పాలంటే ఈ టెక్నాలజీ పెరిగినప్పటి నుంచి మహిళలపై , యువతులపై చివరకు చిన్నారులపై కూడా అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి. తాము ఏం చేస్తున్నామో అనేది కూడా మరిచి ఉన్మాదులుగా మారిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి పబ్లిక్ గా ఫోర్న్ చిత్రం చూస్తూ అడ్డంగా బుక్ అయ్యాడు. పూణేలొ ఓ వ్యక్తి నడి రోడ్బుపై వర్షం పడుతున్న సమయంలో గొడుగు అడ్డం పెట్టుకొని పోర్న్ సినిమాలు చూస్తున్నాడు..అయితే అతగాడు అది చాలా సీక్రెట్ గా చూస్తున్నాడని భావించినా..అతను పోర్న్ చూస్తున్న సమయంలో.. పక్కనే ఉన్న గెయింట్ స్క్రీన్ కెమెరాల్లో ఆ దృశ్యాలన్ని రికార్డవడం.. అతగాడి తతంగమంతా ఆ భారీ స్క్రీన్ లో దర్శనమివ్వడంతో.. ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఉన్న జనమంతా అతని చర్యకు ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని జనాలు చూస్తున్నా పట్టించుకోలేని పరిస్థితిలో నిమగ్నం కావడం ఇది చూసి జనాలు నవ్వుకునే వారు నవ్వుకోగా..ఇదే పాడు బుద్ది అనుకుని తిట్టుకుంటూ పోయారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: