కాపు గర్జన లో అరెస్ట్ అయిన నాయకులను విడుదల చేయాలని దీక్ష చేస్తూ కాపుసంఘం నేత ముద్రగడ దీక్షకు దిగిన విషయం అందరికీ విదితమే. కాపు గర్జనలో ప్రభుత్వ ఆస్తులకు భంగం కలిగించారని కొందరు కాపు నాయకులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అంతేకాక వారిపై కఠిన సెక్షన్లను సైతం నమోదుజేసింది. అయితే వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ ఆమరణ నిరాహార దీక్షకు దిగితే ప్రభుత్వం ముందు ఈ దీక్షను పెద్దగా లెక్క చేయలేదు. 


Image result for mudhragada

అయితే, ఆ తర్వాత దీక్షా రోజులు పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వంలో కాస్త లజడి మొదలయ్యింది. దీక్ష రోజులు పెరగసాగాయి. అయితే ఈ దీక్షను అడ్డుకోవాలని ప్రభుత్వం బలవంతంగా ఆయన్ని అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించింది. ఆ సమయంలో ఏ మాత్రం పట్టు సడలని ముద్రగడ తమ దీక్షను ఆసుపత్రిలో కొనసాగించారు. అప్పుడు ముద్రగడ ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం వంటనే అరెస్ట్ అయిన కాపు నాయకులను విడుదల చేసింది. 


Image result for mudhragada

అయితే ఈ విజయం తెలుగుదేశం ప్రభుతవానికి గట్టి దెబ్బలా భావించిన ముద్రగడ మరో సారి ప్రత్యేక హోదా కోసం దీక్ష చేయాలని సమాలోచనలు చేస్తున్నారు. ఈరోజు హైద‌రాబాద్‌లో ప‌లువురు నేత‌ల‌ను క‌లిసిన ఆయ‌న ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశం గురించి మాట్లాడారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆమ‌ర‌ణ దీక్ష చేస్తే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌ని ఆయ‌న అన్నారు. అంతేకాదు ఆ దీక్ష‌లో త‌న‌కు కూడా చోటిస్తే రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం తాను దీక్ష చేయ‌డానికి సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. 


Image result for mudhragada

కాపులకు రిజ‌ర్వేష‌న్ కోసం తాను చేస్తోన్న ఉద్యమం కొన‌సాగుతుంద‌ని ముద్ర‌గ‌డ పేర్కొన్నారు. కాపులకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చెయ్యాలని ఆయ‌న డిమాండ్ చేశారు. వ‌చ్చేనెల 11 న రాజ‌మండ్రిలో కాపు స‌మావేశం నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. కాపుల ప్రయోజనం కోసం దీక్ష చేసి ప్రజల హృదయాలను గెలిచిన్ ముధ్రగడ, రాష్ట్ర ప్రయిజనాల కోసం దీక్షకు సైతం దిగడానికి వెనకాడబోనని ప్రకటించడం నిజంగా ఆహ్వానించదగ్గదే. అయితే దీనిపి ఇంకా ముద్రగడ స్పష్టత ఇవ్వలేదు. నాయకులందరిని సంప్రదించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: