మనం సినిమాల్లో పెద్ద పెద్ద దొంగతనాలు జరగడం చూస్తుంటాం..అది పెద్ద బ్యాంకుల్లో సీక్రెట్ డబ్బు, నగలు దొంగలు రక రకాల వేషాలు వేసుకొని చాలా పకడ్భందీంగా దోచుకుని వెళ్తారు..అయితే వారిని పోలీసులు వెంబడించడం చేజింగ్ సీన్లు ఇదంతా చూడటానికి చాలా బాగుంది అనిపిస్తుంది..కానీ ఎంతైనా అది సినిమా. కానీ నిజంగా ఇరవై ఐదు కోట్లు విలువ చేసే బంగారం గుట్టు చప్పుడు కాకుండా దోచుకువెళ్లారు..అందే కాదు ఆ దోచుకున్న బంగారం స్థానంలో  ఇత్తడి పూత పూసిన ఆభరణాలుంచారట..ఇదంతా ఎక్కడ జరిగిందో తెలిస్తే ముక్కుమీద వేలు వేసుకుంటారు. రోజూ వార్తలు చూస్తుంటాం విదేశాల నుంచి అక్రమంగా బంగారం తీసుకు వస్తు పట్టుబడ్డారు..వారి నుంచి కిలో బంగారం స్వాధీనం చేసుకున్నాం అని వస్తుంటాయి.
Image result for new delhi airport customs
అలాంటి  ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రాయంలో స్మగ్లర్ల సోదాల్లో పట్టుబడ్డ బంగారం కస్టమ్స్‌ గిడ్డంగుల నుండి మాయమైంది. ఎంతో పకడ్బందీ వ్యవస్థ నుంచి దొంగలు ఎలా మాయం చేశారని అనుమానాలు తలెత్తుతున్నాయి. దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న 80 కిలోల బంగారం మాయమైన ఘటనలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సీబీఐ విచారణకు ఆదేశించింది. గడిచిన నాలుగేళ్లలో కస్టమ్స్ అధికారుల ఆధీనంలో ఉన్న సుమారు రూ. 25కోట్ల విలువైన 80కిలోల బంగారు కడ్డీలు, ఆభరణాలు చోరీకి గురయ్యాయి.
Image result for new delhi airport customs
కాగా, బంగారం మాయమవడంపై ఢిల్లీ పోలీసులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. 2012 నుంచి ఈ ఏడాది జూన్ వరకూ స్వాధీనం చేసుకున్న బంగారంలో చాలా వరకు మాయమైందని ఆ ఫిర్యాదుల్లో పేర్కొనడం జరిగింది.బంగారం మాయమవడంపై ఢిల్లీ పోలీసులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీని వెనుక కస్టమ్స్ అధికారుల ప్రమేయం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆమోదం తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: