ఒకప్పుడు తమిళనాడులో వారిద్దరి స్నేహం చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు..అంత గొప్ప స్నేహితులు సీఎం జయలలిత, శశికళ పుష్ప.  కొద్ది రోజుల క్రితం శశికళ పుష్ప డిఎంకె ఎంపీని ఢిల్లీ విమానాశ్రయంలో చెంపదెబ్బ కొట్టారు. దీంతో ఆమెను జయలలిత పార్టీ నుంచి బహిష్కరించారు. అనంతరం ఆమె జయలలిత పైన సభలోనే మండిపడ్డారు. ఈ మేరకు శశికలను  రాజీనామా చేయాలని జయలలిత అల్టిమేటం ఇచ్చినప్పటికీ, తాను రాజ్యసభ పదవి నుంచి దిగిపోనని ఆమె స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ పదవికి రాజీనామా చేయబోనని తెలిపారు.  
Image result for jayalalitha shashikala
ఈ నేపథ్యంలో  ఎంపీ శశికళ పుష్పపై, ఆమె కుటుంబసభ్యులపై ఇద్దరు పనిమనుష్యులు లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తన ఆరోపణలతో కేసులు నమోదు చేశారు. అయితే, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను బాహాటంగా ధిక్కరించడంతోనే తనపై కేసులు నమోదయ్యాయని పేర్కొంటూ ఆమె మద్రాస్‌ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్‌ తీసుకున్నారు.
Image result for jayalalitha shashikala
ఇక శశికళ పుష్ప మాట్లాడుతూ.. తాను రాజ్యసభకు రాజీనామా చేసే ప్రసక్తి లేదన్నారు.రాజ్యసభకు రాజీనామా చేయాలని ఆమెకు జయలలిత అల్టిమేటం జారీ చేశారు. తాను మాత్రం రాజీనామా చేసే ప్రసక్తే లేదని శశికళ చెప్పి మరోసారి జయలలితకు పెద్ద షాక్ ఇచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: