ప్రజలను ముందుండి నడిపించేవాడే ప్రజా నాయకుడు. నేటి కొత్త తరం రాజకీయాల్లో నాయకులైతే ఉన్నారు కాని ప్రజా నాయకులైతే కోటికో నూటికో ఒక్కరు. నాటి రాజకీయాల్లో అందరూ ప్రజా నాయకులైతే, నేటి రాజకీయాల్లో కొందరే ప్రజా నాయకులు అవుతున్నారు.  ప్రజా నాయకుడు అంటే ఎలా ఉండాలి...? ఎవరిని ప్రజా నాయకుడిగా పరిగనించవచ్చు...? ప్రస్తుతం కొనసాగుతున్న పార్టీల్లో ప్రజానాయకులు ఉన్నారా...? రాను రాను రాజకీయాల్లోకి ప్రజా నాయకులు అవ్వాలనుకున్న వారికి అవకాశం లభిస్తుందా..? 


Image result for politics india

స్వార్థ పర రాజకీయాలు దేశాన్ని ఏలుతున్నా కొద్దీ దేశాన్ని ఏలే సత్తా ఉన్న ప్రజా నాయకులు కరువై పోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది...? ప్రజా నాయకులు పుట్టుకు రావాలంటే మనం ఏం చెయ్యాలి...? ఎలాంటి విధానాలు వారికి సాదర స్వాగతం పలుకుతాయి..? భారత్ కు స్వాతంత్ర ఉద్యమ సమయంలో పోరాడిన నాయకులంతా ప్రజా నాయకులే. నాటి రాజకీయాల్లోకి సామాజిక సేవ, అంకిత భావంతో, ప్రజలు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసి వారి సమస్యలను దూరంచేయాలనే అంకిత భావంతో రాజకీయాల్లోకి సజ్జనులు రంగప్రవేశం చేసే వారు. 


Image result for politics india

కానీ రాను రాను పరిస్థితులు మారాయి. కొందరు రాజకీయ నాయకుల స్వార్థ బుద్ధితో రాజకీయానికి అర్థాన్నే మార్చేశారు. అప్పటినుంచి రాజకీయాలకు ప్రజా నాయకులు కావాలని ఆలోచన ఉన్నవారంతా ఆమడ దూరంలో ఉంటున్నారు. రాను రాను రాజకీయాలు రౌడీలకు, దోపిడీదారులకు, అక్రమారులకు అడ్డాగా మారాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రజా నాయకుడు అంటే నిరంతరం ప్రజా శ్రేయస్సు కై పరితపించే వాడే ప్రజా నాయకుడు. ప్రస్తుతం ఇలాంటి అర్థాల్ని మనం పుస్తకాల్లోనే చదువుతున్నాం తప్పా వాస్తవ జీవితంలో దీనికి అర్థం పూర్తిగా మారిపోయింది.


Image result for politics india

 ప్రస్తుతం దేశ రాష్ట్రాల్లో కొనసాగుతున్న పార్టీల్లో ప్రజా నాయకులు లేరా అంటే ఉన్నారనే సమాధానం విస్పష్టం. కానీ వీరి శాతం చాలా తక్కువ. ఒక్కరో లేక ఇద్దరో ఇలా వారిని వెళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. ఇలా తక్కువ సంఖ్యలో ఉన్న ప్రజా నాయకుల ఆలోచాన విధానాలను అధిక సంఖ్యలో వ్యతిరేక ఆలోచనతో ఉన్న రాజకీయ నాయకులు ఆలోచనలతో సరితూగడం లేదు. మన దేశంలో ప్రజానాయకులు రాజకీయాల్లోకి అరంగేట్రం చేయాలంటే ముందర మన ఆలోచనా విధానంలో మార్పు రావాలే. 


Image result for politics india

ఎన్నికల సమయంలో ఈలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసే నాయకులకు పదవులను కట్టబెడితే రాజకీయాల్లో పేరుకుపోయిన మసి కాస్తైనా తొలగిపోతుంది. భారత రాజకీయ వ్యవస్థను మార్చే ఆయుధం ప్రజా బ్యాలెట్ మాత్రమే అనేది జగమెరిగిన సత్యం. అందుకే నాయకున్ని ఎన్నుకోవాలా...? ప్రజా నాయకున్ని ఎన్నుకోవాలా...? అని ప్రజలే ఆలోచించుకోవాలి. దేశ రాజకీయాల భవితవ్యాన్ని మార్చే సత్తా మాత్రం ప్రజలకే ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: