తిరుప‌తి స‌భ త‌ర్వాత జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ రాజ‌కీయాల‌ను వేడెక్కించాడు. ప‌వ‌న్ ప్ర‌సంగంపై వివిధ పార్టీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అన్ని పార్టీల నేత‌లు ప‌వ‌న్ పై కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ నుంచి కౌంట‌ర్ ఇవ్వాలంటే ఒక్క ప‌వ‌న్ మాత్ర‌మే ఉన్నారు. రెండో వ్య‌క్తి ఎవ‌రూ లేక‌పోవ‌డం ఇప్పుడు పెద్ద లోటుగా క‌నిపిస్తోంది. నిజానికి 2019 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్.. ప్ర‌భంజ‌నం ఉంటుంద‌ని స్ప‌ష్టమ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ పార్టీలో నంబ‌ర్-2, 3.. ఇత‌ర నేత‌లు క‌చ్చితంగా ఉండాల్సిందే. ఇంత‌కీ ప‌వ‌న్ త‌ర్వాత స్థానం ఎవ‌రికి ద‌క్క‌బోతోంద‌నేదే ఇప్పుడు హాట్ టాపిక్.ఇటీవల తిరుపతిలో నిర్వహించిన జనసేన సభతో తీర ప్రాంతంలోని అభిమానుల్లో కొత్త ఉత్సాహం సంతరించుకుంది.


ప్రత్యేక హోదా కోసం పార్టీ అధినేత పవన్‌ మాట్లాడిన తీరు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారడం, హోదా కోసం ఆందోళనలకు పవన్‌ పిలుపునివ్వడంతో భవిష్యత్‌ కార్యక్రమాలపై ఫ్యాన్స్ ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు. ఏపీకి స్పెష‌ల్ స్టేట‌స్ రావాల్సిందేనంటూ రంగంలోకి దిగిన ప‌వ‌న్.. మూడు ద‌శ‌ల‌ ఉద్య‌మానికి రంగం సిద్ధం చేశాడు. సెప్టెంబ‌ర్ 9 నుంచి రంగంలో దిగుతున్నాడు. దానికి వేదిక‌గా కాకినాడను ఎంపిక చేశారు కూడా. ప్రీప్రొడ‌క్ష‌న్2014లో భారీ అంచ‌నాల మ‌ధ్య ఏర్ప‌టైన‌ జ‌న‌సేన‌.. అప్ప‌టి ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంది. అయితే, అప్ప‌టి రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఏపీలో చంద్ర‌బాబుకు, ఢిల్లీ లెవిల్‌లో న‌రేంద్ర మోడీకి జ‌న‌సేన అధినేత‌గా ప‌వ‌న్ మెగా ప్ర‌చారం చేసిపెట్టారు. ఆ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ప్ర‌చారం ఆ రెండు పార్టీలు అధికారంలోకి వ‌చ్చేందుకు కాస్త హెల్ఫ్ అయ్యింది.


అయితే అప్ప‌టి నుంచి ప‌వ‌న్ పొలిటిక‌ల్ పూర్తిగా యాక్టివ్ కాలేదు.  అడ‌పాద‌డ‌పా కొన్ని ట్వీట్లు, ఇంకొన్ని ప్ర‌క‌ట‌న‌లు మిన‌హా నేరుగా రాజ‌కీయాల్లో జోక్యం చేసుకోలేదు. అయితే, ఆయ‌న సేన మాత్రం ఎప్పుడెప్పుడు త‌మ నేత ప్ర‌జ‌ల్లోకి వ‌స్తాడా? అని ఎదురు చూస్తూనే ఉంది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌.. అదిరిపోయే ప్లాన్‌తోనే తిరిగి అరంగేట్రం చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఎట్టి ప‌రిస్థితిలోనూ 2019 సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఏపీలో జ‌న‌సేన టాప్ పొలిటిక‌ల్ పార్టీగా నిల‌బ‌డేలా ప‌వ‌న్ తెర‌వెన‌క క‌స‌ర‌త్తులు స్టార్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది.ఇందులో భాగంగా జ‌న‌సేన‌కు ద‌మ్మున్న లీడ‌ర్ల‌ను ప‌వ‌న్ రెడీ చేస్తున్న‌ట్టు స‌మాచారం.


ఇందుకోసం ప‌వ‌న్ త‌న‌కు కావాల్సిన‌, త‌ను కోరుకుంటున్న ల‌క్ష‌ణాలున్న నేత‌ల‌ను ఎంచుకుంటున్నార‌ట‌. వారిలో గ‌తంలో కేంద్ర మంత్రులుగా పనిచేసి ప్ర‌స్తుతం బీజేపీలో అంత ప్రాధాన్యం లేకుండాపోయిన ఇద్దరు నేతలతో పాటు గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, విజయవాడకి చెందిన ఓ మాజీ ఎంపీతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన‌ మంత్రి, టీడీపీనేతతో పాటు రాయలసీమలో బలమైన రెడ్డి నేత జ‌న‌సేన‌కు జైకొట్టేందుకు, ఆ పార్టీ కండువా క‌ప్పుకునేందుకు రెడీ అయ్యార‌ట‌. వీరితోనే ప‌వ‌న్ పార్టీని న‌డిపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. నిజానికి వీరంతా ఫైనాన్సియ‌ల్‌గా కూడా ప‌వ‌న్‌కు స‌పోర్ట్ చేస్తార‌ని విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. ఒంటి చేత్తో ప‌వ‌న్ పార్టీని ముందుకు తీసేకెళ్లాలంటే అంత ఆషామాషి కాదు. పార్టీకి కొంత‌మంది స‌రైన లీడ‌ర్లు ఉండాల్సిందే. మ‌రోవైపు నరసాపురం నియోజకవర్గంలో కొందరు అభిమానులు ఎవరిని అహ్వానించాలన్నదానిపై తర్జనభర్జనలు పడుతున్నారు.


ప్రస్తుతం పార్టీలకు అతీతంగా ఉన్న ప్రముఖ వైద్యులు డాక్టర్‌ కోటేశ్వరరావు పేరును కొందరు ఆభిమానులు సూచించారు. నిజానికి నరసాపురం నియోజకవర్గంలో ఇటు చిరు అభిమానులు కూడా పవన్‌ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇక్కడ పరిపాటి. ఇప్పటి వరకు డాక్టర్‌ కోటేశ్వరరావు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ చిరు, పవన్‌ అభిమానులు చేపట్టే కార్యక్రమాలకు బాసటగా నిలుస్తూ వస్తున్నారు. అయనతోపాటు చైర్‌పర్సన్‌ రత్నమాల సోదరుడు కొవ్వలినాయుడు పేరును కూడా అభిమానులు తెరపైకి తెస్తున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో స్థిరపడ్డారు. తరచూ నియోజకవర్గానికి వచ్చిపోతుంటారు. దీనికి ఆయన ఏ విధంగా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది. ప్రస్తుతం కొవ్వలి కుటుంబం టీడీపీలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన జనసేన పగ్గాలు చేపడతారా? అన్నది సందేహామే. వీరిద్దరు కాదంటే... ఎవరిని నాయకునిగా నియమించుకోవాలన్న దానిపై అభిమానులు సమాలోచనలు చేశారు.


ఈ నేపథ్యంలో త్వరలో జనసేన పగ్గాలు ఎవరూ చేపడతారన్నది ఆ నియోజకవర్గంలో హాట్‌టాఫిక్‌గా మారింది.వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేయ‌డం ఖాయ‌మైపోయింది. ఎన్నిక‌ల‌కు మ‌రో రెండున్న‌ర సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉంది. ఈ లోగానే పార్టీ నేత‌ల‌ను త‌యారు చేసి రంగంలోకి దింపితేనే ఏపీ రాజ‌కీయాల్లో తిరుగులేని ప్ర‌భావం చూపించ‌వ‌చ్చు. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ అన్ని కులాల‌కు చెందిన వారితోనే త‌న ప‌వ‌ర్‌ఫుల్ టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నాడ‌ట‌. మొత్తానికి ప‌వ‌న్ ఏర్పాటు చేయ‌బోయే టీమ్ ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటేనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో దుమ్మురేపొచ్చు. మ‌రి ప‌వ‌న్.. సెల‌క్ట్ చేసే ఆ టీమ్ ఎలా ఉండ‌బోతోందో మ‌రికొద్ది రోజుల్లోనే తేల‌బోతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: