గతం లో చేసిన పాపాలు ఎప్పటికీ వదలవు అంటారు. ఆ విషయం తెలిసినవారు కాబట్టే ఏదైనా మహాపాపం చేసినప్పుడు, పొరపాటుగా చేసినా కూడా దాన్ని పూర్తిగా సమాధి చేసి మరీ ముందుకు వెళతారు మన పొలిటీషియన్ లు. తమ రాజకీయజీవితంలో చేసిన తప్పు ఎక్కడా బయటపడే ఛాన్స్ రాకుండా చూసుకోవడం లో వీరు సిద్ధ హస్తులు. ముఖ్యంగా రాజకీయ నాయకులని పర్సనల్ కోణం నుంచి అంటే వారి ఫామిలీ బ్యాక్ గ్రౌండ్, భార్యా పిల్లలతో వారు మెలిగే శైలి ఇలాంటివి అన్నీ చూసిన తరవాతనే నాయకుడిమీద ఒక అభిప్రాయం ఏర్పరుచుకునే భారతదేశం లో, రాజకీయ నాయకులు తమ చేతికి మట్టి అంటుకోకుండా రోజుకి ఒక ప్లాన్ తో ముందుకు పోతుంటారు. చూస్తుంటే ఓటుకునోటు కేసు విషయం లో మకిలీ ఇంకా చంద్రబాబు ని వదిలినట్టుగా కనపడ్డం లేదు.


రేవంత్ రెడ్డి పుణ్యమా అని సెల్ ఫోన్ కాల్ లో తన గొంతుతో సహా అడ్డంగా దొరికిన చంద్రబాబు అప్పటి నుంచీ ఆ విషయం కవర్ చేస్కోలేక కిందా మీదా పడుతున్నారు. లీగల్ గా తన మీద ఈ కేసు ఉపయోగించిన కెసిఆర్ తెలంగాణా నుంచి చంద్రబాబు పూర్తిగా ఖాళీ చేసే విధంగా తరిమి కొట్టేసారు అంటే అది ఈ కేసు పుణ్యమే. తెలంగాణా లో తెలుగుదేశంకి మినిమం సీట్లు రావు అని అక్కడి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తేలిపోయింది అంటే ఈ కేసు దయ వలనే. ఒకే ఒక్క చోట అడ్డంగా దొరికిన (లేదా దొరకేలా చేసిన) వ్యవహారం తెలుగుదేశం కీ చంద్రబాబు కీ తెలంగాణా లో గుక్కెడు నీళ్ళు లేకుండా చేస్తోంది.


ఎన్నో స్వయంక్రుత అపరాధాల వలన కూడా ఇలా జరిగి ఉండచ్చు గానీ కేసు ప్రభావం మాత్రం గట్టిగా ఉంది. కెసిఆర్ కి ఫేవర్ గా ఉన్న అక్కడి మీడియా గొంతెత్తి చంద్రబాబు ని విలన్ ని చేసి పారేసింది కూడా. ఇది జరిగి రెండేళ్ళు కావస్తూ ఉన్నా ఇంకా ఆ తలనొప్పి బాబుగారిని వదలడం లేదు. ఓటుకు నోటు కేసు విషయం లో ఏసీబీ కోర్టులో తాజాగా విచారణ కి ఆదేశాలు జారీ అవ్వడం తో చంద్రబాబు చుట్టూరా ఉచ్చు బిగుస్తోంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిన్నటికి నిన్న తెలంగణా ముఖ్యమంత్రి కెసిఆర్ గవర్నర్ తో అత్యవసరంగా భేటీ అయ్యి రెండున్నర గంటల పాటు పర్సనల్ గా మాట్లాడారు.


ఈ అత్యవసర భేటీ అంతా కూడా ఓటుకు నోటు కేసు విషయమై జరిగింది అని తెరాస వర్గాలు బల్లగుద్ది చెబుతున్నాయి. పోనీ వారిద్దరూ వేరే ఏదైనా విషయం మీద మాట్లాడుకోవడం కోసం కలుసుకున్నారా అంటే కాదని చెప్పడానికి బలమైన కారణాలు కూడా కనపడుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ - గవర్నర్ తో భేటీలో ఉన్న సమయంలోనే అక్కడకు తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్ - అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి కూడా వచ్చారు. వీరి నలుగురి మధ్యనా చర్చ ఆసక్తికరంగా సాగింది అంటున్నారు. గతంలో కూడా వీరు నలుగురూ లేదా ముగ్గురూ తరచూ కలిసేది ఓటుకు నోటు కేసు విషయం లో మాత్రమే. ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ కనిపిస్తూ ఉండడం తో చంద్రబాబు చుట్టూ తీవ్రమైన ఉచ్చు బిగుస్తోంది అంటున్నారు విశ్లేషకులు.

కెసిఆర్ కోరుకున్నట్టు లేదా ప్లాన్ చేసినట్టు చంద్రబాబు తెలంగాణా నుంచి దాదాపు తొంభై శాతం దూరం అయిపోయారు ఇక మీదట అక్కడ పోటీ చేసినా గెలిచే సత్తా ఆయన పార్టీ కి ఎటూ లేదు మరి ఇప్పుడు బాబుని కెసిఆర్ ఇంకొకసారి ఎందుకు టార్గెట్ చేస్తున్నట్టు ? 

మరింత సమాచారం తెలుసుకోండి: