ప్రపంచంలో మహానుభావులు ఎంతో అరుదుగా కనిపిస్తుంటారు..ఒక్కరే కానీ ప్రపంచం మొత్తం గుర్తించిన వారు అవుతారు. ఇలాంటి వారు చాలా కొద్ది మందే ఉంటారు. అలాంటి వారిలో ఒకరు సాహిత్యరంగంలో తన ప్రతిభ దశదిశలా చాటి చెప్పారు..మరొకరు సైంటిస్టుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించారు. ‘జనగనమన’ భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి, రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియా కు చెందిన వ్యక్తి ఆయనే...ఇక సైన్స్ లో ఎన్నో కొత్త కొత్త ప్రయోగాలు చేసి అందరిచే ఔరా అనిపించుకున్న మహా మేథావి ఐన్ స్టీన్.

ఆధునిక భౌతికశాస్త్రానికి రెండు స్తంభాల్లో ఒకటైన జెనరల్ థియరీ ఆఫ్ రిలెటివిటీని అభివృద్ధి చేశారు. ఆయన తత్త్వశాస్త్రంలో కూడా ప్రభావంతమైన కృషి చేశారు.మాస్ ఎనర్జీ ఈక్వలెన్స్ ఫార్ములా E = mc2 ను కనిపెట్టారు ఆయన.

ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ ఫార్ములా.1921లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు.క్వాంటం థియరీ పరిణామ క్రమం పరిణామ క్రమానికి ముఖ్యమైన ఫొటో ఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ లా ను కనిపెట్టినందుకు ఈ బహుమతి అందుకున్నారు ఆయన. 


మరింత సమాచారం తెలుసుకోండి: