అమరావతి నిర్మాణములో సింగపూర్ పాత్ర ప్రజలకు తేటతెల్లం కావలిసిఉంది. అసలు స్విస్-చాలెంజ్ లో దాగి ఉన్న రహస్యాలేమిటి అనేది ప్రజలకు వివరించవలసిన అవరసరం ప్రజాప్రతినిధి గా తెలుగుదేశం పార్టీ అధినేతగా, ప్రభుత్వాన్ని నడిపించే నాయకత్వానికి భాధ్యత వహించె ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి ఉంది. ఐదులక్షల కోట్ల విశ్వనగర మహా నిర్మాణం లో ఎలాంటి పారదర్శకత పాటించక పోవటం అనేది క్షంతవ్యం కాదు. తాను ప్రజా ప్రతినిధే కాని సార్వంసహాసార్వభౌముడు కానే కాదు. తాను మెజారిటీ ప్రజలచేత ఎన్నుకోబడ్డా సీమాంద్ర ప్రజలందరికి నాయకత్వం వహించేటప్పుడు కనీసం ఇలాంటి మహోత్కృష్ఠ నిర్ణయాల్లోనైనా సర్వజనామోదం పొందాలి. కనీసం సభలో నైనా ఈ నిర్మాణంపై సరైన నిర్మాణాత్మక చర్చ జరగాలి.  అదుపు తప్పుతున్న చంద్రబాబు పారదర్శకత లేని రాజకీయ ఆర్ధిక తుదకు వ్యక్తిగత వ్యవహారాల తీరుతో ప్రజాస్వామిక పాలనకు ఉభయ రాష్ట్రాల్లో తీవ్ర విఘాతమై పాలనకు భ్రష్టత్వం ప్రాప్తిస్తుంది. అమరావతి అమరావతి అంటూ తన ఎలెక్షన్ మానిఫెస్టో ప్రకారం ఇచ్చిన వాగ్ధానాలను మరచిపోయింది తెలుగుదేశం. ఉదాహరణకు  "బాబొస్తాడు జాబొస్తుంది" లాంటి నినాదంతో గెలిచి నిరుద్యోగులని ప్రజల్ని మరచిపోయారు. ఈనాటికి నిరుద్యోగ భృతి, విడో పెన్షన్, ఇవన్నీ నీటిమీద రాతలా, నాయకుల కోతలా అన్నట్లు ఫీలవుతున్నారు ప్రజలు. ప్రజలు అంటే తెలుగుదేశం కార్యకర్తలు కాదని మరవరాదు. అవినీతి లేని పరిశుభ్ర పాలన ఇస్తానన్న బాబు అసలు అవినీతి ఎన్నిరకాలుగా జరపొచ్చో నిరూపిస్తున్నారు.  సింగపూర్ పెరుతో తీసుకున్న నిర్ణయాలన్నీ దేశానికి ప్రమాదకరమైనవే. శతృదేశం చైనా తో గాని, పాకిస్థాన్ వ్యాపార బంధా లు దేశానికి ప్రమాదకారులు ఆ దేశపు ప్రజలు. 

 

చైనా లాంటి శత్రుదేశాలు సరపరా చేసిన  ఎలెక్ట్రానిక్ ఇంప్లెమెంట్స్ పై కూడా నిఘా పెట్టకపోటే మన దేశానికి రక్షణ సంబంద సమస్యలు ఉత్పన్న మౌతాయి. ఈ విషయాలు తెలుగు ముఖ్యమంత్ర్లకు తెలియదా?- పారిశ్రామిక శ్రామికులకు వారి పని విధానం పై నియంత్రణ, వారి పరిరక్షణ, మానవ విలువలు కలిపించని ఆదేశం ఇబ్బడి ముబ్బడిగా అతి కనీస ధరలో కుమ్మరించే వస్తుసేవలు మనదేశానికి ఆమోదయోగ్యం కావు.  "తాను చచ్చైనా మన మార్కెట్ ను చంపటమే చైనా విధానం" అలాటి దేశాన్ని వారినుండి ఏరకమైన సహాయం తీసుకోవట మైనా దేశద్రోహమంతటి ప్రమాదకరం. మేధావులు అనేకసార్లు చైనా వస్తు, సేవల బహిష్కరణ చేయమంటే ......- మనం ఇప్పుడు చైనా చుట్టూ పరిశ్రమల కోసం తిరగటం శ్రేయొదాయకం కాదు.

 Image result for amaravati singapore

 

అలాంటివేమీ లేకుండా:

 

ప్రతిపక్షాన్ని ఆసభ్యులని కొనేసి (ఓటుకు నోటే ఒక ఉదాహరణ) ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసిన విషయం సీమాంద్ర జాతికి తెలుసు. తద్వారా ప్రజల్లో ప్రశ్నించే ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసి సభను ఏకపక్ష సభగా మార్చి - ఒక విధమైన దానవ ప్రవృత్తితో ఆ ప్రజలకు హర్షనీయం కాని పనులు చేస్తూ కొనసాగించే పాలన ప్రజలకు తేటతెల్లమౌతుంది.

 

అంతే కాదు ప్రశ్నించే ప్రతి వ్యక్తిపై వ్యవస్థపై తన మంత్రి మండలిలోని ప్రతి వ్యక్తితో దాడి చేయించటం దినచర్య గా మారిపోయింది.

 

తమ పక్షానికి చెందిన ప్రసారమాధ్యమాల తో సరైన వార్తలు రాకుండా, సమాచారాన్ని వారికి అనుకూలంగా మార్చి ప్రచురించటం, సమయాలకు స్పందించకుండా ఆ మీడియా ప్రజా దృష్ఠిని దిశ దశ మార్చే నియంత్రణలో నడిపించె దుష్ఠ ప్రవృత్తి ఈ పచ్చ మీడియా లో పచ్చకామెర్ల వ్యాదిలాగా ప్రభలింది.

 

ప్రజాస్వామ్య పాలకులకు ప్రశ్నించేవారికి సమాధానం నిరంతరాయంగా సమాదానం అందే లా చూడాలి. అదిజరగక పోగా నిరంతరం వారిపై సభలోను, సభవెలుపలా కూడా మాటలోతో చేతలతో, అవసరమైతే సామన్ దాన, భేద, దండోపాయాలను ప్రయోగించే అప్రజాస్వామిక చర్యలు అడ్డూ అదుపు లేకుండా జరిగిపోతున్నాయి. ఉదాహరణకు వైసిపి మంగళగిరినియో జక వర్గ ఎం.ఎల్.ఏ. ఆళ్ళ రామకృష్ణారెడ్డికి బెదిరింపు ఫొన్ కాల్స్, బెదిరింపు లేఖలు మొదల య్యాయట.  అలాగే  “ఎన్.టి.వి”  నుండి  కొమ్మినేని శ్రీనివాసరావు అనే పాత్రికేయునికి ఉద్వాసన, ఇలా చెప్పుకొంటూపోతే సరిపోదు ఒక వ్యాసమే రాయాలి. అతి దురహంకారఉద్వా సన ప్రతిపక్ష నగరి నియోజక వర్గ ప్రజాప్రతినిధి-ఎం.ఎల్.ఏ. రోజాని సభా కార్యక్రమాల నుంచేకాక సభ్యత్వం నుండి కూడా ఒక సంవత్సరం పాటు బహిష్కరణ. అంటే ఇప్పుడు నగరి నియోజక వర్గానికి ప్రజా సమూహానికి చట్టప్రకారం సభలో ప్రజాప్రాతినిద్యం లేకుండా చేయటం ప్రజాస్వామ్య లక్షణమా!  

 Image result for amaravati singapore

రోజా ముఖ్యమంత్రి విషయములో వాడిన పదజాలం క్షంతవ్యం కాదు. కాని ఇంతకంటే దుర్మార్గమైన పదజాలం వాడారు బొండా, రావెల, అచ్చెన్నాయుడు..ఇలా చెప్పుకుంటే జగన్ విషయములో ఒక ఉద్గ్రందమే రాయొచ్చు. అందుకే రోజా అనబడే మహిళా ఎం.ఎల్.ఏ ని బలిచేయటం న్యాయమా? న్యాయస్థానం సైతం క్షమించటాన్ని సభాపతికి నిర్ణయానికి వదిలినప్పుడైనా సరిచేసుకోవచ్చు. దీని అధికారమాదాందత కాక మరేమనాలి?  

   

అమరావతి నిర్మాణములోని పారదర్శకతలేమి-దాని "బ్రాండ్ వాల్యూ" ని పూర్తిగా దిగజార్చింది. ఆర్ధికంగా భారతీయ మధ్యతరగతి అంతకంటే దిగువనుండే వర్గాలకు అమరావతి ఆవాస యోగ్యం కానిదిగా నిర్ధారించబడింది. సీమాంద్ర సాంప్రదాయాలను, భారతీయతను అమరావతి ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రతిబింబించటం కష్టమే. దాని పునాదుల్లోనే 70% వ్యయసాయిక భారతం అంతరించింది. భూములు లాక్కున్నారన్న అప్రతిష్ట ఈ ప్రభుత్వం ఒకవేళ 2019 లో అధికారములోకి రానివ్వకుండా ఉవ్వెత్తున వెల్లువెత్తే అవకాశం ఉంది. అలాగే నగరములోని పవిత్రత సాంస్కృతిక దైవిక సాంప్ర దాయాలని ప్రతిబింబించే దేవాలయాలను, అనేక ప్రార్ధనాలయాలని నిర్దాక్షిణ్యంగా అతి కిరాతకంగా కూల్చివేసి తరలించిన వైనం సాంప్రదాయ వాదులకే కాదు సాధారణ ప్రజలకూ వ్యధకలిగిస్తుంది. 

Image result for amaravati singapore 

కేసినేని నాని-బుద్దా వెంకన్న- దేవాలయాలపై దాడి ఎవరు చేసినా నేరమే.  రహదార్ల అభివృద్ది అంటే దేవాలయాల కూల్చివేత కాదు.  టిడిపి నేతలు కేసినేని నాని, బుద్ధ వెంకన్నలు  ఆరోజు రాత్రి ప్రవర్తించిన తీరు విజయవాడ ప్రజలు మరిచిపోతారు అను కోవటం భ్రమ.  వైదికులను  నిందించిన తీరు దయనీయం బాధాకరం. ఈ కుల దురహం కారమే అమరావతి కి చేటు తెస్తుంది.  టిడిపి హిందూమతం పై చేసిన దాడి ఆ పార్టీకి అమరావతి లో శరాఘాతమే. మంత్రులు ఇక దేవాలయాల కూల్చమన్న మాట ఇప్పటి వరకు చేసింది నేరమనే ఒప్పుకున్నట్లే.  హిందూ ద్రోహానికి చంద్రబాబు తెలుగు జాతి కి క్షమాపణ చెప్పి-బుద్దా వెంకన్నను, కేశినెని నానిపై చర్యలు తీసుకొని ఉంటే  కొంత లో కొంత ఉపశమనం లభించి ఉండేది. ఇవన్నీ ఆ దైవదూషణ ఖాతాలో జమయ్యేవే.

 

మఠాధిపతులను దొంగబాబాలు అన్న కేసినేని నాని, గోశాలకు నీరు, విద్యుత్ సరపరా నిలిపివేసి సిబ్బందిని, ఇబ్బందికి గురిచేసిన టిడిపి ప్రభుత్వం, గణేష్-రాహుకేతువుల దేవాల యాల కూల్చివేత ఇవన్నీ ఆ దైవదూషణ ఖాతాలో జమయ్యేవే. తాను ఎన్నికలప్పుడు గెలవాలని దైవాన్ని వరాలు కోరిన నాని,  నేడు ఆ దైవం పైనే దాడిచేస్తున్నట్లు పండితులు ఘోషించారు.   చంద్రబాబు హైందవాన్ని వదలి భౌద్ధం వృద్దికి రహదార్లు వేస్తున్నారని పండితుల ఆరోపణ. సహస్రాబ్ధాల ఇంద్రకీలాద్రి, విజయపురి చరిత్రకు తిలోదకాలిచ్చి నిన్నకాక మొన్న పుట్టిన సింగపూర్ కు జైకొట్టే చంద్రబాబుకే మాత్రమైనా బుర్ర ఉందా? మతి గతి తప్పటముతో, అభివృద్ది అనే అంశం పట్టుకుని సర్వం వదలి సింగపూరు అంటూ సంస్కృతి పతనానికి దార్లు వేశాడు. అనుమానంలేదు బాబు ఆయన పార్టీ వాళ్ళంతా మహమ్మద్-బీన్-తుగ్లక్లే- బాబు విదేశీ మమకారం ఒకవిధంగా దేశద్రోహమే.

 Image result for amaravati singapore

విభజనాంతరం తామూ తాము ఉభయ  భ్రష్ఠత పొందామనీ అశలన్నే అణగారి పోయాయని, నీరుగారి పోయిన సీమాంద్రు యువతకు  నారా చంద్రబాబు నాయుడు తనకు దశాబ్ధకాలము ముఖ్యమంత్రిగా   పని చేసిన అనుభవాన్ని ఏరగా చూపి, ఒక రకమైన ప్రచార సునామీ సృష్ఠించారు. తరవాత ఆ ప్రచారహోరుకు మోడీ ప్రభంజనం తోడై ఈ మొత్తానికి పవంకళ్యాం  ధాటికి వీచిన పవనాల వెల్లువలో  "తెలుగుదేశం – భారతీయ జనతా పార్టీ"  మైత్రిని పవన్ కళ్యాణ్  జనసేన సాక్షిగా సీమాంద్ర లో జనహర్షామోదాలతో వైసిపికంటే 2% ఎక్కువ ఓట్లు ఎక్కువ సీట్లు ఇచ్చిగెలిపించారు.  అయితే ఈ గెలుపును అధినేత హృదయములో కొత్త ఆశలు చిగిర్చాయి. వ్యూహాలు రూపుదిద్దుకున్నాయి.   

 

ఈవిభజన గాయాన్ని పెద్దగా చేసి కాంగ్రెస్ ను హంతకి గా  చూపుతూ - ఈ వ్యధను జనం మరచేలా హైదరాబాద్ ను మించిన విశ్వ నగరం ఆంద్రులకు నిర్మిస్తానని,  ఐటి రంగాన్ని హైదరాబాద్  లో ఒక మహా నగరం గానే నిర్మించానని అదే సైబరాబాద్.  తానే సృష్టించానని,  ఆ నగర నిర్మాణానుభవం తో అది తనకే సాధ్యమౌతుందని విపరీత ప్రచారం చేసుకున్నారు.  ఫలితం ఘన విజయం. అయితే మనము  ఊహించని సుదూరలక్ష్యము ఆనాడే  మదిలో పురుడు పోసుకుంటూ ఉంది. అందరూ విభజన విషయములో దఃఖ సాగరములో ఉన్న సమయములో "ఐదులక్షలకోట్ల 'అమరావతీనేవిశ్వనగరం' అనే బృహన్నిర్మాణానికి ప్రతి పాదనలతో శ్రీకారం చుట్టి రాజమౌళి సినిమాలోని మాహిష్మతీ నగరాన్ని మించిన కంప్యూటర్గ్రాఫిక్స్ (సిజివర్క్)  బొమ్మలు చూపించి మనం కోల్పోయిన హైదరాబాద్ ను మించిన మహా నిర్మాణము చేసి మీకు ఒక దశాబ్ధ కాలము లో అందిస్తానన్నారు.

 Image result for amaravati singapore

అప్పటి వరకు హైదరాబాదే మన సమైక్య రాజధానని ప్రజాహృదయాలకు స్వాంతన కలిగించారు.  దీనికీంత సినిమా ఉందని ఊహించని మోడీ డిల్లీని మించిన రాజధాని నిర్మించటానికి సహాయం చేస్తానన్నారు. ప్రజలకు హామీ ఇచ్చారు.  కానిరాజధాని అంటే  రాజ్యాంగ వ్యవస్థలకు, నిర్వాహణకు, ప్రభుత్వానికి పాలనకు, శాంతి-భద్రత లకు సంభందించిన భవనాలు,  ఆరోగ్యం, విద్య, శాస్త్ర-సాంకేతిక,  రంగాల అ భివృద్దికి తగిన సదుపాయాలు సాధనసంపత్తి,  వివిధజాతీయ, అంతర్జాతీయ వైద్య, విద్యా, విజ్ఞాన సంస్థలకు భవన తదితర నిర్మాణాలను పూర్తి చేయటానికి ఒక పదివేల కోట్లు రూపాయలు వ్యయమవుతుండ వచ్చని భావించి ఉండ వచ్చు.  అందుకే ప్రధాని  ప్రజలకుహామీఇచ్చారు.  

 

అంతేకాదు “మేకినిండియా”ప్రణాళిక నిజంచేస్తూ ఈవిశ్వనగరాన్ని దిల్లీని మించిన పాలనాపరమైన నిర్మాణం చేయాలన్న ప్రతిపాదనాంగీకరించటము లో తప్పిదముండకపోవచ్చు. కాని మన సాంకేతిక నిపుణులు మురికి వాడల తో కూడిన నగరాలను మాత్రమే నిర్మించగలరని టిడిపి అధినేత భావించిన తరుణము లో ఆయనకు దీనిపై విరక్తి కలిగి ఉండొచ్చు.

Image result for amaravati singapur  

హైదరాబాదును    ఒక దశాబ్దకాలం పాటు సీమాంద్ర రాజధాని గా వినియోగించు కొంటే ఈ సుదూర సమయము లో ఒక విశ్వనగర సృష్టి జరుగ గలదని ఎవరైనా అశిస్తారు. “తానొకటి తలిస్తే దైవ మొకటి తలచి నట్లు బాబుగారి దురాశా ఫలితంగా అవకాశం కోసమెదురు చూసే కలవకుంట్ల చంద్రశేఖరరావు గారి అదృష్ఠం వలన  "ఓటుకునోటు" అనబడే చక్రబంధం లో అటు తెలంగాణాలో తెలుగుదేశశం నామరూపాల్లే కుండా పోవటమే కాదు, ఇటు చట్ట, న్యాయాలు ఎలా చెప్పినా 125 కోట్ల భారత ప్రజావళి తో  11.5 కోట్ల తెలుగుజాతి వీక్షించిన  "బ్రీఫ్ద్-మీ"  సిడి బాబుగారి “మనిషిలోని మర్మంగుట్టు విప్పింది”  దీనితో తెలుగుదేశం పరువు పోయింది.  ప్రతిష్ట మంట కలిసింది, అమరావతి నుంచి హైదరాబాదుకుసాగిన  అవినీతి,  అన్యాయం, రాజ్యాంగ వ్యవస్థల పరువు తీసిన దుర్మార్గము అగ్నికీలలై దహించి అమరావతి "వస్తుప్రతిష్ఠ" ను (Brand Value)  తారాపథము నుండి పాతాళపథం వైపుకు పడిపోయింది.  అరోహణావరోహణైంది. సమరోత్సాహం తిమిరం వైపుకు కొనసాగింది. అమరావతి ముఖచిత్రం - ప్రజాస్వామ్యనికి చరమగీతం- అన్నట్లు అనుమానాలు, అవినీతి, అవమానాలతో నిండిపోయింది.

 Image result for amaravati singapur \

దాని తరవాత అమరావతి  భూము ల ఎంపిక,  సేకరణ,  అంతర్గత ఆనుపానులు రహస్యంగా తమకు కావలసిన వారికి బహిరంగ పరచటం (ఇన్సైడరు ట్రేడింగ్) ద్వారా  భూముల ను అతి చవకధరల్లో కొను క్కున్న మంత్రివర్గసభ్యులు,  తన బినామీలు, స కుటుంబ బందు మిత్ర సపరివార, ఆశ్రిత, తస్మదీయ గణాలు దోచుకున్నారని ప్రజాబాహుళ్యంలో విస్తృత ప్రచారములో ఉంది. అన్నీ విపక్షాలకు తమకు ఆ అదృష్ఠం పట్టలేదనే అసూయ, కక్ష, కార్పణ్య, రాజకీయ, ఆర్ధికభావనలతో కడుపుమండి పోయుండవచ్చు.

 

అది గ్రహించిన టిడిపి అధినేత ముందుగా రానున్న ప్రమాదాన్ని ఉహించి తన అధికారమెప్పటికీ కూలకుండా బందోబస్తు చేసుకొనే కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ తలపు తోనే ముందుగా  తెలంగాణాలో విఫలమైన  తన "జపింగ్ జపాంగ్"  స్కీము  ను విజయవంతంగా అమలు పరచి దాంతో శాసనసభలో తన పార్టీసంఖ్యాబలాన్ని విస్తృతంగా పెంచుకొని బలవంతుడుగా సభలో నిలబడి వైరిపక్షాణ్ణి బలహీన పరచి

అధికారం సామ, దాన, భేద, దండోపాయాలు, బ్లాక్మెయిలింగ్, అవసరాలు తీరుస్తూ, అవకాశాలందిస్తూ  , భవితాశలు కలిపిస్తూ మొత్తం మీద అధికారం  శాసనసభాపతి సానుకూలతతో- సభ్యులానుకూలత, మంత్రుల సహకారముతో నిలబెట్టుకున్నారు.

 Image result for demolition of hindu temples in amravati

ఈ వేగములో కొన్ని తప్పులు “తప్పులెన్నువారు” వెతికి పట్టుకోగా, తాము తమ తప్పు లెరిగితే ఫర్వాలేదు, కాని రాజ్యాంగ వ్యవస్థ ల్లోని న్యాయవ్యవస్థ ని తట్టిలేపారు. ఇప్పుడసలు కథ మొదలైంది. తెలంగాణా అవినీతి నిరోదక శాఖ పెట్టినకేసుపరిశోధన మోడీ దయాధర్మంతో పెండింగ్లోపెట్టబడింది. సినిమా చూసిన జనమసలు ఈ కేసు ఊసే మరచిన మరచిపోయిన క్షణములో వైసిపి మంగళగిరి శాసనసభ్యు డు ఆ  అళ్ళ రామకృష్ణా రెడ్డి అ ని శా –కోర్టు ద్వారా అగిపోయిన దర్యాప్తు  న్యాయం కనీసం చట్టపరంగా నైనావారినీ అదేశించమనటం తో అందులోను 30 సార్లకుపైగా బాస్ గా వాడబడ్డ టిడిపి అధినేత పేరు ముద్దాయిగా చేర్చాలని కోరటముతో – కే సి ఆర్ కే తలతిరిగి మాడువాయటంతో అ ని శా తన దర్యాప్తు కొనసాగించ వలసి వచ్చింది.  కేసు పై అ.ని.శా ను చంద్రబాబును కూడా విచారించ మని ఆదేశించింది.

 

నేరస్తుడు తప్పించు కోవటానికి దొంగ దార్లు వెదికినట్లు హైకోర్టులో తనపై “ఓటుకునోటు కేసు లో విచారణను నిలిపివేయాలని” కోరటముతో హైకోర్ట్ స్టే  ఇచ్చింది.  ఆయన పై ఇప్పటికి 10 నుండి 15 కేసులలో వివిధ కోర్టులు విచారణలను నిలిపి వేసినట్లు తెలుస్తుంది. మన జీవితములో ఎదురైతే ఇలాంటి వాళ్ళను“ కోర్టు పక్షులు "  అంటాం.  ప్రతివూర్లో కోర్టులలో స్టేలు తెచ్చుకొని బ్రతికేవాళ్ళు కనిపిస్తూనే ఉంటారు.  ఇలాంటి పరిస్థితిలో బాబు రాజీనామా చేసి కావాలంటే లోకేషును  ముఖ్యమంత్రి ని చేసి తన స్థానము లో వారసుణ్ణి ప్రతిష్టిస్తే అధికారమంతా  ఎప్పటిలా తన చేతులోనే ఉంటుంది.  అలా కాకుండా "నేను నేరస్థుణ్ణి కాదూ! మీ ఇష్ట మొచ్చినట్లు దర్యాప్తు చేసుకోండి నేను నిప్పు నని మీకే కాదు విశ్వాని కే ఋజువౌతుందంటే" అతి తేలికగా దర్యాప్తులో "ఈ నేరము మీది కాదు కేసిఆర్దని" అ ని శా ఋజువు చేస్తే  "నిప్పుకళిక అంత శుభ్రతతో ఆ సీత మహా లక్ష్మిలా" అపనిందనుండిబయటపడొచ్చు. అప్పుడు జనం చంద్రబాబును  శ్లాఘిస్తారు. అది ఒక నాయకునికి కావలసింది.

 Image result for demolition of hindu temples in amravati

ఇలా స్టేలు ఇచ్చీఇచ్చీ న్యాయస్థానాల లసిపోతాయి తప్ప మీ మచ్చలు తొలగ వంటే తొలగవు. ఇంక అనుమానాలు పెనుభూతాలై కాలసర్పాలై కట్తిపడేసి జైలుకూడు తినిపిస్తాయనటానికి మన ప్రతిపక్ష నాయకుని  జీవితమే ఒక ఉదాహరణ. ఇప్పుడు మీరు జగన్ ను ఆడించినట్లు మిమ్మల్ని జగనో, రోజానో, మరొకరో మాంచిగా అడుకుంటారు. ఎందుకంటే “తాతకు పెట్టిన బొచ్చె తలాపున్నే ఉంటుంది కదా!”

   

ఇక మరో కేసులో,  ఈ సారి సుప్రీంకోర్టు నుండి,  మరో స్టే తెచ్చుకున్నారు.  అదే  “స్విస్చాలెంజ్” ఈ విధానాన్ని విదేశాల్లో కాంట్రాక్టింగ్ విషయములో విరివిగా వాడతారు. ఎక్కువ అవినీతి లేని దేశాల్లో ఇది గౌరవ ప్రదంగా పని చేస్తుంది. అవినీతి లో అగ్రపదాన పయనించే మన భారత్ కు  ఇది తగదని సుప్రీంకోర్టు ఇప్పటికే వివరించింది. కేంద్రం కూడా ఈపద్దతి ని అంగీకరించట్లేదు.  అలాంటప్పుడు చంద్రబాబు గారికి ఇంత మమకారం, వాత్సల్యం  వ్యామోహం ఎందుకు దీనిపై.  ప్రజల కోస మైతే ప్రపంచానికే తలమానికమైన "బుర్జ్-ఖలీఫా" నిర్మాణం లోనే మన భారతీయులుభాగస్వాములు. అనుమానమేల? అతి సునాయాసంగా మనవాళ్ళు సింగపూర్ ను మించిన విశ్వనగరాన్ని నిర్మించగలరు. మీరు ఆ అలోచనను విస్మరిస్తే దేశం ఒక అవకాశాన్ని సద్వినియోగ పరచుకొని మహోన్నత నగరాన్ని నిర్మించగలదని మన సాంకేతిక నిపుణుల సామర్ధ్యం విశ్వవ్యాపితం చేసిన ఘనత మీకు దక్కి తరతరాల తెలుగు వాళ్ళు మిమ్మల్ని తలుచుకొనే  చరిత్రలో మిగిలిపోటారు. సింగపూరు వాళ్ళు తప్ప మనవాళ్ళు నిర్మించలేరని భావిస్తే మీరు పదవి నుండి తప్పుకొంటే మీకే క్షేమమని విజ్ఞులు అంటున్నారు.  సింగపూరు ఆ  లోచనలను విడనాడితే దేశం సమర్ధవంత మౌతుంది.  జనము నుంచి మీకు నైతిక మద్దతు లభిస్తుంది.  అలాకాకపోతే "అధికారాంత మందు చూడవలే అయ్యగారి......"  అన్నట్లు ఆ దుస్థితి రావటం మీకు అవసరమా? అనేది ఇందు మూలము గా మీరే కూసింత ఆలోచించుకోండి.  స్కాముల పునాదిపై నిలిచిన  అమరావతి మహానిర్మాణం  "స్విస్-చాలంజ్" తుది తీర్పు వ్యతిరేఖంగా వస్తే? సీమాంద్ర  గతేమిటి?

 Image result for demolition of hindu temples in amravati 

మీ మెలే కోరుతున్నారు సీమాంద్రులు.  వారి ఆశాజ్యొతి గా ఎన్నికై ఇంత దుస్థితికి దిగజారటం మీకుతగునా? అంటున్నారు విజ్ఞులు. స్విస్-చాలెంజ్లో నీతిలేదు నిజాయతీలేద ని జనం ముమ్మాటికీ నమ్ముతున్నారు.  31 అక్టోబరు నాటికి ఏమౌతుందనేది ఇప్పుడు నిరీక్షణకే వదలివేద్ధాం. సుప్రీం కోర్టు మా త్రమే ప్రస్తుతం సీమాంద్ర ను లక్షల కోట్ల రూపాయల స్కాము నుండి బయట పడేయాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: