Image result for revenge for URI attack on POK

యూరీ ఉగ్రవాద దాడి తో ప్రతీకారాగ్ని తో రగిలి పోతున్న భారత సైన్యం అప్పుడే ప్రతీకారం తీర్చుకుందా?  పాకిస్థాన్‌లో ఓ భారీ కోవర్ట్‌ ఆపరేషన్‌ నిర్వహించి 20 మంది పాకిస్థానీ ఉగ్రవాదుల్ని ఏరిపారేసిందా? అంటే తాజాగా 'క్వింట్‌.కామ్‌' లో ప్రచురితమైన ఓ కథనం ఔననే అంటోంది. ఈ కథనం ప్రకారం భారత ఆర్మీకి చెందిన అత్యున్నత పారా మిలిటరీ యూనిట్లు రెండు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ లో ఓ రహస్య ఆపరేషన్‌ నిర్వహించాయి.

Image result for revenge for URI attack on POK

18 మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న యూరీ ఉగ్రవాద దాడి జరిగిన, రెండు రోజుల తర్వాత, సెప్టెంబర్‌ 20-21 అర్ధరాత్రి ఈ ఆపరేషన్‌ జరిగింది. హెలికాప్టర్లలో 18 నుంచి 20 సైనికులు పాక్ ఆక్రమిత కాస్మీర్ లో అడుగుపెట్టి ఉగ్రవాద స్థావరాల పై దాడులు చేశాయి. ఈ దాడుల్లో కనీసం 20 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు హతమయ్యారు.

పాక్‌పై సైన్యం భారీ ప్రతీకారం.. రహస్య ఆపరేషన్‌!

అయితే, 'క్విట్‌.కామ్‌' ప్రచురించిన ఈ ప్రత్యేక కథనాన్ని అటు రక్షణశాఖ అధికారులుగానీ, ప్రభుత్వ వర్గాలు కానీ ధ్రువీకరించడం లేదు. అయినప్పటికీ తమ కథనం ప్రామాణికమైనదేనని, ఆర్మీలోని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఈ ఆపరేషన్‌ నిజంగానే జరిగిందని 'క్వింట్‌.కామ్‌' స్పష్టం చేయడం గమనార్హం. ఆర్మీలోని ఉన్నత వర్గాలు స్పందిస్తే తప్ప ఈ కథనం లోని నిజా నిజాలు "నమ్మతగినవని" నమ్మలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిజమైతే భారత్ ను అభినందించవల సిందే. 

culprits

"We strongly condemn the cowardly terror attack in Uri. I assure the nation that those behind this despicable attack will not go unpunished." 

— Narendra Modi (@narendramodi) September 18, 2016

army soldiers

మరింత సమాచారం తెలుసుకోండి: