'ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా'  గ‌త కొంత కాలంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌కీయాల‌ను హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి విదితమే. రాష్ట్ర అధికార పార్టీ తో స‌హా అన్ని పార్టీలు గొంతెత్తి నినంధించినా... కేంద్ర మాత్రం క‌నిక‌రంలేకుండా హోదా కు మంగ‌ళం పాడేశారు. ప్ర‌త్యేక హోదా కాదు క‌దా... క‌నీసం ప్యాకేజీ ని సైతం ఇవ్వ‌కుండా నిధుల‌తో స‌రిపుచ్చింది. ఇక ఇచ్చింది తీసుకోవడం త‌ప్పా.. చేసేది ఏమీలేద‌ని ప‌లికిన ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆర్థ‌రాత్రి మీడియా స‌మావేశం ఏర్పాటు కేంద్ర ప్ర‌క‌ట‌న‌ను ఆహ్వానించారు. దీనిపై ఏపీ ప్ర‌భుత్వాన్ని ఎండ‌గ‌డుతూ ప్ర‌ధాన ప్ర‌తిపక్ష పార్టీయైన వైకాపా ఇప్ప‌టికీ హోదా పై పోరాటం మాత్రం కొన‌సాగిస్తోంది. 

చంద్ర‌బాబు, ప‌వ‌న్, జ‌గ‌న్ ఉమ్మ‌డి ల‌క్ష‌ణం ఇదే...

ఇక‌పోతే... మరో ఏపీ లోప్ర‌ధాన రాజ‌కీయ నాయ‌కుడైన జ‌న‌సేన నేత ప‌వ‌న్ కళ్యాణ్ మాత్రం ఇంత వ‌ర‌కు కేంద్ర ప్ర‌క‌ట‌న‌పై స్పందించక పోవ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌లు ప్ర‌త్యేక హోదా పై కొంత వ‌ర‌కు వెన‌క్కుత‌గ్గి... హోదా పై నాయ‌కుల తీరును బేరిజు వేస్తున్నారు. ముగ్గురికి ముగ్గురు హోదా పై కేంద్రాన్ని క‌దిలించ‌లేక‌పోయారని వాపోతున్నారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇక్క‌డ మ‌రో వార్త హ‌ల్ చ‌ల్ చేస్తుంది. చంద్ర‌బాబు, ప‌వ‌న్, జ‌గ‌న్ పార్టీల‌క‌తీతంగా వీరి ముగ్గురి లో ఉన్న ఉమ్మ‌డి ల‌క్ష‌ణం మాత్రం ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ అంటే భ‌య‌మ‌ట‌! ఇప్పుడిదే మాట ఏపీలో అంత‌టా వినిపిస్తోంది.

ప్ర‌త్యేక హోదా పై చంద్ర‌బాబు విఫ‌ల‌మ‌య్యారు

మ‌రీ విరు మ‌గ్గురు ఎందుకు మోడీ అంటే భ‌య‌ప‌డుతున్నారో ఒక్కాసారి గ‌మ‌నిస్తే, చంద్ర‌బాబు విష‌యంలో... ఓటుకు నోటు వ్య‌వ‌హారమో... మ‌రేమో గానీ ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ని హోదా పై ఎన్న‌డూ గ‌ట్టిగా నిల‌దీయ‌లేదు. ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం, న్యాయ‌బ‌ద్దంగా రావ‌ల్సిన ప్ర‌త్యేక హోదా ను అడ‌గ‌డంలో చంద్రబాబు ముమ్మాటికి ఫెయిల్ అయ్యారనే చెప్పొచ్చు. చివ‌ర‌కు కేంద్రం ఇచ్చిన ప్ర‌త్యేక నిధుల‌తోనే సంతృప్తి చెందారు. ఇక ముందు కూడా ఆయ‌న వైఖ‌రిలోను పెద్దగా మార్పు ఉండ‌క‌పోవ‌చ్చు.  కేంద్ర విష‌యంలోనే కాదు.. ఇటు రాష్ట్రానికి ఇచ్చిన రుణ‌మాఫీ లాంటి ప‌థ‌కాల‌ను సైతం చంద్ర‌బాబు స‌మ‌ర్ధంగా అమ‌లు చేయ‌లేక‌పోయార‌నే అప‌వాదు కూడా ఆయ‌న పై ఉంది.

వైఎస్ జ‌గ‌న్ సైతం  కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌లేదు..

ఇక ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా దాదాపుగా అంతే. స‌భ‌ల్లోనూ.. త‌న ప్ర‌సంగాల్లోనూ ప్ర‌త్యేక హోదా పై టీడీపీ వ్య‌వ‌హారాన్ని ఎండగ‌ట్టడమే త‌ప్ప‌... కేంద్రం వైఖ‌రిని గానీ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీని గానీ .. ఏన్నాడూ విమ‌ర్శించే ధైర్యం లేదు. తాజా గా నిన్న‌టి యువభేరి స‌భ‌లో మాత్రం గ‌తంలో హోదా పై న‌రేంద్ర‌మోడీ మాట్లాడిన వీడియోల‌ను జ‌నం ముందు పెట్టారు. అది అక్క‌డికే  ప‌రిమిత‌మైంది త‌ప్పితే... ఆ త‌రువాత త‌న ప్ర‌సంగంలో హోదాపై మోడీని గ‌ట్టిగా  నిల‌దీసిన దాఖ‌లాలు లేవు. వాస్తవానికి ప్ర‌త్యేక హోదా విష‌యంలో ప్ర‌భుత్వ వైఫ‌ల్యాన్ని ఎండ‌గ‌ట్ట‌డానికి జ‌గ‌న్ కు ఇదో మంచి అవ‌కాశం.

ఇందుకే జ‌గ‌న్ కు కేంద్రం అంటే భ‌యం!

అయితే ఆయ‌న త‌న రాజ‌కీయంగా ల‌బ్ది పొంద‌డానికే ఎక్కువ ప్ర‌ధాన్య‌త ఇస్తున్నారే త‌ప్ప... కేంద్ర ప్ర‌భుత్వ విధానాన్ని ఎండ‌గ‌ట్టే వ్యూహాల‌లో జ‌గ‌న్ విఫ‌ల‌మ‌వుతున్నార‌నే వాద‌న ఉంది. ఆయ‌న మ‌రో మూడేళ్ల వ‌చ్చే ఎన్నిక‌ల‌ను టార్గెట్ చేసుకుని అధికారంలోకి రావ‌ల‌నే త‌ప్ప‌నలో ఉన్నారు. వాస్త‌వానికి జ‌గ‌న్ కూడా ఎందుకు కేంద్రానికి భ‌య‌ప‌డుతున్నార‌న్న‌దే ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌ల ముందున్న ప్ర‌శ్న‌. ఆప్ కోర్స్ ఆయ‌న పై కూడా అక్ర‌మ ఆస్థుల కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే జ‌గ‌న్ అస్తుల‌ను జ‌ప్తు చేసేందుకు సీఎం చంద్ర‌బాబు వ్యూహాలు ప‌న్నుతున్నారు. ఇందుకోసం కేంద్ర నుంచి ఓ ప్ర‌త్యేక చట్టాన్ని తీసుకువ‌చ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం.  బ‌హుశా ఇందుకే జ‌గ‌న్ కేంద్రంతో ప్ర‌త్య‌క్ష యుద్దానికి దిగ‌టం లేద‌ని తెలుస్తోంది!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం కేంద్రం పై మెత‌క వైఖ‌రి 

ఇక  జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైఖ‌రి గ‌మనిస్తే... మ‌రింత విచిత్రంగా ఉంది. ఎవ‌రితోను అంటి అంట‌న‌ట్టుగా ఉంటూ... ప్ర‌జ‌ల్లో ఓ కొత్త ఆశ‌ను రేపుతూ సైలంట్ అవుతున్నారు. మ‌రోవైపు ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తూనే... చంద్ర‌బాబు కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఇక ప్ర‌ధాని న‌రేంద్రమోడీ ని అయితే ప‌ల్లెత్తు మాట అన‌డానికి సాహ‌సం చేయ‌డం లేదు. మొన్న‌టికి మొన్న తిరుప‌తి, కాకినాడ వేదికగా చేసుకుని కేంద్ర మంత్రుల‌ను, ఎంపీల‌ను టార్గెట్ చేసుకుని మాట్లాడారే త‌ప్ప‌... ఎక్క‌డా చంద్ర‌బాబు ను గానీ, న‌రేంద్రమోడీ ని గానీ విమ‌ర్శించ‌లేదు. అంటే మొత్తం మీద సెఫ్ జోన్ లో రాజ‌కీయాలు చేస్తున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. వాస్త‌వానికి గత 2014 ఎన్నిక‌ల్లో ఇరు పార్టీల గెలుపు కు ప‌వ‌న్ చేసిన మ‌ద్ద‌తు ఇంతా అంతాకాదు. ప‌వ‌న్ గ‌ట్టిగా సాహిస్తే కేంద్ర ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం అనివార్యం గా మారే అవ‌కాశాలు ఉన్నా... ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు ప‌వ‌న్.

ప్ర‌త్యేక హోదా జాప్యం ఆ ముగ్గురి వైప‌ల్య‌మే

ఏదేమైనా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఈ ముగ్గురు నాయ‌కుల‌ది వైఫ‌ల్య‌మే అన్న  చర్చ ఇప్పుడు ఏపీ లో హాట్ టాపిక్ గా మారింది. రాజ‌కీయాలంటే అంతే కాబ‌ట్టి.. ఎటొచ్చి బాధంతా ఏపీ ప్ర‌జ‌ల‌కే కాబ‌ట్టి, ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తే రాజ‌కీయ నాయ‌కుల‌కు ప్ర‌జ‌లు నిరాజ‌నం ప‌ట్టే అవ‌కాశాలు ఉంది. కావున త‌మ రాజ‌కీయ స్వ‌ప్ర‌యోజనాల‌ను వ‌దిలి ప్ర‌జ‌ల కోసం పోరాడితే ఫ‌లితం ఉంటుంది త‌ప్ప‌, ఇలా చేస్తే ఎప్ప‌టికైనా న‌ష్ట‌మే. అది తెలుసుకుని నాయకులు మ‌సులు కుంటే మంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: