దాయాది పాకిస్థాన్ ఆగ‌డాల‌కు 18 మంది భారత వీర జ‌వాన్ల‌ను పొగొట్టుకున్న సంగ‌తి మరిచిపోక‌ముందే... ఉరీ ఉగ్ర‌దాడికి కార‌ణం ఎవ‌రో ఎన్ఐఏ బృందం క‌నిపెట్టింది. గ‌త ఆదివారం  క‌శ్మీర్ బారాముల్లా జిల్లా ఉరీ ఆర్మీ బేస్ క్యాంప్ పై పాకిస్థాన్  ప్రేరేపిత ఉగ్ర‌వాద సంస్థ అయిన జైషే మ‌హమ్మ‌ద్ సంస్థ విచ్చ‌క్ష‌ణ ర‌హితంగా కాల్పుల‌కు పాలుప‌డిన సంగ‌తి విదితమే. అయితే ముష్క‌రుల దాడిలో గాడ‌నిద్ర లో ఉన్న జ‌వాన్లు త‌మ ప్రాణాల‌ను కొల్పోయారు. ఈ సంఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే స్పందించిన జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌(ఎన్ఐఏ) ద‌ర్యాప్తు చేప్ప‌టింది. అయితే ఈ దర్యాప్తులో ఉగ్ర‌వాదుల  దాడ‌కి సంబంధించి సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. 

పాకిస్థాన్ నుంచి వ‌చ్చి ప‌క‌డ్బందీగా దాడిచేసి 18 మంది భార‌త జ‌వాన్ల‌ను అంతం చేసిన ముష్క‌రుల‌కు ఇంటి దొంగ‌లు సాయం చేశార‌ని జాతీయ ద‌ర్యాప్తు సంస్థ తేల్చింది. ఉరీ ఆర్మీ క్యాంప్ లో స‌రుకు ర‌వాణా కూలీలు, ప్లంబ‌ర్లు, ఎల‌క్ట్రిషి య‌న్లు గా ప‌నిచేస్తున్న వారిలో కొంద‌రు స్థావ‌రానికి సంబంధించిన కీల‌క‌మైన స‌మాచారాన్ని ఉగ్ర‌వాదుల‌కు చేర‌వేయ‌డంతో పాటు... ముష్క‌రుల త‌ర‌పున గూఢ‌చ‌ర్యం కూడా నిర్వ‌హించిన‌ట్లు తెలిసింది. ఉరీ ఉగ్రదాడి కేసును దర్యాప్తు చేస్తోన్న ఎన్ఐఏ కొందరు కూలీలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు తెలుస్తోంది! ఉరీ లోని 12వ పదాధిదళాల క్యాంప్ లో దాదాపు 40 మంది సరుకు రవాణా కూలీలు పనిచేస్తున్నారు. 

జవాన్లు, అధికారులకు అవసరమయ్యే నిత్యావసరాలు, ఇతర సరుకులు తీసుకొచ్చే వీరంతా ప్రైవేటు వ్యక్తులే కావడం గమనార్హం. రోజూ వస్తూ పోయే ఈ పోర్టర్ల( కూలీలు) కు క్యాంప్ లోపలి ఆవరణలో ఎక్కడెక్కడ ఏముందో పూర్తి వివ‌రాలు తెలిసి ఉంటుంది.  అంతేకాకుండా పోర్టర్లు తీసుకొచ్చిన నిత్యావసరాలను నిలువ చేసే వంటశాలకు సమీపంలోనే ఉగ్రవా దులు లోపలికి ప్రవేశించడాన్ని బట్టిచూస్తే.. ఆ మార్గం ఇంటిదొంగలు సూచించిందే అయిఉంటుందని ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఇప్ప‌టికే వీరంద‌రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉగ్రవాదులు రావడానికి ముందు ఇంటిదొంగలైన ఇద్దరు గూఢచారులు.. పాక్ సరిహద్దులోని కొండల నుంచి అటవీమార్గం గుండా ఉరీ సైనిక స్థావరం వరకు రెండుమూడుసార్లు రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. 

అది ఉగ్రవాదులకు పూర్తిగా సురక్షితమైన మార్గమని నిర్ధారించుకున్న తర్వాతే జైషే తన తోడేళ్లను రంగంలోకి దింపింది. అయితే వీరి ఏమైన ఆశ‌తో చేశారా? లేక వీరికి ఉగ్ర‌వాదుల‌కు ఏమైన సంబంధాలు ఉన్నాయా?  అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీలా ఉంటే ఉరీ ఉగ్ర‌వాదుల దాడి జ‌ర‌గ‌డానికి మూడు రోజుల ముందు సైనిక శిబిరంలో ప‌నిచేస్తోన్న స‌రుకు ర‌వాణా  కూలీల ను ఉద్దేశించి సుప్రీం కోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. పోర్ట‌ర్ల తో ఎక్కువ ప‌నిచేయిస్తూ త‌క్కువ జీతాలు ఇస్తున్నారంటూ ఆర్మీ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.
 
పోర్ట‌ర్లేమైనా ప‌శువులా? అని సుప్రీంకోర్టు  ప్ర‌శ్నించింది. కీల‌క‌మైన సైనిక స్థావ‌రంలో త‌క్కువ  జీతానికి ప‌నిచేసే ఈ పోర్ట‌ర్ల‌కు ఉగ్ర‌వాద సంస్థ‌లు  ఎక్కువ డ‌బ్బును ఎర‌గా చూపి త‌మ‌కు అనుకూలంగా ప‌నిచేయించుకున్న‌ట్లు ఎన్ఐఏ బృందం అనుమానిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: