ఉగ్రవాదం అండతో ఊగిపోతున్న పాకిస్థాన్ పీచమణచాలంటే.. యుద్ధం చేయాల్సిందే. ఈ మాట భారతదేశంలోని 120కోట్ల మంది భారతీయుల నుండి వ్యక్తమౌతుంది. యుద్ధంతోనే పాకిస్థాన్ పొగరు అణచగలమనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. అయితే.. భారత ప్రభుత్వం మాత్రం యుద్ధం, తదనంతర పరిమాణాలను బేరిజు వేసుకుని.. అందుకు ఆసక్తి చూపడం లేదు. యుద్ధం చేయకుండా పాకిస్థాన్ ను దెబ్బతీసేందుకు వ్యూహాలు రచిస్తోంది. కాని దాయాది దేశం మాత్రం కయ్యానికి కాలువు దువ్వుతూనే ఉంది. యుద్ధ విమానాలను పాక్ ఆక్రమిత కశ్మీర్ గగన తలంలో తిప్పుతూ కవ్వింపులకు పాల్పడుతోంది.


భారత్ వైపు నుండి శాంతి మంత్రం వినిపిస్తుండగా.. పాకిస్థాన్ మాత్రం తన గగన తలంలో యుద్ధవిమానాలను తిప్పుతోంది. బుధ, గురువారాల్లో ఏకంగా నాలుగు ఎఫ్-16 యుద్ధ విమానాలను పరీక్షించి చూసింది. వాటిని ఏకంగా జాతీయ రహదారులపై ల్యాండ్ చేయించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ జియో న్యూస్ సీనియర్ జర్నలిస్ట్ హమీద్ మిర్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. గురువారం రాత్రి 10గంటల 20నిమిషాల సమయంలో ఇస్లామాబాద్ గగన తలంలో నాలుగు యుద్ధవిమానాలను చూసినట్లు తెలిపాడు. భారతదేశం కనుక యుద్ధం చేయడానికి సిద్ధమైతే..సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు.. పాకిస్తాన్ యుద్ధ ప్లాన్ కుడా సిద్ధం చేసినట్లు ఆదేశ జియో ఛానల్ ఓ కథనాన్ని వెలువరించింది.


పాకిస్థాన్ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తుంది. అది కేవలం మాక్ డ్రిల్ మాత్రమేనని పాక్ రక్షణ శాఖ అధికారులు తెలిపినట్లు సమాచారం. బుధ, గురు వారాల్లో జరిగిన విమానాల ప్రదర్శనకు హైమార్క్ అని నామకరణం చేసినట్లు పాక్ వైమానిక దళ ఉన్నతాధికారులు తెలిపారు. ఇవి సాధారణ వైమానిక రక్షణ కసరత్తులు మాత్రమేనని, ఆరేళ్ల క్రిందట కూడా ఇటువంటి కసరత్తు జరిగిందన్నారు. యుద్ధ విమానాలను పరీక్షించినంత మాత్రాన యుద్ధం చేయబోతున్నట్లు కాదని, తమ సామర్ధ్యాన్ని పరీక్షించుకోవడమేనని పాక్ సైనికాధికారులు తెలిపినట్లు హమీద్ మీర్ ట్విట్టర్లో పేర్కొన్నాడు.


యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ నియంత్రణ రేఖ వెంట భద్రతను భారత్ అప్రమత్తం చేసింది. 198 కిలోమీటర్ల మేర పాకిస్థాన్ సరిహద్దు వద్ద బిఎస్ఎఫ్ బలగాలను మోహరించింది. 24గంటలు పహారా కాస్తూ నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. యుద్ధం మంచిది కాదనే భావనతో ఉన్న భారత దేశం.. ఓవైపు భద్రతను పటిష్టం చేస్తూనే.. మరోవైపు పాకిస్థాన్ తోక కత్తిరించేందుకు వ్యూహరచనలు చేస్తోంది. యుద్ధం చేయకుండా.. పాకిస్థాన్ ను దెబ్బతీసే మార్గాలను అన్వేషిస్తోంది. 


యుద్ధం చేయకుండా పాక్ పని ఖతం చేయనుంది భారత్. యుద్ధవిమానాలు, ఆర్మీ తో సంబంధం లేకుండా..జలాస్త్రాన్ని ప్రయోగించి పాకిస్థాన్ ను దెబ్బతీయాలనే నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. ఐదున్నర దశాబ్ధాల క్రితం పాకిస్థాన్ తో కుదుర్చుకున్న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోనుంది. సింధు జలాల ఒప్పందం ప్రకారం బియాస్, సట్లెజ్, రావి నదులపై భారత్ కు హక్కులున్నాయి. ఈ ఒప్పందాన్ని రద్దు చేసు కోవడం ద్వారా పాక్ 80శాతం నీటిని కోల్పోనుంది. అదే జరిగితే పాకిస్థాన్ ఎడారిగా మారుతుంది. పాకిస్థాన్ దారికి రావాలంటే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం ఒక్కటే మార్గమని ఎన్డీఏ సర్కార్ భావిస్తోంది. ఉగ్రవాదానికి పాకిస్థాన్ స్వస్థి పలికే వరకు ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకునే యోచనలో భారత్ ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టం లేకుండా, యుద్ధ వాతావరణాన్ని కల్పించకుండా..పాకిస్థాన్ ను దెబ్బతీయొచ్చని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: