గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌ లోవర్షం దంచి కొడుతోంది. ఎటు చూసినా వర్షాలే..! తెల్లవార్లు ఎడతెరిపి లేని వానలు. కాస్త తెరిపినివ్వగానే మళ్లీ కుండపోత వర్షం.. నగరంలో ఎటు చూసినా నీళ్లే..చెరువులను తలపిస్తున్న అపార్టుమెంట్లు..నదులను తలపిస్తున్న కాలనీలు..బస్తీలు కాలనీలు చెరువుల్లో కట్టుకున్నారా..? లేక చెరువే ఊళ్లోకి వచ్చిందా అన్నట్లుగా కనిపిస్తున్న నీళ్లు..


మూడు రోజులుగా కురుస్తున్న వానలతో.. ముంచెత్తిన వరద వండుకునే అవకాశం లేక.. తినేందుకు తిండి లేక అలమటిస్తున్న నగర జీవులు. చుట్టూ నీళ్లున్నా తాగేందుకు గుక్కెడు మంచి నీళ్లు కరువయ్యాయి.. పాలకోసం చిన్నారులు అలమటిస్తున్నా.. వేడి చేసి ఇవ్వలేని దయనీయ పరిస్థితి హైదరాబాద్‌ ప్రజలది.


బయటకు వెళ్లాలంటేనే భయం.. భయం..ఏరులను తలపిస్తున్న రోడ్లు. పొంగి పొర్లుతున్న డ్రైనేజీలతో జన జీవనం అస్థవ్యస్తం..ఏ రోడెక్కిన గుంతలే, అడుగుతీసి అడుగు వేయాలంటే ఏ మ్యాన్‌ హోళ్లో పడిపోతామేమోనన్న భయం..అసలు భాగ్యనగర ప్రజల బతుకులెందుకు ఇంత దయనీయంగా మారాయి..? ఎప్పుడూ లేనంతగా వర్షానికే.. ఎందుకింత బీభత్సం జరుగుతోంది..?


ఇది ప్రకృతి ప్రకోపమా.. నగర ప్రజలు చేసుకున్న పాపమా..? ఒకప్పుడు ఎంతో సుందర నగరంగా పేరున్న భాగ్య నగరం ఇప్పుడెందుకు ఇంత భయంకరంగా మారింది.? చినుకు పడితే చాలు..  హైదరాబాద్ ఛిద్రమైపోతోంది. వాన పడుతుంటే చాలు.. వరదలో చిక్కుకుపోతోంది. ఈ సీజన్‌లో ఇలా జరగడం ఇది మూడోసారి. ఇంకా వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు.. హైదరాబాదీల్లో భయాన్ని పెంచేస్తున్నాయి.


ఇంతకు ముందు వర్షం పడితే.. లోతట్టు ప్రాంతాల్లోకే ఎక్కువగా నీళ్లు వచ్చేవి. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అన్ని ప్రాంతాల్లోనూ ఒకే దుస్థితి. నదులు పోటెత్తినట్లుగా.. రోడ్లపై వరదనీరు పారుతోంది. ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలు నిండిపోవడంతో.. నీరంతా.. చుట్టుపక్కల ప్రాంతాల్లోకి నదీ నీళ్లలా ప్రవహిస్తోంది.


 హైదరాబాద్‌కు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడుతుంటే.. ఎందుకు మునిగిపోతోంది..? ఇంతటి ఘోరానికి కారకులెవరు..? నిర్మాణాలకు అడ్డగోలు అనుమతులిచ్చిన అధికారులదా... కనీసం ముందు జాగ్రత్తలు కూడా తీసుకోని ప్రజలదా..?


మరింత సమాచారం తెలుసుకోండి: