తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యం పాలయ్యారని వచ్చిన వార్తలను ఆమె పార్టీ ఏఐఏడీఎంకే నేతలు తీవ్రంగా ఖండించారు. తమిళనాడు-కర్నాటకల మధ్య కావేరీ జగడం అలా సాగుతోంది. హఠాత్తుగా అమ్మ జయలలితకు అనారోగ్యం చుట్టుకుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో ఆమెను సింగపూర్‌కు తరలించాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.  జ‌య‌ల‌లిత‌కు మధుమేహం, కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా ఉండటంతో మ‌రింత మెరుగైన చికిత్సను అందించ‌డం కోసం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆసుప‌త్రి వ‌ర్గాలు మీడియాకు తెలిపాయి. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉందని, జ్వ‌రం త‌గ్గింద‌ని చెప్పారు.  

ఆమెకు జ్వరం తగ్గింది గానీ ప్రస్తుతం ఇంకా అబ్జర్వేషన్‌లో ఉన్నారని వైద్యులు అంటున్నారు. జయలలిత త్వరగా కోలుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు, పూజలు జరుగుతున్నాయి. ప్రస్తుతం జ్వరం తగ్గడంతో ఆమెకు సాధారణ ఆహారాన్నే ఇస్తున్నట్లు అపోలో ఆస్పత్రి ఓ ప్రకటనలో తెలిపింది.  ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉందని, జ్వ‌రం త‌గ్గింద‌ని చెప్పారు. ముఖ్య‌మంత్రికి సాధార‌ణ ఆహారాన్నే ఇస్తున్న‌ట్లు పేర్కొన్నాయి.  అమ్మకు అంతా బాగానే ఉందని, అందువల్ల ఆమెను సింగపూర్ తరలించడం లేదని.. అపోలో ఆస్పత్రి నుంచి కూడా త్వరలోనే డిశ్చార్జి అవుతారని అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.  
Image result for kaveri water fight
మరోవైపు జ‌య‌ల‌లిత అభిమానులు, అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌లు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతూ త‌మిళ‌నాడులోని పలు దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. జయలలిత త్వ‌ర‌గా కోలుకోవాలని తాను ఆశిస్తున్నట్లు తెలుపుతూ ప్రధాని మోడీ ఆమెకు బొకే పంపించారు. అందుకు జ‌య‌ల‌లిత స్పందిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్న‌ట్లు లేఖ రాశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: