ఎన్ని ఇబ్బందులు పడుతూ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నా కూడా వరుణ దేవుడు కనికరించడం లేదు. హైదరాబాద్ మహానగరం ఇప్పుడు మోకాలు నీళ్ళలో దిగబడిపోయింది. ఎక్కడ చూసిన నీళ్ళు నీళ్ళు నీళ్ళు బయటకి వెళ్లి పాలప్యాకేట్ తెచ్చుకోవాలి అంటే గంపెడు నీళ్ళలో ప్రయాణం చేసి తిరిగిరావాల్సిందే. పరిస్థితిని కంట్రోల్ లోకి తేవడం కోసం తెలంగాణా ప్రభుత్వం ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా ఇంకా చాలా ప్రాంతాల్లో ఇళ్ళలో నీళ్ళు ఉండిపోయింది. హైదరాబద్ పరిస్థితి ఎలా ఉంది, ఎంత భయంకరంగా ఉంది, ఎన్ని ఇబ్బందులలో జనాలు సతమతం అవుతున్నారు అంటూ ఎప్పటిలాగానే మీడియా తన మేతను తాను మేస్తోంది. సోషల్ మీడియా అయితే ఇక చెప్పక్కర్లేదు.

రకరకాల ఫోటోలు - వాటిలో ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలీదు ఆ రేంజ్ లో న్యూస్ లో స్ప్రెడ్ చేస్తున్నారు సోషల్ మీడియా వారు. కెసిఆర్ హైదరాబాద్ కి సముద్రాన్ని తీసుకొచ్చిన ఘనతని పొందారు అంటూ ఎక్కడ పడితే అక్కడ వ్యంగ్యంగా జోకులు పేలుస్తున్నారు. హైదరాబాద్ వరదల క్రమం లో మీడియా, సోషల్ మీడియా ఇప్పుడు కెసిఆర్ సర్కారు కి సవాలు గా మారాయి.ఎక్కడెక్కడ జనం ఇబ్బందులు ఎదురుకుంటూఉన్నారు అనేది చూపిస్తున్న మీడియా అక్కడ ఎన్ని గంటల్లో యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం స్పందించింది అనేది మాత్రం ఆలోచించడం లేదు. దాని గురించిన న్యూస్ కాస్త కూడా బయటకి రావడం లేదు. ఈ విషయం లో సర్కారు చాలా ఇబ్బంది పడుతోంది. హైదరబాద్ లో వర్షాలు పడితే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందా అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు అందరూ షాక్ కి గురి అవుతున్నారు. నష్ట నివారణ చర్యల కోసం కెసిఆర్, కేటీఆర్ లు కొత్త పథకం రచించారు.

తాజాగా కెసిఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి హైదరాబాద్ లో స్థితిగతులు మీడియా ఊహాగానాల రేంజ్ లో లేదు అనీ ప్రస్తుతం పరిస్థితి మరీ అంత భయంకరంగా లేదని... మీడియాలో దీన్ని ఓవర్ గా చూపించి హైదరాబాద్ నగరానికి చెడ్డ పేరు తీసుకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లో కురిసిన అతి భారీ వర్షాలకి ఒక్క మనిషి కాదు కదా ఒక్క జంతువు కూడా చనిపోలేదు అనీ మీడియా అన్నిటినీ బూతద్దం లో చూపించడం మానుకోవాలి అని కెసిఆర్ సూచించారు. అక్రమ కట్టడాల వలన ఎంతటి దారుణాలు జరుగుతాయి అనేది ఇప్పటికైనా అర్ధం చేసుకోవాలి అని పనిలో పనిగా జనాలకి కూడా సూచనలు చేసేసారు. మూసి నది నాలాలపై 28 వేల అక్రమ కట్టడాలను గుర్తించామని..వీటన్నింటిని నిర్దాక్షిణ్యంగా కూలగొడతామని కూడా ఆయన చెప్పారు.

" వాటిల్లో ప్రభుత్వం భవనాలు కూడా ఉండడం బాధాకరమైన విషయం , తప్పకుండా వాటిని కూడా కూల్చుతం. గత పాలకులు ఎంత మూర్ఖత్వం గా పర్మిషన్ లు ఇచ్చుకుంటూ పోయారు అనేదానికి ఇదే సరైన నిదర్సనం, నగరం లో వరదల నేపధ్యం లో పాత బడిన భావనాలని నాలుగు వందల వాటిని కూల్చేసాం లేదంటే ఎంతో ప్రాణనష్టం జరిగి ఉండేది " అన్నారు కెసిఆర్. " ఈ శతాబ్దం లో ఈ వర్షపాతం అత్యధికం, ఇంతగా వర్షాలు హైదరాబాద్ లో పడడం వంద సంవత్సరాల క్రితం మాత్రమే జరిగింది. సెప్టెంబర్ లో సగటు సాధారణ వర్షపాతం 84 మిల్లీ లీటర్లు ఉంటుంది అది ఇప్పుడు ఆరు రెట్లు పెరగడం కంగారు పెట్టె విషయం" అన్నారు ఆయన. హైదరాబాద్ వర్షాలని భయంకరంగా చూపించద్దు అని కెసిఆర్ స్పష్టం చేసిన వెంటనే నగర మేయర్ బొంతు రామ మోహన్ మాత్రం గట్టి వార్నింగ్ ఇచ్చారు.

సోషల్ మీడియా లో ఇష్టం వచ్చిన పోస్ట్ లు పెడుతున్నవారి మీద గట్టి కేసులు పెడతాం అని అన్నారు ఆయన. హుస్సేన్ సాగర్ కి ప్రమాదం ఉంది అనీ కాప్రా చెరువు తెగుతుంది అనీ ఇష్టం వచ్చినట్టు చేసే ప్రచారాలు జనాలు నమ్మద్దు అనీ , ప్రముఖ మీడియా సంస్థల ద్వారా - అదీ పోలీసు లేదా మునిసిపల్ శాఖ ద్వారా మాత్రమే వచ్చే న్యూస్ లని నమ్మాలి అని ప్రజలని కోరుకున్నారు ఆయన.  


మరింత సమాచారం తెలుసుకోండి: