గ‌త ద‌శాబ్దాల కాలం నుంచి దాయాది పాకిస్థాన్ నుంచి ఎదుర‌వుతున్న ప్రేరేపిత ఉగ్ర‌వాద స‌మ‌స్య‌ను భార‌త్ ఎదుర్కోవాలంటే కొన్ని చిక్కుల త‌ప్ప‌వా అంటే తాజాగా ప్ర‌ధాని న‌రేంద్రమోడీ స్పంద‌న ప్ర‌కారం అవున‌నే స‌మాధానం క‌ల‌గ‌క మాన‌దు. ఆయ‌న నిన్న కేర‌ళ కోజికోడ్ లో బీజేపీ జాతీయ కౌన్సిల్ స‌మావేశాల్లో మాట్లాడుతూ.. ఉగ్ర‌వాదాన్ని క‌లిసిక‌ట్టుగా ఎదుర్కొవాల‌ని పాక్ ప్ర‌జ‌ల‌ను కోరారు. దీనిని బ‌ట్టి చూస్తే పాక్ కంటే ఉగ్ర‌వాదం పైనే భార‌త్ యుద్దం ఉండాల‌ని తెలిపిన‌ట్టే. తాజా ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే... కశ్మీర్ లోని యూరీ సైనిక స్థావ‌రం పై జైషే -ఎ మహ‌మ్మ‌ద్ దాడి సంద‌ర్బంగా మ‌రో సారి ముందుకు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి ఇంత తీవ్ర‌మైన దాడి జ‌రిగిన‌ప్పుడు వెంట‌నే భార‌త సైన్యాలు ఎదురు డాది చేసి ఉండాలి. దేశం లో ప్ర‌జ‌ల మూడ్ కూడా అదే విధంగా ఉంది.

పాకిస్థాన్ పై మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కానీ... గ‌తంలో పార్ల‌మెంట్ పై,  ముంబాయ్ పై టెర్ర‌రిస్టు దాడులు జ‌రిగినా సైన్యం ఎదురుడాది జ‌ర‌ప‌లేదు. ఇదే క్ర‌మంలో ఈ సారి కూడా అదే ప‌రిస్థితి ప్ర‌భుత్వ ప‌రంగా క‌నిపిస్తోంది. తాజాగా న‌రేంద్ర మోడీ స్పందించిన తీరును బ‌ట్టి గ‌మ‌నిస్తే... ఈ చిక్కు ప్ర‌శ్న‌ల‌కు ఓ స‌మాధానం ల‌భిస్తోంది. ఆయ‌న మాట్లాడుతూ... 'పాకిస్థాన్ ప్రజలారా.. ఇండియా గడ్డ నుంచి మీతో మాట్లాడుతున్నా.. చరిత్ర మొదలు 1947 వరకు మీ పూర్వీకులు ఇక్కడి నేలకు నమస్కరించినవారేనని గుర్తుంచుకోండి. విడిపోయిన తర్వాత మీ పాలకులు ఏ విధంగా మారిపోయారో ఒక్కసారి గమనించండి. గడిచిన కొద్ది నెలల్లో ఒక్క కశ్మీర్ లోనే 110 మంది టెర్రరిస్టులు చనిపోయారు. వీళ్లందరూ ఎవరి బిడ్డలు? ప్రస్తుతం భారత్ నుంచి అన్ని దేశాలకు ఇంజనీర్లను పంపుతున్నాం. కానీ మీ దేశం(పాకిస్థాన్) ఏం చేస్తోంది? ఉగ్రవాదులను పంపుతోంది. ప్రపంచాన్ని ఛిన్నాభిన్నం చేయాలనుకుంటోంది. 

పాక్ కు మోడీ ప‌రోక్ష హెచ్చ‌రిక‌లు

పాక్ అన్నదమ్ములారా.. మీతో కలిసి యుద్ధం చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది. రండి.. పేదరికంపై, ఆకలిదప్పులపై యుద్ధం చేద్దాం. అప్పుడు పాకిస్థాన్, ఇండియాల్లో ఎవరు గెలుస్తారో చూద్దాం..' అని మోదీ ఆవేశపూరితంగా ప్రసం గించారు. ఉగ్రవాదులూ చెవులు రెక్కించి వినండి.. ఉరీ ఘటనను మేం మర్చిపోం. అని హెచ్చరికలు కూడా  జారీ చేశారు. అంటే ఆయ‌న పాకిస్థాన్ ప్ర‌జ‌ల‌కు హిత‌బోద చేస్తూనే పాక్ ప్ర‌భుత్వానికి హెచ్చ‌రించారు. అయితే ఆయ‌న ఇక్క‌డ పాక్ ఉగ్ర‌వాదుల‌ను పెంచిపోషిస్తోంద‌ని ఆ దేశ ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌నే ప్ర‌య‌త్నం చేశారు. మొత్తంమీద ఆయ‌న మాట‌ల‌ను బ‌ట్టి ఏదైనా చ‌ర్య‌ల రూపంలో జ‌ర‌గ‌వ‌చ్చున‌నే అభిప్రాయానికి వ‌చ్చార‌ని అర్ద‌మౌతుంది. అయితే తాజాగా ఉరీ ఉగ్ర‌దాడి... ఆ త‌రువాత భార‌త్ లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి చూస్తే యుద్దం త‌ప్ప‌ద‌నే వాద‌న‌లు ఉన్నాయి. 

అణ్వ‌స్త్రా ప్ర‌యోగం జ‌రిగితే...

ఒకవేళ‌.. త‌మ భ‌ద్ర‌త‌కు ముప్పు ఏర్ప‌డిన‌ట్లైతే అణ్వ‌స్త్ర ప్ర‌యోగానికి వెనుకాడ‌బోమ‌న్నారు దాయాది పాకిస్థాన్.  చిక్కు ప్ర‌శ్న‌లు అన్న‌దానిలో ఈ అణ్వ‌స్త్రాల  విష‌యం అన్నింటిక‌న్న ప్ర‌ముఖ‌మైన‌ది. అయితే ఇక్కడో విష‌యం గ‌మ‌నించాలి. అసియా ను  ర‌క్త సిక్తం చేయాల‌ని పాకిస్థాన్ చూస్తోంద‌ని తెలిపారు మోడీ. అయితే ఇండియా-పాకిస్థాన్ కు  సంబంధించి మాత్ర‌మే కాదు... ఎక్క‌డైనా స‌రే, రెండ‌వ ప్ర‌పంచ యుద్దం ఆగిపోయి.. జ‌పాన్ లొంగింది అణ్వ‌స్త్ర ప్ర‌యోగం వ‌ల్ల మాత్ర‌మే. అమెరికా -సోవియ‌ట్ యూనియ‌న్ ల మ‌ధ్య  బ‌లాబ‌లాల స‌మ‌తుల్యానికి కార‌ణ‌మైది అణ్వ‌స్త్రాలే. గ‌త 1998 లో ఇండియా-పాకిస్థాన్ ల మ‌ధ్య అదే జ‌రిగింది. వాజ్ పేయ్ ప్ర‌భుత్వం మొద‌ట అణ్వ‌స్త్ర ప‌రీక్ష జ‌రిపిన త‌రువాత ఉప ప్ర‌ధానిక లాల్ కృష్ణ అద్వానీ మాట్లాడుతూ... ఇక నుంచి పాకిస్థాన్ ఉగ్ర‌వాదుల‌ను  వారి  భూభాగంలోకి త‌రుముతూ వెళ్లి మ‌రీ మ‌ట్టు బెడ‌తాం అన్నారు.

ఉగ్ర‌వాదుల‌పై భార‌త్ యుద్దం 

కానీ రెండు వారాల త‌రువాత పాకిస్థాన్ కూడా అణ్వ‌స్త్ర ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డంతో అద్వానీ ఆ విష‌యం పై మ‌ళ్లీ స్పందించ‌లేదు. ఇప్పుడు 18 సంవ‌త్స‌రాల గ‌డిచినా కూడా రెండు దేశాల మ‌ధ్య అదే ప‌రిస్థితి ఉంది. ఇండియా ఎదురు దాడులు జ‌ర‌ప‌క‌పోవ‌డానికి అదొక ముఖ్య కార‌ణం గా చెప్పొచ్చు. ఇక మోడీ త‌న ప్ర‌సంగంలో యూరీ సైనికుల మ‌ర‌ణం వృదా కానీవం అన్నారు. అంటే ఆయ‌న పాక్ కంటే ముందు ఉగ్ర‌వాదుల‌పై దాడి జ‌ర‌పాలి. అలా జ‌ర‌పాలంటే పాక్ పై యుద్దం త‌ప్ప‌దు. ఉగ్ర‌వాదుల స్థావ‌రాల‌పై ప‌రిమిత దాడులు సైతం అంత తేలిక కాదు. అవి చినికి చినికి గాలి వానగా మారి అనూహ్య ప‌రిణామాల‌కు దారి తీయ‌గ‌ల‌వు. ఇది ఒక స‌మ‌స్య‌కాగా... మ‌రొక చిక్కు ప్ర‌శ్న టెర్ర‌రిస్టు సమ‌స్య అంత‌ర్జాతీయ స‌మ‌స్య‌గా చూడాలి ఉంటుంది. 

పాక్ ప్ర‌ధానుల ప్రాణాలు తీసిన ఉగ్ర‌వాదులు

ఇక టెర్ర‌రిస్టుల స‌మ‌స్య పాక్ పై కూడా ఉంది. పాక్ మాజీ ప్ర‌ధాని బేన‌జీర్ భుట్టో ప్రాణాలు తీసి, ఒక దేశాధ్య‌క్షుడు జ‌న‌ర‌ల్ ముషార్ర‌ఫ్ పై ప‌లుమార్లు దాడిచేసిన స్థితిలో రాజ‌కీయ ప్ర‌భుత్వానికి , ఈ సంస్థ‌ల‌కు మ‌ధ్య తేడా చూడాల న్న‌ది అంతర్జాతీయ అభిప్రాయం. దీనిని భార‌త ప్ర‌భుత్వం కూడా  బ‌హిరంగంగా కాక‌పోయినా అంత‌రంగి కంగా అంగీక‌రిస్తున్న‌ది. అటువంటి సంస్థల నిరోధానికి రాజకీయ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదా లేదా అన్నదే అంతర్జా తీయంగా పరిగణించదగ్గ అంశం అయింది. దీనికి ఓ ఉదహ‌ర‌ణ మీముందు ఉంచుతా... యూరీ ఘ‌ట‌న త‌రువాత  రెండు రోజుల‌కు న్యూయార్క్ లో పాకిస్థాన్ ప్రధాని న‌వాజ్ ష‌రీఫ్ ను క‌లిసిన అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ తీవ్ర‌వాద కార్య‌కలాపాల‌ను ఎదుర్కొవ‌డం లో పాకిస్థాన్ భ‌ద్ర‌తా ద‌ళాలు ఇటీవ‌ల తీసుకుంటున్న చ‌ర్య‌లు ప్ర‌శంస‌నీయ మ‌ని అన్నారు.

టెర్ర‌రిస్టుల‌ను నిరోదించాల్సిన బాధ్య‌త పాక్ దే

దీనిని బ‌ట్టి అర్థ‌మ‌య్యే దేమిటీ?  కెర్రీ మ‌రొక గ‌మ‌నార్హ‌మైన మాట కూడా అన్నారు. అణ్వ‌స్త్రా కార్య‌క‌లాపాల విష‌యంలో సంయ‌మ‌నం చూపాల‌ని సూచించారు. ఈ చివరి మాట‌ పరోక్షంగా భారతదేశాన్ని కూడా ఉద్దేశించినటువంటిదని వేరే చెప్పనక్కరలేదు. ఇక యూరీ పై జైషే ఏ మ‌హమ్మ‌ద్ దాడి సందర్భంలో ఏ విధంగా స్పందిచ‌టం?  ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం అంత తేలిక కాదు.  అయితే ఉగ్ర‌వాద సంస్థ‌లు నేరుగా రాజ‌కీయ ప్ర‌భుత్వ‌పు ఆధీనంలో  లేకున్నా... పైన చెప్పుకున్నట్లు సైన్యం లోని ఒక వ‌ర్గం ఐఎస్ఐఎస్ నియంత్ర‌ణ‌లో ఉన్నాయ‌నేది తెలిసిందే. క‌నుక ఈ  వ‌ర్గ‌మైన... ఐఎస్ఐ అయినా పాకిస్థాన్ కు చెందిన‌వే కాకుండా ఈ సంస్థ‌లు ప‌నిచేస్తున్న‌ది ఆ  భూభాగం నుంచే గ‌నుక‌... వీటిని నిరోధించ‌వ‌ల‌సిన బాధ్య‌త  రాజ‌కీయ ప్ర‌భుత్వానిదే అవుతుంది. 

యూరీ ఘ‌ట‌న పై మోడీ ప్ర‌తికారం త‌ప్ప‌దా?

ఒక బాధ్యత గల నాయకత్వం ఇటువంటివి తన చేతిలో లేవని, కనుక తనకు సంబంధం లేదని అనజాలదు. ఇటువంటి నేపథ్యాలలో ఇపుడు యూరీ దాడి దరిమిలా మోడీ ప్రభుత్వపు ప్రతిచర్యలు ఏ విధంగా ఉండవచ్చు?  గత 28 మాసాలను గమనిస్తే ప్రభుత్వపు పాకిస్థాన్ విధానం ఏమిటన్నదే స్పష్టత రావటం లేదు మనకు. ఇంత లో స్నేహహస్తాలు, అంతలో వీరాలాపాలు. ఆయా సంద ర్భాలను పరిశీలిస్తే రెండింటికీ సహేతుకత కన్పించటం లేదు. సమస్యకంతా మూలంలో ఉన్న కశ్మీర్ విషయం లోనూ అట్లాగే ఉంది. అందువల్ల ఏదీ తార్కికంగా అంచనా వేసే పరిస్థితి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: