నిప్పులు చిమ్ముతూ.. చ‌రిత్ర సృష్టిస్తూ.. అంతరిక్ష ప్రయోగాలలో మరో కొత్త అధ్యయనానికి ఇస్రో తెర‌లేపింది. తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్ర సృష్టించి భార‌త ఘ‌న‌కీర్తిని రెప‌రెప‌లాడించింది. నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి పీఎస్‌ఎల్‌ వీ – సీ 35 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఒకే వాహకనౌక ద్వారా ఒకేసారి ఎనిమిది ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ-సీ35 వాహకనౌక విజయవంతంగా తన పని పూర్తిచేసింది. సోమవారం ఉదయం 9.12 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన వాహకనౌక 2.15 గంటల వ్యవధిలో ఉపగ్రహాలను రెండు విభిన్న కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇలాంటి ప్రయోగం ఇస్రో నిర్వహించడం ఇదే తొలిసారి.


ఉప‌గ్ర‌హ ప్ర‌యోగ చరిత్ర‌లో ఇస్త్రో కొత్త మైలురాయి దాటింది. శ్రీ‌హ‌రి కోట‌నుంచి నింగిలోకొ దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ35 ప్ర‌యోగం స‌క్సెస్ అయింది. పీఎస్ఎల్వీ-సీ 35 ప్ర‌యోగం ద్వారా ఒకే సారి నింగిలోకి 8 ఉప‌గ్ర‌హాల‌ను నిర్ణీత క‌క్ష్య‌ల్లోకి ప్ర‌వేశ‌పెట్టారు. అయితే ఒకే స‌మ‌యంలో బ‌హెళ ఉప‌గ్ర‌హాల‌ను ప్ర‌వేశపెట్ట‌డం ఇస్త్రోకు కొత్తేమికాదు. అయితే తాజా ప్ర‌యోగంలో ఒకే స‌మ‌యంలో బ‌హుళ ఉప‌గ్ర‌హాల‌ను ప‌లు క‌క్ష్య‌ల్లో ప్ర‌వేశ‌పెట్టారు. ఇలాంటి ప్ర‌యోగం చేయ‌డం ఇస్త్రో చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి. అయితే ఇస్త్రో మొద‌టి ప్ర‌యోగంలోనే ఈ విజ‌యాన్ని న‌మోదు చేసింది.


ముందుగా స్కాట్‌శాట్‌-1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన వాహకనౌక... మిగిలిన వాటిని నిర్దేశిత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. పీఎస్‌ఎల్వీ-సి35 ద్వారా మన దేశానికి చెందిన స్కాట్‌శాట్‌-1 ఉపగ్రహంతో పాటు అల్జీరియా, కెనడా, అమెరికా దేశాలకు చెందిన మరో ఏడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. భూమికి 730 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధ్రువ కక్ష్యలో వీటిని ప్రవేశపెట్టింది.
ఈ ప్రయోగం ద్వారా.. 371 కిలోల బరువున్న స్కాట్‌శాట్‌-1 స్వదేశీ ఉపగ్రహంతో పాటు.. జర్మనీకి చెందిన మ్యాక్స్‌ వల్లర్‌(20కిలోలు), వెంటా-1(20 కిలోలు), కెనడాకు చెందిన ఎన్‌ఎల్‌ఎస్‌-19(8కిలోలు), యూఎస్‌ఏకు చెందిన పాత్‌ ఫైండర్‌-1(44కిలోలు), అల్జీరియాకు చెందిన ఆల్‌శాట్‌-2బీ(103 కిలోలు), ఆల్‌శాట్‌-1బీ(103 కిలోలు), ఆల్‌శాట్‌-1ఎన్‌(7కిలోలు), వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రథమ్‌, పీశాట్‌ ఉప్రగహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. 


ఈ ప్ర‌యోజ‌నాల కోస‌మే..

ఇలాంటి ప్రయోగాన్ని నిర్వహించడం ఇస్రోకు కొత్తేమీ కాదు. కాని ఈసారి విశేషమేమిటంటే.. ఒకే రాకెట్‌తో అనేక ఉపగ్రహాలను భిన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం సముద్రాల్లో వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు దోహద పడనుంది. శాటిలైట్లు పనిచేయడం ప్రారంభిస్తే, దేశంలో పెను తుపానులు, సునామీల ముప్పును ముందుగానే అంచనా వేసే సాంకేతిక సామర్థ్యం ఇండియా పరమవుతుంది. 2017లో అంగారక గ్రహానికి సంబంధించి కీలక ప్రయోగాలకు ఇస్రో ప్రణాళికలు వేసిన నేపథ్యంలో ఈ ప్రయోగం విజయవంతం కావడం దేశానికి గర్వకారణమని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు గతంలో అనుసరించిన పద్ధతులకు పూర్తిగా భిన్నమైన ప్రక్రియను ఈసారి అవలంభించారు. 8 ఉపగ్రహాలను 2 విభిన్న క్షక్ష్యల్లోకి ప్రవేశపెట్టనుండటంతో ప్రయోగం పూర్తవడానికి 2 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. ఇస్రో ఇలాంటి ప్రయోగాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి. ఒకే రాకెట్‌ ద్వారా పలు ఉపగ్రహాలను ప్రయోగించడం ఇస్రోకు కొత్త కాకపోయినా.. ఒకే రాకెట్‌తో పలు శాలైట్లను భిన్న క్షక్ష్యల్లో ప్రవేశపెట్టడమే కొత్త ప్రక్రియ. ఇందుకోసం మల్టిపుల్‌ బర్న్‌ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. పీఎస్ఎల్వీ -సీ 35 రాకెట్‌లో ఘన, ద్రవ ఇంధనాలతో పనిచేసే 4 దశలు ఉంటాయి. బహుళ ఉపగ్రహాలను విభిన్న కక్ష్యల్లో ప్రవేశపెట్టడానికి 4వ దశను పలుమార్లు ఆఫ్‌ చేసి, ఆన్‌ చేస్తారు. సాధారణంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన ఉపగ్రహాల ఎత్తు పెంచడానికి వీటి ఇంజిన్లను ఇలా ఆన్‌, ఆప్‌ చేస్తుంటారు. అయితే ఒకసారి ఆన్‌, ఆఫ్‌ చేసిన తర్వాత మరోసారి ఆన్‌, ఆఫ్‌ చేయడానికి మధ్య కొన్ని రోజుల బ్రేక్ ఉంటుంది. గతేడాది డిసెంబర్‌ 16న 6 ఉపగ్రహాలను ప్రయోగించినప్పుడు ఇస్రో ఈ ప్రక్రియను ప్రయోగాత్మకంగా పరీక్షించింది.


4 నిమిషాల తర్వాత కక్ష్యలోని మరో 7 ఉపగ్రహాలు
పీఎస్ఎల్వీ -సీ 35 ద్వారా ముందుగా మనదేశ వాతావరణంతో పాటు, సముద్ర పరిశోధనలకు ఉద్దేశించిన స్కాట్‌శాట్‌-1ను కక్ష్యలో ప్రవేశ‌పెట్టారు. 371 కిలో బరువున్న స్కాట్‌శాట్‌-1 ఉపగ్రహాన్ని 370 కి.మీ. ఎత్తులోని సన్‌ పోలార్‌ సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌లోకి చేర్చారు. కక్ష్యలో ప్రవేశపెట్టిన తర్వాత పీఎస్‌ఎల్‌వీ 4వ‌ దశ ఇంజిన్‌ను శాస్త్రవేత్తలు ఆఫ్ చేశారు. శ్రీహరికోట నుంచి బయలుదేరిన తర్వాత గంటా 22 నిమిషాల తర్వాత మళ్లీ ఆన్ చేశారు. 20 సెకన్లపాటు మండించి మరోసారి ఆఫ్ చేశారు. ప్రయోగ కేంద్రం నుంచి బయలుదేరిన 2 గంటల 11 నిమిషాల తర్వాత ఇంజిన్‌ను మళ్లీ మండించారు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత 4నిమిషాలకు మరో 7చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. వీటిలో అమెరికా, కెనడా, అల్జీరియా శాటిలైట్లతోపాటు మన దేశంలోని యూనివర్సిటీలకు చెందిన ఉపగ్రహాలు ఉన్నాయి.

పీఎస్‌ఎల్‌వీ-సి35 రాకెట్‌ ప్రయోగం విజ‌య‌వంతం కావ‌డం ప‌ట్ల రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని ఆనందం వ్య‌క్తం చేశారు. ఈ రాకెట్ ప్ర‌యోగం భారత దేశానికి గర్వకారణమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలుపుతున్నానని తెలిపారు. 8 ఉపగ్రహాలను ఒకేసారి విభిన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టే ఈ ప్రయోగంతో ఇస్రో శాస్త్రవేత్తలు దేశానికి మరో ఘనతను చేకూర్చారని కొనియాడారు.


కొత్త అధ్యాయం 
రాకెట్‌ ఇంజిన్‌ను ఆఫ్‌ చేసినప్పుడు అది ఒక ధృవం నుంచి మరో ధృవానికి ప్రరిభ్రమిస్తుంది. మధ్యలో ఇంజిన్‌ను మండించి, ఆఫ్‌ చేసినప్పుడు కక్ష్య మారుతుంది. విభిన్న కక్ష్యల్లో ప్రవేశపెట్టాల్సిన ఉపగ్రహాలను ఒకే రాకెట్‌తో ప్రయోగించడం వల్ల వ్యయాలు తగ్గుతాయి. ఇస్రో ఇంతకు ముందు 20 ఉప్రగ్రహాలను 670 కి.మీ. ఎత్తులోని పోలార్‌ సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించింది. పీఎస్‌ఎల్‌వీ-సీ35 ప్రయోగం ద్వారా ఇప్పుడు మరో కొత్త అధ్యయానికి తెరతీసినట్లైంది.



మరింత సమాచారం తెలుసుకోండి: