మీడియా రంగంలో తెలుగు రాష్ట్రంలో మొట్టమొదట నిరంతర వార్తా ప్రసార స్రవంతికి తెరలేపింది టీవీ9 అనే విషయం అనందరికీ తెలిసిందే. టీవీ9 తర్వాతే కొన్ని వందల చానాళ్లు పుట్టుకొచ్చాయి. కొత్తగా వచ్చిన న్యూస్ ఛానెల్స్ ఒక సంవత్సర కాలం కూడా సక్రమంగా కొనసాగక మూతబడి పోతుంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదట స్థాపించబడి ఇప్పటికీ నెంబర్ వన్ స్థానంలో నిలబడిందంటే ఆ విజయం కేవలం టీవీ 9 కే దక్కుతుంది.


Image result for ravi prakash tv9

మొదట ప్రతిష్టాత్మక సంస్థలో జర్నలిస్ట్ గా పనిచేసిన  టీవీ 9 సీఈఓ రవి ప్రకాష్ తాను గడించిన అపార అనుభవం తో తెలుగు రాష్ట్రాలు గర్వించే విధంగా, జాతీయ స్థాయిలో సైతం పేరు ప్రఖ్యాతలు గడించడం జరిగింది. అయితే టీవీ 9 లో రవి ప్రకాష్ తో పాటు పలువురు ప్రముఖులు పెట్టుబడులు పెట్టిన విష్యం అందరికీ విదితమే. ప్రముఖ టీవీ న్యూస్ చానల్ టీవీ 9పై జీ గ్రూప్ కన్నేసింది. టీవీ 9ను నిర్వహిస్తున్న అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీఎల్)లో మెజారిటీ వాటాలు చేజిక్కించుకునేందుకు జీ గ్రూప్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.


Image result for ravi prakash tv9

ఏబీసీఎల్‌లో వెంచర్ క్యాపిటలిస్ట్ శ్రీని రాజు(పీపుల్స్ క్యాపిటల్) ప్రధాన వాటాదారుగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఏబీసీఎల్‌ను రూ.850 కోట్లకు కొనుగోలు చేసేందుకు జీ గ్రూప్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. టీవీ 9, జైతెలంగాణ పేరుతో తెలుగులో న్యూస్ చానళ్లు నిర్వహిస్తున్న ఏబీసీఎల్ కన్నడ, మరాఠీ, గుజరాతీ, ఇంగ్లిష్ తదితర మొత్తం ఏడు చానళ్లను నిర్వహిస్తోంది. గతంలోనూ ఏబీసీఎల్‌ను కొనుగోలు చేసేందుకు పలువురు ఇన్వెస్టర్లు ముందుకు వచ్చినా సరైన డీల్ కుదరలేదు. తాజాగా జీ గ్రూప్ టీవీ 9పై కన్నేసినట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: