ఈ మద్య కాలంలో సినిమా నటులకంటే ఎక్కువ పాపులారిటీ  టీవీ యాంకర్లకు వస్తుందనడంతో ఆశ్చర్యం లేదు. అయితే ప్రపంచ వ్యాప్తంగా కొన్ని టెలివిజన్ యాంకర్లు అందంగా ఉండటమే కాకుండా గ్లామర్ తరహాలో విపరీతమైన ఎక్స్ పోజింగ్ చేయడంలాంటివి చేస్తు జనాలను బాగా ఆకర్షిస్తున్నారు. ఇక హాలీవుడ్ లో టాక్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న కిమ్ కర్దాషి అందరికీ తెలుసు. ఇక తెలుగు బుల్లితెరపై వస్తున్న యాంకర్లు అనసూయ,రేష్మీ,శ్రీముఖి లాంటి యాంకర్ల గ్లామర్ తరహా ఎంతగా ఆకర్షిస్తున్నారో వేరే చెప్పనక్కరలేదు. తాజాగా పాకిస్థాన్ లో ఓ దారుణం జరిగింది.  
Abb Takk host Sana Faisal 'poisoned by fan'
అభిమాని ఎంతో అభిమానంతో ఆమెతో సెల్ఫీ దిగాడు తర్వాత ప్రేమతో ఐస్ క్రీమ్ ఇచ్చాడు..ఇంకేముంది అభిమాని ఐస్ క్రీమ్ ఎంచక్కా ఇచ్చాడని తినడంతో ఒక్కసారే అమ్మడు ఆస్పత్రిపాలైంది..అయితే ఇంతకీ ఆ అభిమాని ఇచ్చింది..ఐస్ క్రీమ్ మాత్రం కాదు అందులో విషం కూడా కలిపి మరీ ఇచ్చాడట. యాంకర్ సనా ఫైజల్ ఓ న్యూస్ చానల్ లో యాంకర్ గా పనిచేస్తోంది .

కాగా భర్తతో కలిసి షాపింగ్ కి వచ్చిన సమయంలో అభిమానిని అంటూ ఓ యువకుడు వచ్చి సనా ఫైజల్ తో సెల్ఫీ తీసుకొని ఐస్ క్రీం ఇచ్చాడు దాంతో అభిమానం తో ఇచ్చాడు కదా అని తింటే చావు దాకా వేల్లోచ్చింది. ప్రస్తుతం సనా ఆస్పత్రిలో ఐసియు లో చికిత్స పొందుతుంది. దీంతో పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

SANA 6

SANA 7

SANA 5

SANA 4


మరింత సమాచారం తెలుసుకోండి: