సార్క్‌ శిఖరాగ్ర సదస్సు రద్దు: నేపాల్‌ ప్రకటన


ఈ ఏడాది నవంబర్‌లో ఇస్లామాబాద్‌లో జరగాల్సిన సార్క్‌ దేశాల శిఖరాగ్ర సదస్సు రద్దయింది. సదస్సుకు బహిష్కరించాలన్న భారత్‌ నిర్ణయం నేపథ్యంలో బంగ్లాదేశ్‌, భూటాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌లు కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నట్లు ప్రకటించటంతో సార్క్‌ నేతృత్వ బాధ్యతలు వహిస్తున్న నేపాల్‌ ఈ సదస్సు రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. 


అమెరికాలో ఎన్నారై కాల్పులు :
అమెరికాలో భారత సంతతి లాయర్ కాల్పులు
అమెరికాలో వున్న తుపాకీ సంస్కృతి ఇప్పుడు అక్కడి భారతీయులకు కూడా సోకింది. విద్య, ఉద్యోగం కోసం అమెరికా వెళ్లి అక్కడ నరనరానా జీర్ణించుకుపోయిన తుపాకీ సంస్కృతిని భారతీయులు కూడా ఒంటబట్టించుకుంటున్నారు. వ్యక్తిగత సమస్యల వల్ల ఓ భారత సంతతి న్యాయవాది రోడ్డుపై కనిపించిన 9 మందిని కాల్చేశాడు. 


తమిళనాడుకి చుక్క నీరు కూడా ఇవ్వొదు:

సుప్రీం చెప్పినా సరే.. వదలొద్దు

గత కొంత కాలంగా  కర్ణాటక, తమిళనాడుల మధ్య ఏర్పడిన కావేరి జలాల వివాదం తీవ్రమవుతోంది. కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయరాదని కర్ణాటకలో అన్ని పార్టీలు నిర్ణయించాయి. అంతే కాదు బుధవారం బెంగళూరులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో నాయకులు తమ అభిప్రాయలను తెలియజేశారు. కావేరి జలాలను కర్ణాటకలో తాగు నీటి అవసరాలకు వాడాలని, తమిళనాడుకు విడుదల చేయరాదని అఖిలపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వానికి సూచించారు.


భారతో తో  పాక్ యుద్దానికి సిద్ధమవుతోందా?

Image result for india pakistan war

పాకిస్థాన్ వ్యవహారశైలి చూస్తుంటే భారత్‌తో యుద్ధాన్ని కోరుకుంటున్నట్లుగానే తెలుస్తోంది. ఎందుకంటే.. యూరీ ఉగ్రదాడుల తర్వాతత తొలిసారిగా పాకిస్థాన్ సైన్యం, వాయుసేన దళాలు అతిపెద్ద సంయుక్త యుద్ధ విన్యాసాలను జైసల్మేర్‌కు కేవలం 15 కిలోమీటర్ల దూరంలోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ప్రదర్శించింది.


ప్లే బాయ్ మ్యాగజైన్ ఆడవారి బొమ్మ :

తొలిసారి ప్లేబాయ్ మ్యాగజైన్లో ముస్లిం మహిళ

ఇప్పటి వరుకు ప్లే బాయ్ మ్యాగజైన్ పై మగవారి బొమ్మలే వస్తుండేవి మొట్ట మొదటి సారిగా.. ఒక బురఖా ధరించిన ముస్లిం మహిళ కథనాన్ని ప్రచురించింది. దీనిపై విమర్శలు, పొగడ్తలు వినిపిస్తున్నాయి. అక్టోబర్  నెలకు చెందిన సంచికలో అమెరికాలో టీవీ జర్నలిస్టుగా పనిచేస్తున్న నూర్ తగౌరి కథనాన్ని ప్రచురించింది. అమెరికాలో ముస్లింల పట్ల ఉన్న వివక్షను ఎదుర్కొంటూ ఒక మహిళ ఎదిగిన తీరును మ్యాగజైన్ ప్రశంచింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: