సచిన్ టెండూల్కర్ - ఈ వ్యక్తి పేరు చెబితే దేశం లో ప్రతీ ఒక్కరి మనసూ పులకరిస్తుంది. లెజెండ్రీ క్రికెటర్ గా చరిత్రపుటల్లో ఎక్కడానికి సచిన్ కి చాలా సంవత్సరాల కృషి, దీర్ఘమైన సాధన అవసరం అయ్యాయి. ఆయన తరవాత అంతగా ఇండియన్ క్రికెట్ కి పాజిటివ్ బేస్ తీసుకొచ్చిన క్రికెటర్ అంటే ఖచ్చితంగా ధోనీ పేరే చెబుతారు ఎవరైనా. క్రికెట్ ప్లేయర్ గా ధోనీ చాలా తక్కువ టైం లో లెజెండ్రీ స్టాటస్ ని మూట గట్టుకున్నాడు. అశేష అభిమానగణం అతనివెంట నడిచింది. సచిన్ కీ ధోనీ కీ కీలకమైన డిఫరెన్స్ లు ఎక్కువగానే కనపడతాయి. సచిన్ విషయంలో అందరూ అతని అద్వితీయమైన ఆటతీరు కి మంత్రం ముగ్ధులు అవుతారు కానీ ధోనీ విషయంలో మాత్రం పూర్తిగా అతని ఆట మాత్రమే అతని స్థాయిని పెంచలేదు, అతని ఆటతో పాటు - మనస్తత్వం , కష్టపడే తీరు , ఎంత ఎదిగినా సైలెంట్ గా ఉండడం , జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడం, కుర్రాళ్ళ ని ఎంకరేజ్ చెయ్యడం లో ఆసక్తి ..

ఇలా ఎన్నో ఎన్నెన్నో ధోనీని విజయపథం లో నిలపడమే కాక నేటి తరానికి అతిపెద్ద హీరోని చేసాయి. క్రికెట్ ని పాపులర్ చెయ్యడం లో సచిన్ తరవాత ధోనీకి అగ్రస్థానం దక్కి తీరుతుంది. సచిన్ క్లాస్ ప్లేయర్ కానీ ధోనీ ఫుల్ టూ మాస్.. విజిల్ పోడు అంటూ గల్లీ గల్లీల్లో ఉత్సాహం నింపగలడు ధోనీ. ప్రపంచంలోనే అతి గొప్ప బ్యాట్స్ మెన్ గా పేరు తెచ్చుకోవడమే కాక ప్రపంచంలో ఏ క్రికెటర్ సంపాదించలేనంత డబ్బుని విరివిగా సంపాదించి పడేసాడు సచిన్ అతన్ని ఆటలో కాకపోయినా అతితక్కువ టైం లో క్రేజ్ లో, డబ్బు సంపాదన లో ధోనీ తలదన్నేసాడు. బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం లో ధోనీ ని చూసే సచిన్ అయినా నేర్చుకోవాల్సిందే. తన పేరు ఎక్కడ పడాలో అక్కడ , ఎక్కడ వాడాలో అక్కడ వాడేలా తానే చేసుకున్నాడు ధోనీ. 2011 వరల్డ్ కప్ ఫైనల్‌లో యువరాజ్ సింగ్‌ను కాదని తనే ముందు దిగడంలోనే ధోనీ తెలివితేటలు తెలిసిపోతున్నాయి. మీడియా తో అతనికి ఉన్న లింక్స్ కారణంగా ధోనీ ఈ రకమైన స్థాయికి ఎదిగాడు అంటున్నారు. ఏదేమైనా రేపు విడుదల కాబోయే ధోనీ - దీ అన్ టోల్డ్ స్టోరీ కోసం దేశం మొత్తం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది.

రిటైర్మెంట్ కి దగ్గర అవుతున్న టైం లో భారత్ మొత్తం అతన్ని గుర్తించే విధంగా ఈ సినిమా ని స్వయంగా తన జీవిత కథగా మార్చి మరీ విడుదల చేస్తున్నాడు ధోనీ. ఈ సినిమా ఐడియా గురించి ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే ఇదంతా ఆఫ్ ఫీల్డ్ లో ధోనీ ఆడిన గేమ్ లాగా కనిపిస్తోంది. రిటైర్మెంట్ దగ్గర పడడంతో తన పేరుని శాశ్వతంగా ఎలా ఉంచుకోవాలి అని ఆలోచించిన ధోనీ మొదట ఈ సినిమా ఐడియా ని తన స్నేహితుడు అరుణ్ పాండే తో పంచుకున్నాడట. ఆ తరవాత వివారాలు అన్నీ అరుణ్ పాండే చూసుకున్నాడు అంటున్నారు. ఈ సినిమా ఐడియా నీరజ్ పాండే ( డైరెక్టర్) కంటే ముందర ధోనీ నుంచే వచ్చింది. తన సన్నిహితుడు అరుణ్ పాండే నే ధోనీ ప్రొడ్యూసర్ గా పెట్టడం చాలా ప్రశ్నలు లేవనేత్తుతోంది, అంతేకాకుండా ఈ సినిమా కోసం , సినిమా పబ్లిసిటీ కోసం కూడా సినిమా డైరెక్టర్, హీరోల కంటే ధోనీనే ఎక్కువ కష్టపడుతున్నాడు. స్టార్ హీరోలు వాళ్ళ సినిమాల గురించి చెప్పుకున్నట్టుగా ‘ధోనీ’ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పేస్తున్నాడు.

క్రికెట్ ప్రేమికులు, విశ్లేషకులు తమ ఊహకి అందని విషయాలు ఎన్నో ఈ సినిమాతో తెలుసుకుంటారు అనీ ఇంకా ఏవేవో హైప్ ఇచ్చే విషయాలు ధోనీ పబ్లిసిటీ ద్వారా తెలియపరుస్తున్నాడు. ప్రతీ చోటా ఆడియో వేడుకలకీ, పబ్లిసిటీ కీ కాదు అనకుండా స్వయంగా వెళుతున్నాడు ధోనీ. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా బ్రాండ్ వ్వాల్యూ పెంచుకోవడం, ఎండార్స్‌మెంట్స్ విషయంలో ధోనీ తెలివితేటల గురించి అవగాహన ఉన్నవాళ్ళందరూ కూడా ఈ సినిమాను కచ్చితంగా ధోనీనే ప్రొడ్యూస్ చేసి ఉంటాడని అభిప్రాయపడుతున్నారు. పబ్లిసిటీ కోసం , ఓపెనింగ్ ల విషయం లో ధోనీ పడుతున్న కష్టం చూస్తుంటే ధోనీ నే ప్రొడ్యూస్ చేసాడు అనేది అభిప్రాయం నుంచి గట్టినమ్మకం వైపుగా చేరుతోంది . ఏదేమైనా ధోనీ తెలివితేటలు దేశం లో మరే క్రికెటర్ కీ లేవు అనే చెప్పాలి.

ఒక సదరు సినిమాని చేతిలోకి తీసుకుని దానికి తన హిస్టరీ నే యాడ్ చేసి విపరీతంగా పబ్లిసిటీ చేసుకుని, అద్భుతమైన కలక్షన్ లని టార్గెట్గా పెట్టుకున్నాడు అంటే ధోనీ కంటే గొప్ప వ్యాపారస్తుడు ఎవరు ఉంటారు చెప్పండి ? ఇంతకీ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మాత్రం ఆసక్తికర విషయం. నీరజ్ పాండే మీద ధోనీ బాగా నమ్మకంగా ఉన్నాడు అంటున్నారు. సో ఈ లెక్కన సినిమా ఒక క్లాసిక్ గా మిగిలిపోయే ఛాన్స్ ఉంది. apherald వ్యూయర్స్ తరఫున ఆల్ దీ బెస్ట్ ధోనీ ..   


మరింత సమాచారం తెలుసుకోండి: