భారత దళాల సర్జికల్ స్ట్రైక్స్ విషయం బయటకొచ్చిన తర్వాత భారత్-పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ఉద్రిక్తతలు క్షణక్షణం పెరుగుతూనే ఉన్నాయి. ఏ క్షణాన్నైనా యుద్ధం జరిగే అవకాశమున్నట్టు వార్తలు వచ్చాయి. ఎదుర్కొనేందుకు ఇరు దేశాల సైన్యాలు అప్రమత్తంగా ఉన్నాయంటూ బ్రేకింగులు వచ్చాయి. ఇదిలా ఉంచితే ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భారత్ తన సరిహద్దు వెంబడి భారీగా దళాలను మోహరించింది. రంగంలోకి దిగిన ఎయిర్‌ఫోర్స్ విమానలు గస్తీ కాస్తున్నాయి. మరోవైపు సరిహద్దు భద్రతపై కేంద్ర కేబినెట్ కమిటీ నేడు భేటీకానుంది.


Image result for indian border

 భారత్ మెరుపు దాడులతో ఫీజులు ఎగిరిపోయిన పాక్ ఇప్పుడు భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే పనిలో పడింది. తప్పుడు కథనాలతో తమ దేశ పౌరులను మభ్యపెట్టడమే కాకుండా భారత సైనికులపైనా పైచేయి సాధించాలని చూస్తోంది. ఈ మేరకు నియంత్రణ రేఖ వద్ద తాము 14 మంది భారత సైనికులను మట్టుబెట్టినట్టు పాక్ మీడియా గురువారం కల్పిత వార్తలు ప్రచురించింది. పాక్ సైన్యాన్ని ఉటంకిస్తూ రాసిన ఈ వార్తల్లో 14 మంది భారత సైనికులను పాక్ దళాలు హతమార్చాయని, చందుబాబులాల్ చౌహాన్(22) అనే భారతీయ సైనికుడిని దళాలు అదుపులోకి తీసుకున్నాయని రాశాయి. జియో న్యూస్ 14 మంది భారత సైనికులు అని పేర్కొనగా ‘డాన్’ 8 మంది అని పేర్కొనడం గమనార్హం. అయితే పాక్ సైనిక్ వెబ్‌సైట్‌లో మాత్రం ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి వివరాలు లేకపోవడం విశేషం. 


Image result for indian border

పాక్ మీడియా కథనాలను భారత్ తీవ్రంగా ఖండించింది. అవి నిరాధార, అవాస్తవ కథనాలని పేర్కొంది. భారత్ తనన ఖండనను ప్రకటించిన కాసేపటికే డాన్ పత్రిక తన వెబ్‌సైట్ నుంచి భారత సైనికులను హతమార్చిన కథనాన్ని ఉపసంహరించుకుంది. కాగా చందుబాబులాల్ నిర్బంధంపై పాక్ చేసిన ప్రకటనపై భారత ఆర్మీ స్పందించింది. బాబులాల్ పొరపాటున ఎల్‌వోసీ దాడి పాక్ భూభాగంలో ప్రవేశించారని, ఈ విషయాన్ని డీజీఎంవో పాకిస్థాన్‌కు తెలియజేశారని పేర్కొంది. సంప్రదింపుల ద్వారా తిరిగి ఆయనను భారత్ రప్పిస్తామని తెలిపింది.


Image result for indian border

ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాకిస్థాన్‌లో నిర్భయంగా తిరుగుతున్న ఉగ్రవాదులు ప్రపంచ దేశాల వెన్నులో వణుకుపుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలో ఉగ్రవాద సంస్థలు అధికంగా ఉన్న దేశాల్లో పాకిస్థాన్ మొదటిస్థానంలో ఉన్నట్టు ఇటీవల అమెరికా విదేశాంగ శాఖ ఓ నివేదిక ప్రచురించింది. దీంతో పాకిస్థాన్ సంగతేంటో మరోమారు ప్రపంచానికి తెలిసింది. ఆల్‌ఖైదా నుంచి లష్కరే తాయిబా వరకు ప్రముఖ ఉగ్రవాద సంస్థలకు పాక్ పుట్టినిల్లగా మారిందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పీవోకేలో నడుస్తున్న ఉగ్రవాద సంస్థల గురించి ఓసారి తెలుసుకుందాం.



Image result for indian border
ఆల్‌ఖైదా: ఆఫ్ఘనిస్థాన్‌పై రష్యా దురాక్రమణను నిరసిస్తూ 1988లో కొందరు సున్నీ ముస్లిం యువకులు దీనిని ప్రారంభించారు. ఒసామాబిన్ లాడెన్ సారథ్యంలో ఏర్పాటైన ఈ సంస్థ అమెరికాలో సృష్టించిన మారణహోమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికా సేనల దాడిలో 2011లో మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది అయిన లాడెన్ హతమయ్యాడు. లాడెన్ హతమయ్యాక ఆల్‌ఖైదా పగ్గాలను జవహరీ అందుకున్నాడు. లాడెన్ సుదీర్ఘకాలం పాటు పాకిస్థాన్‌లోనే ఉన్నాడు. అమెరికా దళాలు ఆయనను హత్య చేసిందీ కూడా అక్కడే. అయినా సరే పాక్ మాత్రం తాము ఉగ్రవాదాన్ని సహించబోమంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతుండడం గమనార్హం. 


మరింత సమాచారం తెలుసుకోండి: