ఉరి దుర్ఘటన తరవాత భారత సైన్యం పాక్ టెర్రరిస్ట్ మూకల మీద ప్రతీకారం తీర్చుకోవాలని ముచ్చట పడింది. మొదటి నుంచీ వారి మీద దాడులకి ప్రయత్నాలు చేసినా ప్రభుత్వ ఒత్తిళ్ళు, ప్రపంచ దౌత్య సంబంధాల మేరకు తలోగ్గుతూ ఒచ్చిన మన ఆర్మీ మొత్తానికి తెలివిగా ఒక్కొక్క ఉగ్రవాదినీ, వారి శిబిరాలనీ మట్టు బెట్టే క్రమం లో దాదాపు వారం రోజుల పాటు శ్రమించి వారికి తెల్లవారు జామున చుక్కలు చూపించింది. ఊహించని ఈ దాడి తో ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ దాడులు జరిగింది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో అవ్వడం తో పాక్ కి ఇది చాలా పెద్ద ఎదురు దెబ్బ. సుమారుగా నెల , నెలన్నర కాలం పాటు పట్టే ఈ దాడులని మన సైన్యం అత్యంత చాకచక్యంగా డ్రోన్ ల సహాయం , శాటిలైట్ ల సహాయం తీసుకుని త్వరగా పని ముగించింది ఎంత త్వరగా అంటే మాటు వెయ్యడం మొదలు పెట్టిన కేవలం ఐదారు రోజుల్లోనే పని పూర్తి చేసేసారు భారతీయ సైనికులు.

ఎంత చాకచక్యంగా అంటే ఒకపక్క దేశం మొత్తం పాకిస్తాన్ మీద అట్టుడికి పోతూ, వారి మీద ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నా కూడా ఎక్కడా ఈ విషయం లీక్ అవ్వనివ్వకుండా జాగ్రత్త పడ్డ్డారు. ప్రభుత్వ వర్గాల్లోంచి కానీ - ఆర్మీ నుంచి కానీ బయటకి పొక్కలేదు ఈ వ్యవహారం. కనీసం ఒక్కటంటే ఒక్క మాట కూడా " మేము ప్రతీకారం తీర్చుకునే పనిలోనే ఉన్నాం " అని మాటకైనా చెప్పలేదు ఎవ్వరూ. అలా లీక్ చేసి ఉగ్రవాదులని జాగ్రత్త పరిచే ఉద్దేశ్యం ఒక్కరికీ లేదు మరి . మొత్తానికి సర్జికల్ స్ట్రైక్ అంటూ వారి అంతు చూసేసారు మనోళ్ళు. మరి వారి ప్రతీకారం సంగతేంటి ? వారెలా రెస్పాండ్ అవుతారు ? ఉగ్రవాద మూకలు మామూలు మూర్ఖులు కాదు. వందలాది మనుషులతో వేలాది స్లీపర్ సెల్స్ ని వాడి దేశం లో ప్రతీ మూలా ఎదో ఒక అరాచకం సృష్టించడం ధ్యేయంగా పెట్టుకున్నారు. హైదరాబాద్, ముంబై , తిరుపతి , అనంతపూర్, కొచ్చిన్, చెన్నయ్ , పూణే , నాగాలాండ్ ఇలా ఒకటేంటి మీ ఊర్లో మా ఊర్లో కూడా ఉండచ్చు ఈ స్లీపర్ సెల్స్.

దేశం లో ఎక్కడ ఎలాంటి అరాచకం సృష్టించాలి అన్నా ఈ స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేస్తారు వీరు. సరిగ్గా ఇలాంటి తరుణం కోసమే ఎదురు చూస్తున్న స్లీపర్ సెల్స్ కూడా రెచ్చిపోతారిక. ఒకరికి ఒకరు ఏ మాత్రం సంబంధం లేకుండా పని పూర్తి చెయ్యడమే వీరి ప్రత్యేకత. ఇలాంటి భీకర ప్రతీకార దాడి నుంచి తేరుకోక ముందరే ఉగ్రవాదులు ఖచ్చితంగా పగ మీద ఉంటారు అంటోంది ఇంటెలిజన్స్ శాఖ. ముఖ్యంగా జమ్ము కాశ్మీర్ తో పాటు పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ లను పాక్ ప్రేరేపిత ముష్కరులు టార్గెట్ చేయవచ్చంటూ అప్రమత్తం చేశారు. ఉగ్రవాదుల అతిపెద్ద టార్గెట్ ముంబై లేదా హైదరాబాద్ కావచ్చు అని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ముంబై పట్టణం లో జరిగినన్ని ఉగ్రదాదులు ఏ నగరం లో కూడా జరగలేదు ..

అక్కడ పాకిస్తానీ స్లీపర్ సెల్స్ అధిక సంఖ్యలో ఉంటాయి అని పోలీసుల అంచనా . ముంబై తరవాత హైదరాబాద్ లో వారి నిఘా ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ లోనూ లష్కరే, ఇతర ఉగ్రవాద సంస్థల స్లీపర్ సెల్స్ భారీగానే ఉండొచ్చు. ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఐఎస్ఐ అడ్డాగా ఉండేది. పోలీసులు సీరియస్ గా దృష్టిపెట్టి చాలా మంది ఐఎస్ఐ ఏజెంట్లను పట్టుకున్నారు. అయినా, స్లీపర్ సెల్స్ ఉండే అవకాశం ఉందన్నది నిఘా అధికారుల హెచ్చరిక. దసరా సమయం కూడా కావడం ఉగ్రవాద దాడులకి ఇది కరెక్ట్ టైం అని వారు భావించడం, హిందూ పండగ కావడం తో ఇలాంటి సమయం లో దాడులు చేస్తే హిందూ ముస్లిం ల మధ్య సయోధ్య ని కూడా కోల్పోయేలా చెయ్యచ్చు అనేది వారి టార్గెట్ అంటున్నారు.

దసరా సందర్భంగా మండపాలలో వేలాది మంది గుమిగూడి ఉంటారు . దైవ దర్శనం, సాంస్కృతిక కార్యక్రమాల సందడిలో ఉంటారు. అలాంటి సమయం లో ఏ మాత్రం అజాగ్రత్తగా  ఉన్నా కూడా కొంప మునిగే ప్రమాదం ఉండనే ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: