'అజిత్ దోవల్'... ఈపేరు వినబడితే శత్రుదేశాల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి, ఒక బిక్షగాడి రుపంలో పాకిస్తాన్ లో గూఢచర్యం, స్వర్ణ దేవాలయంలోకి ఉగ్రవాదులు చొరబడితే ఒక రిక్షావాడి వేషంలో అక్కడికి వెళ్లి పరిస్థితిని మన జవాన్లకు చేరవేయ‌డం అయ‌న కే సాధ్య‌మ‌య్యింది. అంతేకాదు.... దేశం కోసం ఎన్నో ఆపరేషన్ లను నిర్వహించాడు. ఒకమాట‌లో చెప్పాలంటే  ధైర్యా నికి మారుపేరు దోవల్.  ఒక పని అప్పగిస్తే దాన్ని విజయవంతంగా నెరవెర్చే దాకా నిదురపోడు. అందుకే ఆయన అంటే మోదీ గారితో పాటు దేశ ప్రజలకు ఎంతో ఇష్టం. జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న దోవల్ కు తాజాగా ఉగ్రవాద ఏరి వేతను మోదీ అప్పగించారు. అంతే ఒక్క‌సారిగా రంగంలోకి  దిగి కేవ‌లం వారం రోజుల్లో పూర్తి చేసి చూపించారు. ఇలాంటి ఆపరేషన్లను చేపట్టాలంటే అగ్రరాజ్యాలకు సైతం నెలల వ్వవధి పడు తుంది.
 
ఆప‌రేష‌న్ పీఓకే లో అజిత్ దోవ‌ల్..


పీఓకే ( పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్)  లో మనకు అనుకూలంగా ఉన్న కొంత మంది ప్రజల సహాయంతో ఉగ్ర కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పని అప్పగించిన వారం రోజుల్లోనే పక్కాప్రణాలికలు రచించి భారత్ దెబ్బ ఎలా వుంటుందో పాకిస్తానుకు రుచి చూపించాడు. దీంతో ఇన్నాళ్లూ ర‌క్ష‌ణాత్మ‌క  ధోర‌ణిని అవ‌లంభించిన భార‌త్ ఎదురుదాడి వ్యూహానికి ప‌దును పెడుతోందని విశ్లేష‌కులు భావిస్తున్నారు. అయితే ఈ వ్యూహానికి బీజాలు ఇప్పుడు కాదు.. రెండేళ్ల కింద‌టే ప‌డ్డాయి. దీనంత‌టి వెనుక జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ కీల‌క పాత్ర పోషించారు. ‘పాక్ ఒక్క బుల్లెట్ పేలిస్తే మీరు రెండు బుల్లెట్లతో సమాధానం చెప్పండి’ అంటూ రెండేళ్ల కిందటే అజిత్ దోవల్ సైన్యానికి స్పష్టంచేశారు. పాక్ ఏమాత్రం కవ్వించినా తగిన విధంగా బుద్ధి చె ప్పాలని, దీటుగా స్పందించాలని సూచించారు. 


ప్ర‌ధాన బాధ్య‌త‌లు చేప‌ట్టిన దోవ‌ల్...

కాల్పుల విషయంలో పై నుంచి ఆదేశాల కోసం ఎదురుచూడకుండా అప్పటికప్పుడు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవా లంటూ దిశానిర్దేశం చేశారు. గ‌తంలో అనేక ఆప‌రేష‌న్ల‌లో చాక‌చ‌క్యంగా నిర్వ‌హించిన దోవ‌ల్... ఇప్పుడు కూడా అదే రీతిలో వ్యూహాల‌తో ముందుకు సాగుతున్నారు. అందుకే ప్ర‌ధానిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన అనంత‌ర‌మే దోవ‌ల్ కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు న‌రేంద్ర‌మోడీ. ప్ర‌స్తుతం దోవ‌ల్... ప్ర‌ధానికి జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుగా కొన‌సాగు తున్నారు. ఐపీఎస్ అధికారి అయిన  దోవ‌ల్ గ‌తంలో  భ‌ద్ర‌తాప‌ర‌మైన చాలా ఆప‌రేష‌న్ల‌ను స్వ‌యంగా నిర్వ‌హించారు. భార‌త ఇంటెలిజెన్స్ , లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారిగా కూడా ఆయ‌న ప‌ని చేశారు. 

ఆప‌రేష‌న్ బ్లాక్ థండర్ లో దోవ‌ల్ వ్యూహాం

1988 పంజాబ్ లోని అమృత్ సర్ న‌గ‌రంలోని ఒక ప్రార్థ‌నామందిరం లోని ఉగ్ర‌వాదుల‌ను ఏరివేసేందుకు భద్ర‌తా ద‌ళాలు ఆప‌రేష‌న్ బ్లాక్ థండర్ ను ప్రారంభించారు. అయితే ఉగ్ర‌వాదులు ఎందరు ఉన్నారో అంతుబ‌ట్ట‌డం లేదు. ఆ సమ‌యంలో ఐపీఎస్ అధికారి అయిన దోవ‌ల్... రిక్షా కార్మికుని వేషంల లోప‌లికి వెళ్లి ఉగ్ర‌వాదుల‌కు న‌చ్చ జెప్పి భద్ర‌తాద‌ళాల‌కు లొంగి పోయేలా చేశారు. దీంతో ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా ఆప‌రేష‌న్ విజ‌య‌వంతంగా  ముగిసింది. ఉత్త‌రాఖండ్ కు చెందిన అజిత్ దోవ‌ల్... కేర‌ళతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఆయ‌న కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. మౌనంగా త‌న ప‌నిని  తాను చేసుకొని వెళ్లే దోవ‌ల్... వ్యూహాల్లోల దిట్ట‌.

విమాన హైజాకింగ్ య‌త్నాలు భ‌గ్నం చేసిన దోవ‌ల్

1971-1999 మ‌ధ్య భార‌త్ లో జ‌రిగిన 15 విమాన హైజాకింగ్ య‌త్నాల‌ను ఆయ‌న ఆధ్వర్యంలోని భ‌ద్ర‌తా ద‌ళాలు అడ్డుకొని కుట్ర‌దారుల య‌త్నాల‌ను  భ‌గ్నం చేశాయి. గ‌తం నుంచే పాకిస్థాన్ ను ఏకాకి ని చేసేందుకు దోవ‌ల్ చేయ‌ని ప్ర‌య‌త్నమంటూ లేదు. దోవ‌ల్ ఆవ‌లిస్తే పేగులు లెక్క పెడతాడంటూ పాకిస్థాన్ ఛానెళ్లు క‌థ‌నాలు ప్ర‌సారం కూడా చేశాయి. అజిత్ దోవ‌ల్ బ్యాక్ గ్రౌండ్ చూస్తే శ‌తృదేశాల‌కు వెన్నులో వ‌ణుకు పుట్ట‌డం స‌హ‌జ‌మే అనిపిస్తుంది. పాకిస్థానీ ముస్లిం పౌరుడిగా ఆయ‌న పాక్ లో ఏడు సంవ‌త్స‌రాలు గ‌డిపారు. పాకిస్థాన్ లో ఉగ్ర‌వాదుల‌కు, ప్ర‌భుత్వానికి, సైన్యానికి మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని అతి సమీపం నుంచి చూశారు.

సర్జిక‌ల్ స్ట్రైక్స్ లో దోవ‌ల్ కీల‌క పాత్ర

అంత‌ర్జాతీయంగా పాక్ ను ఏకాకి చేసేందుకు అన్ని య‌త్నాలు  చేశారు దోవ‌ల్. గ‌తంలో పాక్ లోని భార‌త దౌత్య కార్యాల‌యంలో సిబ్బందిగా ఏడు సంవ‌త్స‌రాలు బాధ్య‌తలు నిర్వ‌హించారు. ప‌ఠాన్ కోట్ పై పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు దాడులు చేస్తున్న సమ‌యంలో వారిని ఏరివేసే ప్ర‌య‌త్నంలో భ‌ద్ర‌తాద‌ళాల‌ను స‌మ‌న్వ‌య‌ప‌రిచారు. తాజాగా యూరీ ఉగ్ర‌దాడి ఘ‌ట‌న అనంత‌రం పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ లోని ఉగ్ర‌వాద శిబిరాల‌పై భార‌త దళాల మెరుపుదాడుల‌కు వ్యూహం ప‌న్నిన వారిలో ఆయ‌న కూడా ఒక‌రు. తాజాగా ఉరీ ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో  ప్ర‌తికారం దాడి త‌ప్ప‌ద‌ని హెచ్చరిస్తూ వ‌స్తున్న భార‌త్ ఆర్మీ... పాకిస్థాన్ కు గ‌ట్టి దెబ్బనే రుచి చూపించింది.

స‌ర్జిక‌ల్ స్ట్రైక్ తో 38 మంది పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదుల‌ను హ‌తం చేశారు. అంతేకాదు... భార‌త్ జోలికి వ‌స్తే ఎంత‌టి వారినైనా ఉపేక్షించేదిలేద‌ని ప‌రోక్ష హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేసిన‌ట్ట‌య్యింది పాకిస్థాన్.  ఈ దెబ్బతో పాక్ వెన్నులో వ‌ణుకు పుట్టింద‌నే చెప్పొచ్చు. మొద‌టి నుంచి వ్యూహాలు ర‌చించ‌డంలో దిట్ట‌గా ఉన్న దోవ‌ల్ తాజాగా సర్జిక‌ల్ స్ట్రైక్ లోనూ కీల‌క పాత్ర పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: