పోలవరం అంతా బాగానే ఉంది కొన్నాళ్ళలో ముగుస్తుంది అనుకున్న టైం లో ఒరిస్సా అడ్డం పడ్డం చాలా ఇబ్బందికర విషయం. ఒరిస్సా నుంచి ఎప్పటి నుంచో పోలవరానికి అడ్డాలు వస్తున్నా కూడా ఒక్కొక్కసారి అడ్డంకులు తొలగిపోవడం తేలిక అవుతోంది. ప్రస్తుతం ఓడిసా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ని నిలిపేయాలి అంటూ సుప్రీం లో పిటీషన్ వేసింది , దీనికి రెస్పాండ్ అయిన సుప్రీం ధర్మాసనం నాలుగు వారాలలో ఆంధ్రా , తెలంగాణా తో పాటు చత్తీస్ ఘడ్ కూడా కౌంటర్ దాఖలు చెయ్యాలి అని అన్ని ప్రభుత్వాలకీ నోటీసులు పంపించింది. పోలవరం ప్రాజెక్ట్ మీద కేవలం ఒరిస్సా నే కాకుండా మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ నుంచి కూడా అభ్యంతరాలు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ దెబ్బకి ఒరిస్సాలో బోలెడు గ్రామాలు ముంపుకి గురి అయ్యి జాడ కూడా లేకుండా పోతాయి అనేది వారి వాదన.

అందుకే చాలా సంవత్సరాల నుంచీ ఒరిస్సా ప్రభుత్వం అభ్యంతరాలు తెలుపుతూనే ఉంది. ఇంతకాలం పోలవరం ప్రాజెక్టు రాజకీయ గొడవల్లో పడి కడతారా లేదా అన్నట్టుగా సాగడం తో లైట్ తీసుకున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ నెమ్మది నెమ్మదిగా జోరు అందుకుంది. కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ ఇవ్వడం తో చంద్రబాబు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ప్రాజెక్టు పనులు చురుకుగా సాగుతుండటం, మార్చి 2018 నాటికల్లా ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేయాలనుకొంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి కొన్ని రోజుల క్రితమే ఒక సమగ్ర నివేదిక పంపడంతో ఓడిశా ప్రభుత్వం అప్రమత్తం అయినట్లుంది. ఇదొక్కటే కాక ఒరిస్సా ప్రభుత్వం విశాకపట్నం రైల్వే జోన్ కి కూడా మొదటి నుంచీ అడ్డంగా ఉంటోంది.

ఒరిస్సా గోల భరించలేక ఇప్పటికే వైజాగ్ లో అనుకుంటున్న రైల్వే జోన్ విజయవాడ కి తరలించే ఆలోచన చేస్తున్నారు ప్రభుత్వం వారు కానీ ప్రతిపక్షాలు వ్యతిరేకించే ఛాన్స్ ఉండడం తో ఆ వైపుగా అడుగులు పడలేదు. విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయకపోతే, పోలవరం ప్రాజెక్టుకి ఓడిశా ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయకూడదని రాజీ కుదిరినట్లుగా కూడా ఆ మద్య మీడియాలో వార్తలు వచ్చాయి. సో ఆ తరవాత రైల్వే జొన్ గురించి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సైలెంట్ అయిపోవడం అదే టైం లో అనుకోకుండా పోలవరం ప్రాజెక్ట్ ఊపు అందుకోవడం చూసి రాజీ వార్తలు నిజమే అని అనుకున్నారు అందరూ. కానీ మొన్నటికి మొన్న వైజాగ్ లో మాట్లాడిన చంద్రబాబు రైల్వే జోన్ తీసుకుని రావడం ఖాయం అంటూ చెప్పుకొచ్చారు.

దాన్ని వైజాగ్ వారి హక్కుగా ఆయన కీర్తించడం తో రాజీ లాంటివి ఏమీ జరగలేదు అని లెక్కలు వేస్తున్నారు మేధావులు. రైల్వే జోన్ వదులుకోవడం ఏపీ కి ఏమాత్రము  ఇష్టం లేదు అని, వారు ఆ ఛాన్స్ కూడా తీసుకోరు అని తెలిసిన తరవాత మళ్ళీ ఇప్పుడు పోలవరం కి వ్యతిరేకంగా మారిపోయారు ఒరిస్సా వారు. రైల్వే జోన్ తో ముడిపెట్టిన వ్యవహారం లో పోలవరమా - రైల్వే జోనా రెండిట్లో ఏదో ఒకదానికి అడ్డం పడాలి అనేది ఒరిస్సా ప్లాన్ గా కనిపిస్తోంది. కానీ విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు కోసం కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి చేసి రైల్వే మంత్రి సురేష్ ప్రభు చేత వీలైనంత త్వరగా నిర్దిష్టమైన ప్రకటన చేయించవలసిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ అయింది కాబట్టి దాన్ని ఎలాగైనా పూర్తి చేసి తీరతారు ..


మరింత సమాచారం తెలుసుకోండి: