సర్జికల్‌ దాడుల నేపథ్యంలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) మరోసారి రెచ్చిపోయి వ్యాఖ్యాలు చేసింది.  పాకిస్థాన్ నటీనటులు భారత్‌లో అడుగుపెడితే దాడులు తప్పవని మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరిక చేసింది. పాకిస్తాన్‌ నటులకు, వారితో పనిచేయిస్తున్న వారికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతామని ఎంఎన్‌ఎస్‌ కీలక నేత అమేరు ఖోపర్‌ అన్నారు. పాక్‌ నటులు వీసాలు, వర్క్‌ పర్మిట్లు తీసుకొని వచ్చారన్న సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యలపై ఖోప్కర్‌ మండిపడ్డారు.
Image result for pakistan actor in india
పాకిస్తాన్‌తో చేతులు కలిపి పనిచేసే సమయం కాదిది. టూరిస్ట్ వీసాపై వారు భార‌త్‌కు వ‌స్తున్నార‌ని అన్నారు. ఇది చట్టవ్యతిరేకమే అని ఆయన సల్మాన్‌కు స‌మాధాన‌మిచ్చారు. ఈ అంశాన్ని తాము స‌ర్కారు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.  బాలీవుడ్‌లో పనిచేస్తున్న ఆ దేశ నటులకు ప్రముఖ డైరెక్టర్‌ శ్యామ్‌ బెనగల్‌, నటులు సల్మాన్‌ ఖాన్‌ సహా సినీ పరిశ్రమలోని పలువురు మద్దతుగా నిలిచారు.
Image result for pakistan actor in india mns fire
పాక్‌ నటుల తప్పేమీ లేదని, వీళ్ల విషయంలో పాక్‌ ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపూలేదని అన్నారు.  ప్ర‌స్తుతం మాత్రం పాకిస్థానీ నటులు కనిపిస్తే దాడులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.నిజానికి భారతీయులకు పాకిస్తానీయుల పట్లగానీ, పాకిస్తానీయులకు భారతీయులపట్ల గానీ ఎలాంటి విద్వేషాలు లేవని బెనగల్‌ అన్నారు.

Image result for maharashtra navnirman sena


మరింత సమాచారం తెలుసుకోండి: