ప్రపంచం మొత్తం ఎక్కువ శాతం అభిమానించే క్రీడ ఏది అంటే వెంటనె తడుముకోకుండా చెబుతారు క్రికెట్ అని. చిన్నా పెద్దా అనే తేడలు లేకుండా క్రికెట్ అంటే పిచ్చి అభిమానం పెంచుకున్నారు.  ప్రపంచంలో మారుమూల గ్రామాల్లో సైతం క్రికెట్ ఆడుతున్నారంటే అర్ధం చేసుకోవచ్చు..క్రికెట్ అంటే జనాలకు ఎంత అభిమానం.  భారతదేశం మొట్టమొదటి సారిగా 1921లో తొలి క్రికెట్ మ్యాచ్ ఆడింది. కాని అధికారికంగా మొదటి టెస్ట్ మ్యాచ్ 1932, జూన్ 25న ఇంగ్లాండుతో లార్డ్స్ లో ఆడి టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆరవ దేశంగా స్థానం సంపాదించినది.

1700లో బ్రిటీష్ వారు క్రికెట్ ఆటను భారత్ కు తీసుకొనివచ్చారు. 1721లో మొదటి క్రికెట్ మ్యాచ్‌ను ఇక్కడ నిర్వహించారు.1848లో ముంబాయిలో పార్సీ కమ్యూనిటీ ఓరియెంటల్ క్లబ్‌ను స్థాపించారు. అదే భారతీయులు స్థాపించిన తొలి క్రికెట్ క్లబ్. 1877లో యూరోపియన్లు పార్సీలకు క్రికెట్ మ్యాచ్ ఆడటానికి పిల్చినారు.

1912 నాటికి పార్సీలు, హిందువులు, ముస్లిములు మరియు యూరోపియన్లు ప్రతి ఏడాది క్రికెట్ ఆడేవారు.1900లలో కొందరు భారతీయులు ఇంగ్లీష్ క్రికెట్ టీంలో ఆడటానికి ఇంగ్లాండు వెళ్ళినారు. వారిలో ముఖ్యులు రంజిత్ సింహ్ జీ మరియు దులీప్ సింహ్ జీ.  ఆనాటి క్రికెట్ టీమ్ అపురూప చిత్రం మీ కోసం..


మరింత సమాచారం తెలుసుకోండి: