"ఎన్ కౌంటర్" ఇది తెలుగు రాష్ట్రాలోనే కాదు, భారత దేశంలో వినబడుతున్న ఓ ఆసాంఘిక చర్య. అటు మావోయిస్టులే కావొచ్చు, పోలీసు బలగాలే కావచ్చు, ప్రజాస్వామ్య దేశంలో ఇది సమర్దించే పద్దతి మాత్రం కాదు. అయితే ఇక్కడ ఏ ప్రాంతంలోనైనా మావోయిస్టులు, పోలీసుల మధ్య ఏదైనా ఎదురు కాల్పులు జరిగితే ప్రతిసారి ప్రస్తావనకు వచ్చేది మాత్రం "బూటకపు ఎన్ కౌంటర్". ఇది పోలీసు వైపు నుంచి వచ్చే ఏకపక్ష కాల్పులుగా చెప్పొచ్చు.