సభ్య సమాజం ఆధునిక పోకడలు తొక్కే కొద్దీ మనుషుల ప్రవర్తన వింత పోకడలు తొక్కుతోంది. సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి సాయపడవోయ్ అన్న సామెతను మరిచిన నేటి కొత్త తరం సమాజం సాటి మనుషులకు సాయం చేయాలనే ఆలోచనే రావట్లేదు. మనిషికి మనిషే సహాయం. అలాంటిది చిన్న చిన్న సహాయాలు చేయడానికి కూడా నేటి ఆధునాతన సమాజంలోని మనుషులు ఆగ్రహానికి లోనవుతూ వస్తున్నారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ సంఘటన. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఓ ఉన్మాది కలకలం రేపాడు.