రంజాన్ మాసంలో ప్రత్యేకమైన వంటకం హాలీంకు ఈసారి శ్రావణమాసం దెబ్బపడింది. దేవ విదేశాలలో పేరుగాంచిన హలీం హైదరాబాద్ ప్రత్యేకత, ఎంతో రుచికరమైన హలీంను రంజాన్ మాసంలో రోజంతా ఉపవాసం ఉండే ప్రజలు కోసం తయారు చేస్తారు. అయితే హైదరాబాద్ హలీంను ముస్లీం ప్రజలకంటే కూడా హిందువులే ఎక్కవగా సేవిస్తారన్నది సత్యం. అలాంటి హలీం అమ్మకాలకు ఈసారి శ్రావణమాసం దెబ్బకొట్టింది.  హిందువులు నెలరోజుల పాటు పాటించే శ్రావణమాసోం మాంసాహారాన్ని తీసుకోరు. దీంతో హలీం అమ్మకం ఈసారి గణనీయంగా పడిపోయింది. పాతనగరంలోని మదీన, చార్మినార్, ఇతర ప్రాంతాలతోపాటు మాసబ్ ట్యంక్, మెహిదీపట్నంలో ఉన్న పేరుగాంచిన హోటళ్లలో కూడా హలీం అమ్మకాలు పడిపోయాయి. చివరికి హలీంకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చి విదేశాలకు కూడా రంజాన్ మాసంలో ఎగుమతి చేస్తున్న పిస్తాహౌజ్ హలీం అమ్మకం కూడా తగ్గిపోయింది.  హలీం అనే మాటకు వస్తే సికిందరాబాద్ వాసుల కంటే హైదరాబాద్ ప్రజలు ఎక్కవగా సేవిస్తారు. ఈ సంప్రదాయ వంటకాన్ని హిందువులు పీట్లుగా లేదా ఇంటి నుంచి టిఫిన్ బాక్సులతో తీసుకెళ్లి ఇంట్లో ప్రతి ఒక్కరు తింటారు. అసలు రంజాన్మాసం ఎప్పుడు మొదలౌతుందా అని హలీం కోసం ఎదురుచూసే వాళ్లు కూడా లేకపోలేదు. ఇంట్లో పెద్దలు, పిల్లలు అందరు కలిసి తింటారు. ఇష్టం లేని వాళ్ళు లేదా, ఆనారోగ్యంతో బాధపడుతున్నవారు సైతం ఒక స్పూన్ హలీం తిని హైదరాబాద్ సాంప్రదాయాన్ని పాటిస్తారు.  అంతగా నగర ప్రజల ఆహర అలవాట్లలో భాగాంగా ఇమిడిపోయిన హలీంకు ఈసారి శ్రావణమాసం దెబ్బపడడంతో ఇటు తినేవాళ్లు, అటు అమ్మే వాళ్లకు కూడా అయ్యో ఈసారి తినలేకపోతున్నామన్నామని ఒక రకమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాలలో సంవత్సరం పొడువున హలీం అమ్ముతుంటారు. కానీ రంజాన్ మాసంలో తయారు చేసేంత రుచికరంగా దొరకడం కష్టమే!   

మరింత సమాచారం తెలుసుకోండి: