కేంద్రప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచించటం అంటే సంక్షేమరాజ్యం నుంచి సంక్షోభ రాజ్యంగా మార్చటానికి మరో అడుగు ముందుకు వేసినట్లేనని అనిపిస్తుంది. ఆహార భద్రత చట్టంలో నగదు బదిలీ అనేది ఒక అంశంగా పొందుపర్చారు. అసలు నగదు బదిలీ దానికి, ఏ వస్తువు లేదా ఆహార ధాన్యానికి బదులుగా నగదు ఇస్తారో ఇంకా ప్రభుత్వం తన ఆలోచనను బయటపెట్టలేదు. అయితే దేశంలోనే మొట్టమొదటిసారిగా నగదు బదిలీ పథకాన్ని గురించి లేవనెత్తింది. ఆలోచించపంజేసింది. ఒకప్పటి మన కింగ్ మేకర్ చంద్రబాబు నాయుడే గత ఎన్నకల్లొ నగదు బదిలీ పథకాన్ని ఎన్నికల ప్రచారస్త్రంగా ఉపయోగించుకుని అధికారంలోకి వస్తామని హామీనిచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు, ప్రజలు మాత్రం ఆయన మాటలను నమ్మలేదు. కానీ ఆపార్టీ అభ్యర్థుల, నాయకులు మాత్రం ఎన్నికల ఖర్చు కోసం నిధులను బ్యాంకుల ద్వారా తీసుకోవటానికి నగదు బదిలీ పథకాన్ని ఉపయోగించుకున్నది. వాస్తవం, ఇక కేంద్రం ఆహార భద్రత చట్టంలో నగదు బదిలీ పథకం అంశాన్ని పొందుపర్చడం వెనుక అందర్యమేమిటో పూర్తిగా కాకపోయిన కొంతవరకు అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు అందేజేస్తున్న కిరోసిన్ కు బదులుగా నగదులను అందజేయాలని ఇప్పటికే ఆలోచిస్తుంది. మరి అన్ని వస్తువలకు బదులుగా నగదును అందజేస్తే ఎలా ఉంటుంది. అలా చేస్తే సామాన్యులకు ఇంతవరకు కల్పిస్తున్న సామాజిక భద్రత పథకాలన్నింటిని రద్దు చేసి వాటికి బదులుగా నగదును అందజేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు కనిపిస్తుంది. అలా జరిగితే మొత్తం ప్రజాపంపిణీ వ్యవస్థను దాంట్లో భాగమైన రేషన్ షాపులను రద్దుచేసి పౌరులు ఇక తమకు కావాల్సిన వస్తువులన్ని మార్కెట్ లో బహిరంగ ధరకు కొనుక్కొవాలని వస్తుంది. ప్రభుత్వం ఆలోచన కూడా ఇలాగైతేనే మంచిదనిపిస్తుంది. ఇప్పటికే గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ మోజులో పడి అనని ప్రైవేట్ పరం చేయడం వల్ల సగటు జీవికి కావాల్సిన కూడు, గుడ్డ, నీడతో పాటు విద్య, వైద్యం, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు అధికశాతం ప్రజలకు దక్కకుండా పోతున్నాయి. మంచినీళ్లను కూడా కొనుక్కొని తాగవలసి వస్తున్న ఈ రోజుల్లొ ప్రస్తుత పరిస్థితుల్లో నగదు బదిలీ పథకం వంటి ఆలోచనలతో ముందుకు వెళ్తున్న ప్రభుత్వాలు ఆనుసరిస్తున్న విధానాల ప్రభావంతో వారి రానున్న కాలంల సగటు జీవి జీవన స్థతి ఎలామారుతుంది. సంక్షేమరాజ్యం సంక్షోభరాజ్యంగా మారితే ఎలా ఉంటుంది. ఊహకందని అనుమానాలుగానే మిగిలిపోగలవు.

మరింత సమాచారం తెలుసుకోండి: