రోడ్డు ప్రమాదాలను నివారించడం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని సంబంధిత అధికారులు అనే పనిగా చెబుతున్నప్పటికిని జరిగే ప్రమాదాలు జరిగిపోతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక రోడ్డుపై రోడ్డు ప్రమాదాలు జరుగడం పలువురు చనిపోవడం జరుగుతుంది. ప్రమాదాల నివారణ కోసం జరిపే రోడ్డు భధ్రత వారోత్సవాలు ఉత్తుత్తి వారోత్సవాలుగానే మిగిలిపోతున్నాయి. ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన చర్యల మాట పక్కన బెడితే ప్రమాదాలకు కారకులెవరు అనే విషయాల్లోకి వెళ్తే రవాణశాఖ అధికారుల తప్పిదాలే ఎక్కువగా కన్పిస్తుంటాయి. డ్రైవర్ వాహనాన్ని నడిపే సందర్భంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలి. ముఖ్యంగా మనస్సు ప్రశాంతంగా ఉండాలి. వాహనం నడిపే సందర్భంలో డ్రైవర్ కు శరీరంలో ఉన్నటువంటి అవయవాలు అకస్మాత్తుగా పనిచేయక పోతే కొంత ఇబ్బందిగా ఉంటుంది. లేదా గుండెకు సంబందించిన నొప్పులు, మెదడుకు సంబంధిచిన వ్యాధులు వస్తే కొన్ని సమస్యలు ఏర్పడుతాయి. అయిన డ్రైవర్లకు సంభంధిత సంస్థల్లో ప్రతి ఆరునెలలకు ఒక సారి వైద్య పరీక్షలు నిర్యహిస్తే ఇటువంటి సమస్యలను అరికట్టేందుకు వీలుంటుంది. కాగా ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటేనే కొన్ని సార్లు చిన్నచిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. కాగా కొంత మంది డ్రైవర్లు ఏమాత్రం జాగ్రత్తలు పాటించకుండా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. సిగ్నల్స్ తెలియవు, ఎక్కడ ఎంత వేగం ఉండాలో తెలియదు, ఇటువంటి పరిస్థితిలో చాలా మంది డ్రైవర్లు ఉండగా మరికొంత మంది మద్యం త్రాగి వాహనాలు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. అసలే అంతంత మాత్రం డ్రైవింగ్ పైగా మద్యం త్రాగి వాహనాలు నడుపడం వంటి పరిస్థితిలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారుల చేతివాటం వల్ల డ్రైవింగ్ నిబంధనలు తెలియనివారు, వాహనాలు నడుపరానివారు డ్రైవింగ్ లైసెన్స్ లు పొందుతున్నారు. ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్ల రాజ్యం ఉండడంతో వారు అధికారులతో మాట్లాడి అనర్హులకు లైసెన్స్ లు ఇప్పిస్తున్నారు. దీంతో ఇలాంటి వారు లైసెన్స్ లు తీసుకొని భవిష్యత్తులో ప్రమాదాలకు కారణమవుతున్నారు. లైసెన్స్ ఇచ్చే సందర్భంలో అన్ని కోణాల్లో టెస్టులు నిర్వహించి లైసెన్స్ లు జారీ చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అదే విధంగా మద్యం త్రాగి వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరిస్తే ప్రమాదాలు అరికట్టవచ్చుననే అబిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా డ్రైవర్లు ఎక్కువ శ్రమకు లోను కాకుండా అదనపు డ్యూటీలు రాకుండా చూస్తే బాగుంటుందని సీనియర్ డ్రైవర్లు అంటున్నారు. ప్రభుత్వం ప్రమాదాలను అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటే ముందుముందు ప్రమాదాలు తక్కువగా జరిగే అవకాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: