ప్రతిఏటా రాష్ట్రంలోని ఏజెన్సీ అతిసారం బారినపడి పిట్టల్లా రాలిపోతున్నారు గిరిజనులు. అయినా గుణపాఠం కలుగలేదు. దీంతో మళ్లీ ఈవ్యాది ప్రబలి అడవిబిడ్డలు అనంతలోకాలకు పయనమవుతున్నారు. గతం: 1998వ సంవత్సరం రాష్ట్రంలోని ఏజన్సీలో అతిసారం పంజావిసిరింది. ఒక ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీలోనే 1500 మంది మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగువేలకు పైగా మరణించారని ప్రభుత్వమే ఒప్పుకుంది. పరస్థితిని పరిశీలించేందుకు ఏకంగా యూపిఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ ఉట్నూర్ ఏజెన్సీలోని నార్నూర్ కు వచ్చారు.గిరిజనులను ఓదార్చారు ఎందుకంటే ఆఒక్క ఈగ్రామంలోనే 150 మంది అతిసారంతో చనిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏజెన్సీలో అతిసారవ్యాది ప్రతి వర్షాకాలం ప్రబలుతూనే ఉంది, వైద్యం అందక అసువులు బాస్తూనే ఉన్నారు. వర్తమానం: వర్షాలు మొదలయ్యాయి, ఏజెన్సీలో అతిసారవ్యాధి మళ్లీ సోకింది. వరంగల్ జిల్లాలో ఈవ్యాది సోకి ముగ్గురు గిరిజనులు మరణించిన మరుసటి రోజే ఆదిలాబాద్ జిల్లాలోని కోటపల్లి మండలం కోదాడలో నలుగురు మరణించారు. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో అతిసార ప్రబలినప్పటికి మరణాల సంఖ్య దృవీకరించలేదు. వైద్యబృందాల జాడలు ఇప్పటికి ఏజెన్సీ ప్రాంతాల్లో కనిపించడం లేదు. వైద్య ఆరోగ్యశాఖ పనితీరు: వ్యాది ప్రబలి చనిపోయారని మీడియాలో వార్తలు చూసి హుటాహుటిన అక్కడికి వెల్లడం, వైద్యశిబిరాలు నిర్వహించడం. అతిసారా అదుపులోకి వచ్చిందని చెప్పి చేతులు దులుపుకోవడం వారి సాధారణ పనిగా మారిపోయింది. కాని వ్యాది రాకుండా ముందు జాగ్రత్త చర్యలు ఇప్పటి వరకు తీసుకున్న పాపాన పోలేదు. చివరకు వ్యాది సోకిన వెంటనే ప్రాణాలు పోకుండా కాపాడేందుకు అవసరమైన ప్రాథమిక చికిత్సకు సంబందించిన మందులను, ఆరోగ్యకార్యకర్తలను వారికి అందుబాటులో ఉంచడం లేదు.ఓఆర్ఎస్ పాకెట్లు, పారాసిటమాల్,ఆంటీబయాటిక్ మాత్రలు వంటి సాధారణ మందులు అందుబాటులో ఉంచినా కూడా ఈమరణాలను ఆపవచ్చు.అది కూడా చేయకుండా గిరిజనుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రభుత్వ నిర్వాకం: వ్యాదులు ప్రబలిన ప్రాంతాలలో ప్రజాప్రతినిధులు పర్యటించడం,అక్కడి వైద్యశిబిరాల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బందిని గదమాయించడం వంటివి రొటీన్ గా చేస్తున్నారు. పరిస్థితి మరీ విషమించితే మొదట జిల్లామంత్రి,మరీ చేయిదాటితే ఆరోగ్యమంత్రి పర్యటన, పరామర్శ ఒకరిద్దరు అధికారులను బాద్యులను చేస్తూ చర్యలు తీసుకోవడం తప్ప ముందస్తు చర్యలు తీసుకున్న, తీసుకుంటున్న ధాఖలాలు లేవు. 

మరింత సమాచారం తెలుసుకోండి: