మంచికళాశాలలో ఇంజనీరింగ్ విధ్యను అభ్యసించాలనుకునే విధ్యార్థులకు ఫీజులు భారం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 133 కళాశాలల యాజమాన్యం ఫీజులను పేంచేందుకు వీలుకల్పించాలని ప్రభుత్వానికి పెట్టుకున్న ఆర్జీలకు మోక్షం కలిగినట్లు స్పష్టమవుతుంది. ఇందులో భాగంగాను 133 కళాశాలల యాజమాన్యం ఫీజులు పెంచుకునేందుకు సూచనప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తుంది. ఈ కళాశాలలు యాజమాన్యకోటా ఫీజులను పెంచుకునేవిధంగా వీలుకల్పించగా మిగతా కళాశాలలకు కన్వీనర్ కోటా సీటును 35వేల వరకు పెంచుకునే విధంగా అవకాశం కల్పించనున్నారు. దీంతో ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్న విద్యార్థులకు ఆర్థికంగా భారం పడనుంది. మంచి కళాశాలలో యాజమాన్య కోటా ద్వారా చదువు మద్యతరగతి విద్యార్థులకు అందకుండా పోతుంది. ఆకళాశాలల్లో చదువు”కొన” లేని పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: