కడుపులో పుట్టినందుకు తన తలకొరివి పెడుతాడని ఆకాంక్షించిన తల్లిదండ్రులకు గర్భశోఖం మిగిలింది. తమ అమ్మనాన్నలు వస్తారని ఎదురు చూస్తున్న చిన్నారుల ఆశలు అడి ఆశలయ్యాయి. ఆకస్మాత్తుగా సంభవించిన మంటలను చూసి రక్షించండి అంటూ వారి చేసిన ఆత్మరక్షణ కేకలు వినేవారు లేకుండా పోయారు. బోగీలో ఉన్నటువంటి వారు అందరు ఎలా తప్పించుకోవాలనే ఆలోచనలో ఎవరికివారుగా ప్రయత్నాలు చేసి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి విషాధకరమైన సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. అయిన రైలు ప్రమాదాలపై యంత్రాంగం ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తుందో అనేది అందరి ముందున్న ప్రశ్న.. తమిళనాడు రైల్వే ఎక్స్ ప్రెస్ మరో రెండుగంటల్లో గమ్య చేరుకోనున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు అనేర రైలు ప్రమాదాలు జరిగాయి. పట్టాలు తప్పడం, రైల్వే క్రాసింగ్ లవద్ద, వలిగొండవంటి సంఘటనలు జరుగడంతో ఇప్పటి వరకు అనేక మంది చనిపోయారు. అప్పుడప్పుడు రైళ్లలో దుండగులు పెట్టిన బాంబులు పేలి ప్రయాణికులు చనిపోయారు. కాగా నెల్లూరులో జరిగిన తమిళనాడు ఎక్స్ ప్రెస్ ఘటనలో 47మంది చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈసంఘటన ఎలా జరిగిందనే విషయంలో ప్రత్యేక్ష సాక్షుల కథనాలను బట్టి అనుమానాలకు తావిస్తుంది. మంటలు లేచే ముందు శభ్దం వచ్చినట్లుగా కొంత మంది చెబుతుండగా కిరోసిన్ డబ్బా ఖాళీగా పడి ఉందని మరికొంత మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే షాక్ సర్క్య్ట్ వల్లనే ప్రమాదం జరిగిందని అధికారులు అంచనాకు వచ్చారు. ఇదంతా ఇలా ఉండగా ప్రమాదాలు జరుగడాని కారణాలు ఏంటి అనే విషయాలపై సర్వత్రా విమర్శలున్నాయి. సిబ్బంది తగినంతగా లేకపోవడం, ఉన్నటువంటి సిబ్బంది వరుసగా డ్యూటి చేస్తూ అలసిపోవడం, రైళ్ల మేంటేనెన్స్ సరిగా లేక పోవడం, కొత్త రైళ్లను ప్రవేశ పెట్టక పోవడంతో పాటు ప్రయాణికుల భధ్రత కోసం కోట్లాది రూసాయలు బడ్జెట్ కెటాయిస్తున్నప్పటికి ఎందుకు ఇలా జరుగుతుందనే విషయంలో అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. కాగా సోమవారం నాడు తెల్లవారుజామున జరిగిన తమిళనాడు రైల్వే ఎక్స్ ప్రెస్ లో మంటలు లేచిన సందర్భంగా ప్రయాణికులు మంటల నుండి తప్పించుకునేందుకు బయటకు వెళ్దామంటే ఎమర్జెన్సీ కిటికీలు పనిచేయలేని పరిస్తితి ఉందని ప్రమాదం నుండి బయట పడిన ప్రయాణికులు చెబుతుంటే ఇంతకన్నా చెప్పేది ఏముంది. ఇటువంటి ప్రమాదం జరిగినప్పుడు ఎమర్జెన్సీ కిటకీలు, డోర్లు పనిచేయక పోతే మరెప్పుడు పనిచేస్తాయో సంబంధిత అధికారులకే తెలియాలి....

మరింత సమాచారం తెలుసుకోండి: