ఢిల్లీ అత్యాచారం ఘటనలో మరణించిన యువతి పేరిట రూపొందిన 'నిర్భయ' చట్టం మన రాష్ట్రంలో తొలిసారిగా అమల్లోకి రానుంది. కొద్దిరోజుల క్రితం గుంటూరు జిల్లా తెనాలి గాంధీ చౌక్‌లో కొంతమంది మందుబాబులు మద్యం మత్తులో దారిన వెళుతున్న తల్లి కూతుళ్ళ పట్ల పైశాచికంగా వ్యవహరించిన సంఘటనలో తల్లి సునీల మృత్యువాత పడిన సంగతి విధితమే.  మహిళ సంఘాలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు, ధర్నాలు నిర్వించి మృతురాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం అదుకోవాలని డిమాండ్ కూడా చేశారు. కాగా ఈ హత్య కేసులో నిందితులపై పోలీసులు 'నిర్భయ' చట్టాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. ఇంతకుముందు వీరిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. 'నిర్భయ' చట్టంలోని సెక్షన్ 354 (ఏ) క్లాజ్ 5 కింద వీరికి పదేళ్ళ జైలుశిక్ష పడే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: