ప్రతి సంవత్సరం లక్షల మొక్కలు నాటుతున్నారు, మరిచిపోతున్నారు. ప్రతి సంవత్సరం వర్షాలు కురియగానే వివిధ రకాల మెక్కలు అటవిశాఖ, ఉపాధి పథకం, ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో లక్షలాది మొక్కలు నాటడం జరుగుతుంది. కాగా నాటడం రోజునే ఉత్సాహంగా ఉంటుంది. తర్వాత వాటి నిర్వాహన లేక పోవడంతో నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. ప్రతిసంవత్సరం వివిధ శాఖల ఆధ్వర్యంలో అందజేసిన మొక్కలు అన్ని సంరక్షించబడితే మన రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడి వర్షాలు సమృద్దిగా కురిసేవి. అయితే ప్రతి సంవత్సరం రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటడం జరుగుతుంది. తర్వాత వేసవి కాలంలో నీళ్లులేని పరిస్థితిలో అవి ఎండిపోవడం జరుగుతుంది. నర్సరీలో మొక్కలు పెంచి వాటిని వివిధ ప్రాంతాల్లో నాటిపించినప్పటి శ్రద్ద వాటిని పెంచే సందర్భంలో లేకపోవడంతో నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. వీటన్నింటికి కారణం పర్యవేక్షణ లేకపోవడమేనని స్పష్టమవుతుంది. రోడ్ల ప్రక్కన, గ్రామపంచాయతీలు, మున్సిపాల్టీల్లో నాటిన మొక్కలు నిర్వాహన లేకపోవడంతో ఏనాడో నీళ్లు లేక ఎండిపోయాయి. త్రాగడానికి, ఇంటి ముందు మొక్కలకే నీళ్లు దొరుకని పరిస్థితిలో ఇతర ప్రాంతాల్లో నాటిన మెక్కలకు దేవుడే దిక్కుగా మారాడు. మొక్కలను నాటిపించే ముందు వాటిని పెంచే విధంగా ప్రణాళిక సిద్దం చేయాలి. అలా కాకుండా ముందు చూపులేకుండా మొక్కలు నాటితే ఫలితం లేకుండా పోతుంది. ఇప్పటికైనా నీటివసతి ప్రాంతాలను ఎంపిక చేయడంతో పాటు పెంచడం కోసం నీటి వసతి కల్పించి మొక్కలు నాటితే ఉపయోగకరంగా ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: