భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 65 సంవత్సరాలు అయినది. బ్రిటీష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించి మనల్ని దోచుకున్నది చాలా తక్కువ. 65 సంవత్సరాలలో మన పాలకులు, అధికార యంత్రాంగం దోచుకున్నది 100 రెట్లు ఎక్కువ. పరాయి దేశం వాళ్ళ కన్నా మనల్ని మనవాళ్లే ఎక్కువ రేట్లు దోచుకున్నారు అన్నది నగ్న సత్యం. ఈ దేశ సంపద అంతా 5 శాతం మంది చేతులలో ఉండిపోయింది. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా అయితే నేమీ వీళ్ళ కబంధహస్తలతోటే రాజ్యం వేలుచున్నారు. ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ వారు దాదాపు 50 సంవత్సరాలు పరిపాలించి అన్ని రంగాలను భ్రస్టు పట్టించారు. విద్య, న్యాయ, వైద్య, పర్యావరణ, సేవ రంగం, విద్యుత్ అన్ని రంగాలలో దోపిడిని పెంచి పోషించి దేశాన్ని సర్వ నాశనము పట్టించారు. భారత దేశము వ్యవసాయ దేశం. ఈ రంగాన్ని పూర్తిగా సర్వనాశనము చేశారు. ఏర్పాటువాదాన్ని, తీవ్రవాదానికి, మాఫియాను, కులతత్వాన్ని, మతతత్వాన్ని పెంచిపోషించారు. ప్రాంతీయ కుమ్ములాటలు, ప్రాంతీయ విభేదాల్ని సృష్టించి దోపిడి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాయి. దోపిడి డబ్బుతో ఒక ఎమ్మెల్యే గెలుపుకి దాదాపు పది కోట్ల ఖర్చు పెట్టి గెలిచి, రాజ్యాన్ని పరిపాలించే విధంగా తయారు చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీని ఈ దేశ పాలనకు అర్హలు కాదని, ఈ పార్టీ అవసరము లేదని దేశ ప్రజలు గ్రహించారు. ఇక పార్టీకి నూకలు చెల్లినట్లే.. భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఈ దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి సాధించలేకపోయినారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని అభివృద్ధి చేయలేకపోయారు. వీళ్ళ మీద ప్రజలకు నమ్మకం పోయింది. వీళ్లకు 300 సీట్ల ఇచ్చే పరిస్థతిలో భారత ప్రజలు లేరు. ఎదో ఒక 100 సీట్లతో సరిపెట్టుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ కూడా 100 సీట్లు రావు. కమ్యూనిస్టు పార్టీ అసలు రాజ్యాధికారానికి రాదు, రాబోదు అనేది భారత ప్రజలు ఎప్పుడో గ్రహించారు. ఇప్పుడున్న పార్టీలకు పూర్తిగా మేజార్టి ఇచ్చే పరిస్థితి కనుచూపు మేర లేదు. కాబట్టి అందుకే హాజారే బృందం లాంటి వాళ్ళు మిగతా అభ్యుధయ, నిజాయితీ పార్టీ వాళ్ళతో కలిసి పార్టీ స్థాపిస్తే జాతీయ స్థాయిలో 300 ఎంపి సీట్లు తెచ్చుకుని సుపరిపాలన ఇవ్వగలుగుతారని నమ్మేవాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. గత పార్టీలకు చరమగీతం పాడాలని 80 శాతం జనం ఎదురుచూస్తున్నారు. అందుకు ఏ మంచి పార్టీ వస్తదా అని వారు ఎదురు చూస్తున్నారు. ఇదే కొత్త పార్టీ రావడానికి సమయం ఆసన్నమైనది భావిస్తున్నారు. వస్తే తప్పక విజయవంతం అవుతుందని శ్రామిక వర్గం, సేవావర్గం, విద్యార్థులు, యువజనులు, మేధావి వర్గం, అసంఘిటిత కార్మికులు ఎదురుచూస్తున్నారు. కొత్త పార్టీ రావాలి, 300 ఎంపి సీట్లు గెలవాలి. మంచి పాలన, రామరాజ్యం, గ్రామ స్వరాజ్యం, ఆర్థిక అసమానతలు తొలగే రాజ్యం రావాలని ప్రజలు ఆశిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: