పవన్ కల్యాణ్... బహుశా తెలుగు రాష్ట్రాలో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ సినీ నటుడు మరొకరు  లేరంటే అతిశయోక్తి కాదు. అలాగే రాజకీయాల వైపు వచ్చిన హీరో కూడా చిరంజీవి తర్వాత ఈయనే. ఐతే.. రాజకీయాల్లో సక్సస్ కావడానికి అవసరమైన స్పష్టత మాత్రం పవన్ కల్యాణ్ లో కనిపిస్తుందా లేదా.. అన్నది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. 



ఒక రకంగా చూస్తే పవన్ కళ్యాణ్ తన దారి ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లుగా కనిపిస్తోంది. పేరుకే ఒక పార్టీ అంటూ జనసేన ఏర్పాటు చేసినా దాన్ని విస్తరించలేదు. పార్టీని క్రియాశీలం చేస్తానని, వచ్చే ఎన్నికలలో పోటీచేస్తానని ఆయన ఇప్పటికే ప్రకటించినా ఆ విషయంలో ముందుకు అడుగులు పడటం లేదు. అంతే కాదు ఇటీవల పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రకటనలు కూడా అంత క్లారిటీగా ఉండటం లేదు.  



నోట్ల రద్దు, ప్రత్యేక హోదా సాధన వంటి సమస్యలపై ఆయన స్పందిస్తుండటం మంచిదే అయినా.. దానికి కారణమైన రాజకీయ నాయకులను గట్టిగా విమర్శించలేకపోతున్నారు. నోట్ల రద్దు ప్రజలను తీవ్రంగా గాయపరిచిందని పవన్ అంటూనే.. అందుకు కారణమైన ప్రధానిని ఆయన ప్రశ్నించలేకపోతున్నారు. పవన్ కల్యాణ్ కు ఉన్న ఈ బలహీనతను టీడీపీ, బీజేపీ వాడుకుంటున్నట్టు కనిపిస్తోంది. 



ఒకవేళ పవన్ పుల్ టైమ్ రాజకీయ నాయకుడిగా మారాలనుకుంటే మాత్రం ఈ మొహమాటాలు, అస్పష్టత ఆయన్ను ఇబ్బంది పెట్టకతప్పవు. ముందుగా విషయాలపై స్పష్టత తెచ్చుకుని రాజకీయంగా ధైర్యంగా ముందుకు అడుగేస్తేనే పవన్ కల్యాణ్ కు భవిష్యత్ ఉంటుంది. లేకపోతే ఆయన కూడా తన అన్నమాదిరిగా అటు రాజకీయాల్లోనూ ఇటూ సినిమాల్లోనూ పూర్తిగా ఇమడలేక ఇబ్బందిపడే అవకాశాలున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: