తెలుగు రాష్ట్రాలో ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్ జగన్ నిన్న రాజధాని పర్యటన చేశారు.  ఈ సందర్భంగా మరోసారి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడానికే జగన్ పర్యటనకు సిద్ధమయ్యారంటూ వైసీపీ నేతలు ఆరోపణ చేశారు.  రాజధాని పర్యటించిన  జగన్ తనదైన స్టైల్లో రాజధానిలో అన్ని బోగస్ కార్యక్రమాలు జరుగుతున్నాయని అధికార ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.  ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ కి సవాల్ విసిరారు  తెనాలి తెలుగుదేశం ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్.  
Related image
రాజధానిలో అభివృద్ధి జరగలేదని చెప్పగలవా.. ఎప్పుడో ఒక సారి మేల్కొనే నువ్వు అభివృద్ధి గురించి ఏమి తెలుసునని మాట్లాడుతున్నావు.. అని జగనపై తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మందడంలో జరిగిన రైతుల ప్లాట్ల కేటాయింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ తాత్కాలిక సచివాలయం ఏడు నెలలో పూర్తి చేశామన్నారు.  
Related image
టీడీపీ ప్ర‌భుత్వం వల్ల అభివృద్ది జ‌రుగుతోంద‌ని ప్ర‌జ‌లే చెబుతున్నార‌ని అన్నారు. ప్లాట్ల‌లో రోడ్డు నిర్మాణం జ‌రుగుతోంద‌న్నారు. ఇవ‌న్నీ జ‌గ‌న్‌కు క‌నిపించ‌డం లేద‌న్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అనభ‌వమంత కూడా జ‌గ‌న్ వ‌య‌సు లేద‌ని, అసలు ఆయ‌న‌కు.. జ‌గ‌న్‌కు పొంత‌నేంట‌ని మండిపడ్డారు. జ‌గ‌న్ ఎక్క‌డికి ర‌మ్మంటే అక్క‌డికి వ‌చ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నాన‌ని, అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల గురించి చ‌ర్చిద్దామ‌ని స‌వాల్ విసిరారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: