కర్నాటక సీఎం సిద్దరామయ్యను కాకి గోల విడిచిపెట్టడం లేదు. రాష్ట్రకవి మంజీశ్వర్ గోవింద్ పాయ్ ను స్మరిస్తూ కేరళలోని మంజీశ్వరంలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేరళ సీఎం  పినరయి విజయన్, కర్నాటక సీఎం సిద్దరామయ్య, లోక్ సభ సభ్యుడు వీరప్పమొయిలీలలతో పాటూ పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. వక్తలు ప్రసంగిస్తుండగానే వేధిక పక్కనే ఉన్న ఓ చెట్టు పై నుంచి ఓ కాకి వచ్చి సిద్దరామయ్యపై  రెట్టవేసి తిరిగి చెట్టుపైకి వెళ్లిపోయింది.



 ఆయన దుస్తులపై రెట్ట పడింది. వెంటనే పక్కనే ఉన ఓ ఎమ్మెల్యే ఆ రెట్టను తుడిచివేశారు. అదే సమయంలో వేదికపై కాంగ్రెస్ ఎంపీ వీరప్ప మొయిలీ, మంత్రి రమానాథ రై కూడా ఉన్నారు. ఆ తర్వాత అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది కాకిని తరిమివేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఇది జరిగిన తర్వాత కాకి రెట్ట శుభ శకునమా? కాదా? అంటూ వేదికపై తన సహచరులతో సిద్ధరామయ్య చర్చించడం కనిపించింది.



కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కాకులు పగబట్టి ఉన్నాయి. నిన్నగాక మొన్న సిద్ధరామయ్య కారుపై కూర్చుని ఓ కాకి చాలా హడావుడి చేసింది. దీన్ని అపశకునంగా భావించిన ఆయన... ఏకంగా కారునే మార్చేశారు. అది అప్పుడు సిద్ధ రామయ్యకు తలనొప్పి తెచ్చిపెట్టింది. పాత కారుపై కాకి వాలడం వల్లే సిద్ధ రామయ్య కారు మార్చారంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ముఖ్యమంత్రికి జాతకాలపై నమ్మకమని... అందుకనే 35 లక్షలు ఖర్చు పెట్టి కొత్త కారు కొన్నారంటు ఆరోపణలు వెల్లువెత్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: