ఆ బొమ్మకు నాకు ఏం సబంధం: జైరా

Image result for dangal zaira

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ చిత్రం ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. అయితే ఇందులో నటించిన నటీనటులకు కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది.  అంతే కాదు ఈ మద్య ఇందులో నటించిన   జైరా వసీం కొన్ని వివాదాల్లో చిక్కుకోవడం ఆమెకు అమీర్ అండగా ఉండటం వార్తల్లో చదివాం. తాజాగా జైరా మరో వివాదంలో చిక్కుంది. 'దంగల్‌' బాలనటి జైరా వసీం మరో వివాదానికి కేంద్రబిందువైంది. అయితే ఈ సారి వివాదాన్ని రేపిందిమాత్రం సాక్షాత్తూ కేంద్ర మంత్రి కావడం గమనార్హం. ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో గురువారం ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్‌గోయల్‌.. గ్యాలరీలోని ఓ బొమ్మను జైరా వసీంకు అన్వయించారు. ఆ తర్వాత, జైరా వసీం.. కేంద్రమంత్రి పోలికను తప్పుబట్టారు. సార్.. మీరు వర్ణించినట్లు ఈ బొమ్మకు తాను ఎలా కనెక్ట్ అవుతానని ప్రశ్నించింది. అసలు ఆ బొమ్మకు, తనకు కనీస సారూప్యత లేదని తెలిపింది. బురఖా వేసుకునే వాళ్లు అందంగానే కాకుండా, స్వేచ్ఛగాను ఉంటారని పేర్కొంది. 


రిపబ్లిక్ పై కన్నేసిన ఉగ్రవాదులు:

ఢిల్లీని టార్గెట్‌ చేసిన ఐసిస్

ప్రపంచంలో ఉగ్రవాదం రోజు రోజు కీ పెచ్చుమీరుతుంది.   ప్రతిరోజు ఎక్కడో అక్కడ బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి.  ఈ నేపథ్యంలో  రిపబ్లిక్ డే వేడుకలు దగ్గరపడుతుండటంతో దేశంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. గణతంత్ర దినోత్సవమైన జనవరి 26న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఢిల్లీలోని కోర్టులపై దాడులకు పాల్పడేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తమకు సమాచారం అందిందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఐసిస్‌ ఉగ్రవాదులు తొలుత ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్‌ చేసినట్టు నిఘా వర్గాల దృష్టికి వచ్చింది. కాగా ఉగ్రవాదులు తమ లక్ష్యాన్ని మార్చుకుని కోర్టులు, ఇతర ప్రాంతాల వైపు మళ్లించినట్టు నిఘా వర్గాలు తెలిపాయి.


లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది :


కృషీ పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం అని నిరూపించింది భారత దేశానికి చెందిన ఓ యువతి.  ఉత్తర ప్రదేశ్‌కు చెందిన పెర్నా శర్మ (19) గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించింది.  ఇండియా బుక్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. బోర్డ్‌పై రాసిన అంకెలను ఒక నిమిషం పాటు చూసి తిరిగి చూడకుండా వాటిని యధావిధిగా చెప్పగలదు.  ఇలా ర్యాండమ్‌గా రాసిన 500 అంకెలను చెప్పడంతో గిన్నిస్‌లో చోటు సంపాదించింది.  ఫెర్నా శర్మ మధురలోని బీఎస్ఏ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చదువుతుంది.  అంతే కాదు ఫెర్నా ప్రతిభకు మెచ్చి, ఆమె కుటుంబ నేపథ్యంపై చెలించిన యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ బాలికకు ఓ ఇంటిని బహుకరించడంతో పాటు రూ.5 లక్షలను ప్రోత్సాహకంగా ఇచ్చారు. మంత్రి అజం ఖాన్ తను ఛాన్సలర్‌గా వ్యవహరించే రాంపూర్‌లో గల అలీ జవహర్ యూనివర్శిటీలో ఫెర్నాకు ఉచిత విద్యను అందించే ఏర్పాటు చేశారు.

ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా దాడి :

Image result for america attactk terroiest

ప్రపంచంలో ఉగ్రవాదులు అరాచకాలు పెరిగిపోతున్న నేపథ్యంలో అమెరికా మరోసారి వారికి బుద్ది చెప్పింది.  ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై అమెరికా విరుచుకుపడింది. దాదాపు ఆరేళ్ల తర్వాత బీ-2 స్పిరిట్ బాంబర్లను బయటకు తీసిన అమెరికా ఉగ్రవాదులపై బాంబుల వర్షం కురిపించింది.   లిబియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తలదాచుకున్న శిబిరాలపై బీ-2 బాంబర్లతో దాడి చేసింది. ఈ దాడిలో యూరప్‌లో దాడులు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. గత కొంత కాలంగా ఉగ్రవాదులు అరబ్ కంట్రీలో చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.  అంతే కాదు అమెరికాలో కూడా వైట్ హౌజ్ పై దాడి చేస్తామని అప్పట్లో హెచ్చరికలు కూడా జారీ చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: