అమ్మాయిలు కాని అబ్బాయిలు కాని నైతికతకు తిలోదకాలు ఇవ్వకూడదు. అయితే నైతికత అనేది వ్యక్తిత్వాలపై ఆధారపడి ఉంటుంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన ప్రతి సందర్భంలోనూ దాన్ని అత్యాచారం అనలేమని బాంబే హైకోర్టు మహిళా న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. 


Image result for sexual relation before marriage is a women responsibility

21 ఏళ్ల యువకుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసే సందర్భంగా ఆమె ఇలా అన్నారు. మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ తో అతడు బ్రేకప్ అయి విడిపోయిన తర్వాత, ఆమె అతడిపై రేప్ కేసు పెట్టిన సందర్భంగా విచారణ జరుగుతున్న సమయములో ఆమె పైవిధంగా స్పందించారు.


చదువుకున్న అమ్మాయిలు పెళ్లి కాకుండానే లైంగిక సంబంధం పెట్టుకునే ముందు తమ నిర్ణయానికి తామే బాధ్యత తీసుకోవాలని జస్టిస్ మృదులా భత్కర్ చెప్పారు. ఒకవేళ పెళ్ళికి అంగీకారం పొంది తరవాత మోసం చేస్తే మాత్రం అప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్ర యించవచ్చని ఆమె నిర్ద్వందంగా చెప్పారు. ఆమెను బలవంతంగా శృంగారానికి ఒప్పించారని చెప్పేందుకు "బలమైన సాక్ష్యాలు" ఉండాలని తెలిపారు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడం అనే విషయం మాత్రం ఇలాంటి కేసుల్లో నిలబడదని, పెళ్లికి ముందు కన్య గానే ఉండాల్సిన బాధ్యత మహిళపై ఉందని అది సహజ నైతిక సూత్రమని జస్టిస్ మృదులా భత్కర్ స్పష్టం చేశారు. 


Image result for sexual relation before marriage is a women responsibility

 
సమాజం శరవేగంగా మారుతున్నా నైతిక విలువలు మాత్రం అలాగే ఉన్నాయని పెళ్లి సమయానికి కన్యగానే ఉండాల్సిన బాధ్యత మహిళపై ఉందన్న నైతిక సూత్రం తరతరాలుగా మన దేశంలో ఉందని, అయితే ప్రస్తుత యువతరం మాత్రం పలువురితో మాట్లాడుతూ లైంగిక కార్యకలాపాల గురించి బాగా తెలుసుకుంటున్నారని అన్నారు. 


సమాజం స్వేచ్ఛాయుతం కావడానికి ప్రయత్నిస్తోంది గానీ నైతిక విలువల విషయంలో ఏం చేయాలో అర్థం చేసుకునే సామర్ధ్యం అలవాటు కావట్లేదన్నారు. అబ్బాయితో ప్రేమలో ఉన్నప్పుడు అతడితో శృంగారంలో పాల్గొనాలా? వద్దా?  అనేది ఇద్దరూ ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయమని, అలాంటప్పుడు తాను తీసుకున్న నిర్ణయానికి బాధ్యత వహించాలన్న విషయాన్ని వాళ్లు ఇరువురు మర్చిపోతున్నారని జస్టిస్ అన్నారు. అమ్మాయిలు పెద్దవాళ్లయి, చదువు కూడా ఉన్నప్పుడు పెళ్లికి ముందు సంబంధాల వల్ల వచ్చే ఫలితాల గురించి కూడా ఆలోచించాలని చెప్పారు.  ఇలాంటి సంఘటనలే సమాజాని భ్రష్ఠుపట్టిస్తున్నాయి. 


Image result for sexual relation before marriage is a women responsibility

మరింత సమాచారం తెలుసుకోండి: