ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త్త చాగంటి కోటేశ్వరరావు తన ప్రవచనాలలో భాగంగా యాదవ కులం వారి గురించి అవమానంగా మాట్లాడారు అంటూ ప్రస్తుతం ఏపీ లో రచ్చ జరుగుతోంది. తమ మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నది అంటూ ఆయన ప్రసంగం కి సంబంధించి పలు చోట్ల ఇప్పటికే యాదవులు కేసు కూడా పెట్టారు. ఇప్పటికే కొందరు యాదవ నాయకులు ఆయన ఇంటికి వెళ్ళడం యాదవ నాయకుల పట్ల ఆయనకి ఉన్న అభిప్రాయం, వారి కులాన్ని గురించి వారు తక్కువ చేసి మాట్లాడడానికి గల కారణాలు అడిగి మరీ క్షమాపణలు చెప్పించారు. ఈ నేపధ్యం లో తాను తీవ్ర మనోవేదన కి గురయ్యాను అనీ ఇక మీదట ప్రవచనాలు చెప్పను అని నిర్ణయించుకున్నట్టు గా చాగంటి చెప్పారు అని మీడియా లో ప్రచారం జరిగింది. దీని మీద రాజకీయ నాయకులు ఎవ్వరూ పెద్దగా ఇన్వాల్వ్ కూడా అవ్వలేదు. మొన్న చాగంతిని తాడేపల్లి గూడెం లో యాదవ సంఘాల నేతలు ఆయన్ని గట్టిగా ప్రశ్నించడం ఆయన సమాధానం చెప్పడం కూడా జరిగింది. యాదవుల్ని ఆత్మీయ ఆలింగనం చేసుకోవటానికైనా తాను సిద్దమేనని ప్రకటించారు. మరొక పక్క చాగంటి వారు ప్రవచనాలకి దూరం అనే మాట అభిమానుల్ని తీవ్రంగా కలచి వేస్తోంది. ఆయన ప్రవచనాల కారణంగానే తెలుగు వారి సంస్కృతి దేశ విదేశాల్లో గొప్పగా సాగుతోంది. ఆయన మూలంగానే హైందవ ధర్మాలు తెలుస్తున్నాయని.. ఆయన కానీ ప్రవచనాలు చెప్పకుంటే తెలుగు ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్న వాళ్లు ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఈ విషయం మీద రియాక్ట్ అయ్యి వివరణ ఇచ్చారు. చాగంటిని తప్పు పడుతన్న వర్గంపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని ఆయన చెప్పిన విషయాన్నిగుర్తుచేసిన సోము వీర్రాజు.. కంచె ఐలయ్య శ్రీకృష్ణుడ్ని వ్యభిచారి అని అన్నారని.. ఇతర మతస్థులు దేవుడికి అంతమంది భార్యలా అని ఎద్దేవా చేశారని.. మరి.. వాళ్ల మీద కేసులు పెట్టలేదే? అరెస్ట్ చేయలేదే?అని ప్రశ్నించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: