ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు యాదవులను కించపరిచేలా మాట్లాడారంటూ కొద్దిరోజులుగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనపై పలువురు యాదవులు కేసు పెట్టారు. చాగంటి, యాదవులను కించపరిచారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలు పోలీస్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.


మరోవైపు చాగంటిని సమర్థిస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో క్యాంపెయిన్ జరిగింది. ఆయన యాదవులను ఎక్కడా కించపరచలేదని, ఆయన్ను బజారుకు ఈడ్చవద్దని నెటిజన్లు విజ్ఞప్తి చేశారు. అంతేకాక.. యాదవుల కేసులతో తీవ్ర మనస్థాపానికి గురైన చాగంటి.. ఇకపై ప్రవచనాలను ఆపేస్తానని చెప్పినట్టు ఊహాగానాలు వినిపించాయి. దీంతో.. ఆయన అభిమానులు మరింత ఆందోళనకు గురయ్యారు. అయిందేదో అయిపోయింది.. దయచేసి శాంతించండి అంటూ యాదవులను వేడుకున్నారు.


మరోవైపు ఆ వ్యాఖ్యలపై వివరణ కోరేందుకు పలువురు యాదవులు నేరుగా చాగంటిని కలిశారు. తనకు యాదవులపై పరమ పవిత్ర భావన ఉందని, వాళ్లంటే తనకు వల్లమాలిన అభిమానముందని., వారిని కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రమూ లేదని చెప్పారు. అంతేకాక.. ఏ ఛానల్ లో అయితే ఆ వ్యాఖ్యలు ప్రసారమయ్యాయో.. అదే ఛానల్ లో వివరణ ఇస్తానన్నారు. అంతేకాక.. తన వ్యాఖ్యలతో ఎవరికైనా నొప్పి కలిగి ఉంటే క్షంతవ్యుడినన్నారు.


దీంతో యాదవులు శాంతించారు. చాగంటిపై పలు పోలీస్టేషన్లలో చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకున్నారు. సమస్య సద్దుమణగడంతో చాగంటి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: