అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ముఖాకృతి.. దూకుడు, అనైతిక ప్రవర్తన వంటి లక్షణాలను సూచిస్తోందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.  ఈ తరహా ముఖాకృతి ఉన్నవాళ్లు దూకుడైన మనస్తత్వంతో ఉంటారని, వారు అనైతిక ప్రవర్తననూ చూపుతారని పేర్కొంది. నాయకత్వ బాధ్యతల నిర్వహణలో వ్యక్తుల విజయాలను ప్రభావితం చేసే అంశాలపై బ్రిటన్‌ పరిశోధకులు తాజా అధ్యయనం నిర్వహించారు.


భారతీయుల వలసలపై ట్రంప్‌ భావన తప్పు

ఓ వ్యక్తి నాయకుడిగా ఎదిగే అవకాశాలపై వారి ఎత్తు, ముఖాకృతి, లింగం ప్రభావం ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ఎన్నికల్లో విజయం సాధించడం వెనుక ఆయన ముఖాకృతి కూడా సాయపడిందని పరిశోధకులు పేర్కొన్నారు. ఎత్తు, ముఖం ఉన్న ఆకారం తదితరాలు అతను నాయకుడిగా ఎదిగే తీరును ప్రభావితం చేస్తాయని మరోసారి తేటతెల్లమైందని తెలిపారు. అయితే, ఇలాంటి వ్యక్తులు అనైతిక ప్రవర్తన, ఇతరుల నమ్మకాలను వమ్ముచేసి దోచుకోవడం వంటి లక్షణాలనూ కలిగి ఉండే ముప్పు ఎక్కువేనని పేర్కొన్నారు.



ఎన్నికల సమయంలో ఇరాన్‌తో అణుఒప్పదంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్‌ ఇప్పుడు దానిని పునఃసమీక్షించేందుకు అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా ఇరాన్‌తో న్యూక్లియర్‌ డీల్‌పై చర్చలకు రావాల్సిందిగా ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూను చర్చలకు ఆహ్వానించారు. వచ్చే నెల వీరి మధ్య చర్చలు జరగనున్నట్లు ప్రీమియర్స్‌ ఆఫీసు వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: