అవును! మీరు చదివింది నిజమే. అక్కడ అద్దెకు బాయ్‌ఫ్రెండ్స్ దొరుకుతారు. బ్రాయ్‌ఫ్రెండ్‌కు ఉండాలనుకున్న అర్హతలను బట్టి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా రూ.1015 వేల వరకు చెల్లించేందుకు సిద్ధమైతే అందమైన(నకిలీ) బాయ్‌ఫ్రెండ్‌ను సొంతం చేసుకోవచ్చు.  జీవితంలో విచ్చలవిడిగా స్వేచ్ఛను అనుభవించాలని భావిస్తున్న యువతులు 25 ఏళ్లు దాటుతున్నా వివాహానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఇదే సమయంలో కుటుంబ సభ్యుల ఒత్తిడిని తట్టుకునేందుకు బాయ్ ఫ్రెండ్స్ ను కుటుంబాలకు చూపుతూ, వివాహం చేసుకుంటామని కుటుంబ సభ్యులకు సర్దిచెబుతూ వివాహాన్ని కొంత కాలం వాయిదా వేస్తున్నారు.


అద్దెకు బాయ్‌ఫ్రెండ్స్‌!

సొంత ఊరిని విడిచి ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్లిన అమ్మాయిలు నూతన సంవత్సరం రోజున ఇంటికి చేరుకుంటారు. పెళ్లీడొచ్చిన అమ్మాయిలు ఇంటికి చేరడంతో వారికి వివాహం చేసి పంపించేందుకు ఇదే మంచి తరుణమని కుటుంబ సభ్యులు భావించి పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తీసుకొస్తుంటారు. దీంతో పెద్దల ప్రపోజల్స్ నుంచి తప్పించుకునేందుకు అమ్మాయిలు ఇలా నకిలీ బాయ్‌ఫ్రెండ్స్‌ను తమతోపాటు ఇంటికి తీసుకొచ్చి పెద్దవాళ్లకు పరిచయం చేయాలని భావిస్తున్నారు.



మ్మాయిల అవసరాలకు అనుగుణంగా బాయ్‌ఫ్రెండ్‌గా నటించే వ్యక్తులను అందించే కంపెనీలు చైనాలో చాలానే ఉన్నాయి. నకిలీ బాయ్‌ఫ్రెండ్‌ని పొందాలంటే.. యువతులు రూ. 10 వేల నుంచి 15 వేల వరకు ఖర్చు చేయాల్సివస్తోంది. పర్సనాలిటీ, విద్యార్హతలను బట్టి రేటు ఉంటుంది. అయినా వారు వెనకాడట్లేదు. అయితే మరీ ముక్కూమొహం తెలియని వ్యక్తిని ఇంటికి తీసుకెళ్తే తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేసే అవకాశముంది. అందుకే బాయ్‌ఫ్రెండ్‌గా ఇంటికి తీసుకెళ్లబోయే వ్యక్తితో అమ్మాయిలు ముందుగానే పరిచయం పెంచుకుని వారి వివరాలు సేకరిస్తున్నారట. ఇంటికెళ్లాక తల్లిదండ్రులు అతడి వివరాలు అడిగితే తడుముకోకుండా చెప్పేందుకే ఇలా చేస్తున్నారట. ఏది ఏమైనా ఇప్పుడు చైనాలో అద్దె బాయ్‌ఫ్రెండ్స్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: