తమిళనాడులో గత కొన్ని రోజులుగా శాంతియుతంగా జరుగుతున్న జల్లికట్టు ఆందోళన సోమవారం హింసాత్మకంగా మారింది. జల్లికట్టును చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు చెన్నైలో సోమవారం ఉదయం నుంచి నిరసనలు చేపట్టారు. విద్యార్థులు, యువకులు, మహిళలు, సినీ, రాజకీయ ప్రముఖులు మేముసైతమంటూ రోడ్డెక్కారు. చెన్నై, మధురై, అలంగనల్లూరు, తిరుచ్చి ప్రాంతాల్లో జల్లికట్టు అగ్గిరాజేసింది. మెరీనాబీచ్ లో ఆందోళన తీవ్రరూపం దాల్చింది. నిరసనకారుల్ని ఖాళీ చేయించాలని పోలీసులు ప్రయత్నించారు.
Image result for jallikattu police attack
తమను బలవంతంగా ఖాళీ చేయిస్తే ఆత్మహత్య చేసుకుంటామంటూ ఆందోళనకారులు హెచ్చరించారు.  మరోవైపు  ఆందోళనకారులు చెన్నైలోని ఐస్ హౌస్ పోలీసు స్టేషన్, ట్రిపుల్ కేన్ పోలీస్ స్టేషన్లకు నిప్పు పెట్టారు. పలు వాహనాలకు దగ్ధం చేశారు. ఈ ఘర్షణల్లో కొంతమంది పోలీసు సిబ్బంది సైతం గాయపడ్డారు. జల్లికట్టుపై అసెంబ్లీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడటానికి శాంతంగా ఎదురుచూస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ట్వీట్‌లో కమల్ ప్రశ్నించారు.

ప్రజలు తమ హక్కుల కోసం పోరాటం చేయడంలో తప్పేమిటని ప్రశ్నించారు. మరోవైపు చెన్నైలో కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించిన పోలీసులు, నిరసనను తెలుపుతున్న మహిళలపై లాఠీ ఝుళిపించారు.  దీంతో జల్లికట్టుకు మద్దతుగా ఉద్యమిస్తున్న విద్యార్థులకు అండగా మహిళలు నిలిచారు. వీరిని తరలించే సమయంలోనే హింసాకాండ చెలరేగింది.

చెన్నైలో ఓ హింసాత్మక సంఘటన

కమల్ ట్విట్ :

మరింత సమాచారం తెలుసుకోండి: