ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక..?

ఈ స్థానం నుంచే ప్రియాంక అరంగేట్రం?

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో అధికార సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తు కుదుర్చుకోవడంలో కీలకపాత్ర పోషించిన ప్రియాంకగాంధీ.. రాజకీయ ఆగమనం ఖాయమని వినిపిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్ వాదీపార్టీలు పొత్తు కుదుర్చుకొని పోటీచేస్తున్నాయి.అయితే ఈ పొత్తులో ప్రియాంక గాంధీ కీలకంగా వ్యవహరించారు. ప్రియాంకగాంధీ చొరవ కారణంగానే ఈ రెండుపార్టీల మద్య పొత్తు కుదిరింది.అఖిలేష్ తో ఆమె తెల్లవారుజాము వరకు చర్చల్లో పాల్గొని పొత్తు కుదిరేలా ఒప్పించారు. అయితే ఈ పొత్తు పై ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు. ఈ పోస్టులో ప్రియాంక పేరును ప్రస్తావించలేదు. ఈ పొత్తు వల్ల రెండుపార్టీలకు ప్రయోజనమని రాశారు.  ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో తన తల్లి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి ప్రియాంక పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది. సోనియా తప్పుకొని తన నియోజకవర్గం రాయ్‌బరేలీలో ప్రియాంకకు అవకాశమివ్వవచ్చునని కాంగ్రెస్‌ వర్గాల్లో బలంగా వినిపిస్తోందని 'టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా' ఒక కథనంలో తెలిపింది.


ఎవరెస్ట్‌ ఎత్తును మళ్లీ కొలుస్తారట..!


ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్‌ శిఖరం ఎత్తును తిరిగి కొలవనున్నారు. మరో మూడు నెలల్లో ఎవరెస్ట్‌ ఎత్తు ఎంత ఉందో నిర్ధారించనున్నారు. ఎవరెస్ట్‌ శిఖరం ఎత్తును కొలవడానికి జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) సిద్ధమైంది. ఈ బృహత్‌కార్యక్రమాన్ని మరో రెండు నెలల్లో ప్రారంభించనున్నట్లు సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా డాక్టర్‌ స్వర్ణ సుబ్బారావు తెలిపారు. ఎవరెస్టు ఎత్తును 1855లో ప్రకటించారు. ఎంతోమంది దాన్ని కొలిచారు కూడా. ఇప్పటి వరకు భారత సర్వే ఆఫ్‌ ఇండియా ప్రకటించిన ప్రకారం ఎవరెస్టు సరైన ఎత్తు 29,028 అడుగులు’ అని ఆయన తెలిపారు. భూమిలోపలి భాగంలో పలకల కదలిక, భూకంపాలకారణంగా ఎత్తుతగ్గిందని వచ్చిన అనుమానం, సైంటిఫిక్‌ స్టడీస్‌కు ఉపయోగపడుతుందనే మూడు కారణాల వల్ల తాము మరోసారి ఎవరెస్టును కొలవబోతున్నామని స్పష్టం చేశారు.


కేజ్రీవాల్‌కు 'బావమరిది' షాక్

Arvind Kejriwal's brother-in-law being investigated by Delhi police for Corruption

అవినీతి వ్యతిరేక ఉద్యమంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌కు కొత్త చిక్కు వచ్చి పడింది. తన సొంత బావమరిది సురేందర్ కుమార్ బన్సాల్ అవినీతికి పాల్పడ్డారంటూ ఓ ఎన్జీవో పిటిషన్ దాఖలు చేసింది.  అరవింద్‌ కేజ్రీవాల్‌  సొంత బావమరిది సురేందర్‌ కుమార్‌ బన్సల్‌ అవినీతికి పాల్పడ్డారంటూ ఒక స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. ఢిల్లీ పోలీసు శాఖలోని ఆర్థిక నేరాల విభాగం ఈ విచారణ మొదలుపెట్టింది.  కేజ్రీవాల్ సాయం చేయడం వల్లే ఆయన బావమరిదికి ఈ కాంట్రాక్టు వచ్చిందని ఆరోపిస్తున్నారు. స్వచ్చంధ సంస్థ నిర్వాహకుడు వేసిన పిటిషన్ మీద విచారణ జరపాలా వద్దా అనే విషయమై విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది.  


వ్యాపారవేత్తలకు ట్రంప్‌ వార్నింగ్..!

అమెరికన్ సీఈవోలకు ట్రంప్ గట్టి వార్నింగ్!

అమెరికా వ్యాపారవేత్తలు, సీఈవోలను నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. దేశం వెలుపల తయారీ పరిశ్రమలు నెలకొల్పితే గణనీయంగా సరిహద్దు పన్ను వేస్తామని పేర్కొన్నారు. స్థానికంగా వస్తూత్పత్తి చేస్తే కఠిన నిబంధనలు సడలించి, భారీ స్థాయిలో పన్నులు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా అమెరికాలోనే ఉత్పత్తులను ప్రొడ్యూస్ చేస్తూ ఉద్యోగాలు కల్పించే సంస్థలకు బంపర్ ఆఫర్లు ప్రకటించారు. కంపెనీలను ప్రోత్సహించడానికి భారీమొత్తంలో పన్ను కోత, నిబంధనల్లో వెసులుబాటు కల్పించనున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు.  ఒకవేళ సంస్థలు ఉద్యోగాలను విదేశాలకు మళ్లిస్తే అనూహ్య పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: